ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది,మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించన సంస్థ. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ దానిలో అందరూ చేరడానికి అవకాశం లేదు, కేవలం ఉద్యోగస్తులు మాత్రమే దీనిలో సభ్యులుగా చేరుతారు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) | |
---|---|
Organization అవలోకనం | |
స్థాపనం | 4 మార్చి 1952 |
అధికార పరిధి | India |
ప్రధాన కార్యాలయం | భవిష్యనిధి భవన్, 14, భికైజీ కామా ప్లేస్, న్యూఢిల్లీ |
Organization కార్యనిర్వాహకుడు/ | నీలం ఎస్. రావు, CPFC |
మాతృ శాఖ | కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం |
Parent Organization | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) |
వెబ్‌సైటు | |
.org |
చరిత్ర
మార్చుఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థలలో ఒకటిగా ఉన్నది. ప్రస్తుతం దీనిలో 2019-20 వరకు 24.77 కోట్ల సభ్యుల ఖాతాలను నిర్వహిస్తోంది.
1951 నవంబర్ 15న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ ఆర్డినెన్స్ అమలు లోనికి వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉనికిలోకి వచ్చింది. దీని స్థానంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ యాక్ట్, 1952 వచ్చింది. ఫ్యాక్టరీలు, ఇతర సంస్థల్లోని ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్స్ ను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లుగా ఉద్యోగుల భవిష్య నిధి బిల్లును 1952 సంవత్సరంలో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ చట్టాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ & ఇతర ప్రొవిజన్స్ యాక్ట్, 1952 గా పిలుస్తారు, ఈ చట్టం భారతదేశంలో అమలులో ఉన్నది. ఇందులోని పథకాలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్( దీనిలో ప్రభుత్వ కేంద్ర, రాష్ట్ర అధికారులు, ఉద్యోగుల ప్రతినిధులు గా ఉంటారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు భారతదేశంలో వ్యవస్థీకృత రంగంలో నిమగ్నమైన శ్రామిక శక్తి కోసం కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ పథకం, భీమా పథకాన్ని నిర్వహిస్తుంది. ఈ బోర్డుకు ఎంప్లాయీస్ పిఎఫ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) సహాయం చేస్తుంది, ఇందులో దేశవ్యాప్తంగా 138 ప్రాంతాలలో సంస్థ కార్యాలయాలు ఉన్నాయి.[1]
లాభాలు
మార్చుఉద్యోగి, యజమాని ఇపీఎఫ్ కంట్రిబ్యూషన్ చేయడం తప్పనిసరి. ఉద్యోగుల మూల వేతనం (బేసిక్ పే ), అధిక ధరల( కరువు) భత్యం ( డియర్ నెస్ అలవెన్స్)లతో వేతనంలో 12 శాతం ఇపీఎఫ్ కింద జమచేస్తారు. ఉద్యోగి వేతనంలో 12 శాతం ఈపీఎఫ్ కు కంట్రిబ్యూషన్ కోసం యజమాని నెలవారీ వేతనంలో తీసి, ఆ మొత్తం ఇపీఎఫ్ ఖాతాకు జమచేయడం జరుగుతుంది. ఉద్యోగి ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అత్యవసర సమయంలో ఉద్యోగికి ఆర్థికంగా సహాయపడుతుంది. పదవీ విరమణ సమయంలో తాను జమచేసిన మొత్తం డబ్బు అమలులో ఉన్న వడ్డీతో అతనికి రావడం జరుగుతుంది.[2]
ఇపీఎఫ్ పెన్షన్ స్కీమ్ 1995
మార్చుఉద్యోగుల భవిష్య నిధి పథకంలో పెన్షన్ పథకం నవంబర్ నుంచి 1995 అమలులో రావడం జరిగింది. ఇపీఎఫ్ పెన్షన్ స్కీమ్ 1995 అనేది భారతదేశంలోని తమ సభ్యుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించి, అమలు చేసిన సంక్షేమ పథకం . 1995 పెన్షన్ పథకం లో 1971 కుటుంబ పెన్షన్ కుటుంబ పింఛను పథకంలో సభ్యులుగా ఉన్న వారంతా కొత్త పథకంలో సభ్యులుగా మారుతారు. నవంబర్ 16, 1995 నుండి, పెన్షన్ స్కీమ్‌లో ఉద్యోగి వేతనంలో 12 శాతం ఈపీఎఫ్ కు జమ చేస్తారు. అయితే, ఉద్యోగి వాటా మొత్తం యజమాని వాటాలో 8.33 శాతం, ఉద్యోగుల పెన్షన్ స్కీం (ఈపీఎస్) కు, 3.67 శాతం ప్రతి నెలా ఇపీఎఫ్ కంట్రిబ్యూషన్ కు వెళతాయి. ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తం నుండి పెన్షన్, సంబంధిత ప్రయోజనాలను అందించడం ఈ పథకం ఉద్దేశ్యం. దీని నిర్వహణ పూర్తిగా ఉద్యోగుల భవిష్య నిధి ధర్మకర్తల మండలిలో ఉంది. బోర్డు ఛైర్మన్‌గా కేంద్ర కార్మిక శాఖ మంత్రి,సభ్యులుగా కేంద్ర కార్మిక సంఘాల నాయకులు ఉంటారు. నవంబర్ 16, 1995న ప్రకటించిన పింఛను పథకం ప్రకారం, 58 ఏళ్లు నిండిన తర్వాత పదవీ విరమణ చేసి, కనీసం 10 ఏళ్లపాటు పెన్షన్ ఫండ్‌కు జమ చేసిన ఉద్యోగికి నెలవారీ పెన్షన్ చెల్లిస్తారు.[3]
మూలాలు
మార్చు- ↑ "Employees' Provident Fund Organisation". www.epfindia.gov.in. Retrieved 2023-01-06.
- ↑ "EPF - Employees' Provident Fund, EPFO Benefits & Process". www.bankbazaar.com (in Indian English). Retrieved 2023-01-06.
- ↑ "Employees' Pension Scheme (EPS): Eligibility, Calculation & Formula". paisabazaar.com/. 6 January 2023. Retrieved 6 January 2023.
{{cite web}}
:|archive-date=
requires|archive-url=
(help)