ఎంబా ఘోటో
సమర్పాన్ సోడిమెజో,[1][2] (సాధారణ నామం "ఎంబా ఘోటో ") (డిసెంబరు 31, 1870 - ఏప్రిల్ 30, 2017) ఇండోనేషిఅయ క్రిస్టియన్.[3] ఆయన శతాధిక వృద్ధునిగా భావింపబడుతున్నవాడు.[4] మే 2010లోజనాభా లెక్కల అధికార్లు తన తరువాత జన్మదినం 142 గా గుర్తించారని తెలిపారు.[5] అధికారికంగా అత్యధిక వయస్సు ఉన్న "జెన్నే కాల్మెంట్" కన్నా ఈయన 19 సంవత్సరాలు పెద్దవాడిగా గుర్తించారు.[1][2] ఆయన వయస్సు 146 ఏళ్లు. ఆయన నలుగురు భార్యలు, పది మంది పిల్లలు ఎప్పుడో మరణించారు. ఆయన వయస్సును నిపుణులు అధికారికంగా ధ్రువీకరించకపోయినా గుర్తింపు కార్డుపై ఆయన పుట్టిన తేదీ డిసెంబర్ 30, 1870 అని రాసి ఉంది. స్థానికులు కూడా ఆయనకు అంత వయస్సు ఉంటుందనే చెబుతున్నారు.[6] "లిపుటన్ 6" అనే వెబ్‌సైటు ఎంబా ఘోటో వయసు సుమారు 140 ఉండవచ్చనీ, తాను 1880 లో కట్టబడిన సుగర్ ఫ్యాక్టరీ నిర్మాణం గూర్చి తన జ్ఞాపకాలను ప్రస్తావిస్తున్నాడనీ తెలియజేసింది.[7]
ఎంబా ఘోటో | |
---|---|
జననం | సమర్పాన్ సోడిమెజో 1870 డిసెంబరు 31 (claimed) సెంట్రల్ జావా, డచ్ ఈస్టు ఇండీస్ |
మరణం | 2017 ఏప్రిల్ 30 (aged 146 సంవత్సరాలు, 120 రోజులు) బలుగా, సెంట్రల్ జావా, ఇండోనేషియా. |
జాతీయత | ఇండోనేషియా |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | శతాధిక వృద్ధుడు |
పిల్లలు | 5 |
తల్లిదండ్రులు | సెట్రోడిక్రోమో, సాలియెం |
ఎంబా ఘోటో పుట్టిన తేదీ నిజమే అయితే ఆయన గురించి ఎన్నో విశేషాలు చెప్పవచ్చు. ఆయన రెండు ప్రపంచ యుద్ధాలు చూడడమే కాకుండా డచ్ ఈస్ట్ ఇండీస్‌పై జపాన్ దురాక్రమణను కూడా చూసే ఉంటారు. సోవియట్ యూనియన్‌లో కమ్యూనిస్టు విప్లవాన్ని తీసుకొచ్చిన వ్లాదిమీర్ ఇల్లిచ్ లెనిన్ కూడా అదే సంవత్సరంలో పుట్టారు. సూయజ్ కెనాల్ ప్రారంభమైన ఏడాదికే ఆయన పుట్టారన్నమాట. అంతేకాదు ఘోటో చావుకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే డే రోజున ఆయన మరణించారు. ఇంత ఎక్కువ కాలం ఆయన బతకడానికి కారణం ఏమిటని గత ఏడాది ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ని మీడియా ప్రశ్నించగా ఆయన ఇచ్చిన సమాధానం మరీ ఆశ్చర్యం కలిగిస్తుంది. చైన్ స్మోకింగ్ వల్ల ఎక్కువ కాలం బతికినట్లు ఆయన చెప్పారు. ఆయన పుట్టినరోజు వేడుకలకు ఆయన నలుగురు మనవళ్లు హాజరయ్యారు. వారి కథనం ప్రకారం ఘోటో ముప్పూటలా అంబలి తాగుతారు.[8]
ఇప్పటి వరకు అధికారిక రికార్డుల ప్రకారం ప్రపంచంలో ఎక్కువ వయస్సు వరకు బతికినది ఫ్రెంచ్ మహిళ జియన్నే కాల్మెట్. ఆమె 122వ ఏట మరణించారు. ఇప్పటి వరకు అధికారకంగా ఆమె వయస్సును దాటి ఎవరూ బతికి లేరు. ప్రపంచంలో ఏ మనిషి కూడా 125 ఏళ్లకు మించి బతికే ప్రసక్తే లేదని న్యూయార్క్‌లోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మెడికల్ కాలేజీ పరిశోధకులు ఇప్పటికే తేల్చిచెప్పారు. అయితే ఘోటో తరహాలోనే నైజీరియాకు చెందిన ఓలో ఫిన్తూయీ 171 ఏళ్లు, ఇథియోపియాకు చెందిన ధాకబో ఎబ్బా 163 ఏళ్లు బతికినట్లు చెబుతారు.[9]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Taufiq Sidik Prakoso (25 August 2014). "Inilah Mbah Gotho, Manusia Tertua Asal Sragen yang Kini Berusia 144 Tahun" [Mbah Gotho from Sragen, Oldest Human Now Aged 144 Years]. Solopos (in Indonesian). Surakarta, Indonesia: Aksara Solopos. Archived from the original on 5 మే 2017. Retrieved 2 September 2016.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ 2.0 2.1 Abrori, Fajar (24 August 2016). "Kini Berusia 146 Tahun, Apa Rahasia Panjang Umur Mbah Gotho?" [Now 146 years old, what are Mbah Gotho's secrets of longevity?]. Liputan 6 (in Indonesian). Jakarta: SCTV. Archived from the original on 28 ఆగస్టు 2016. Retrieved 27 August 2016.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ DINDA LEO LISTY (1 May 2017). "Doa Umat Islam dan Kristen untuk Arwah Mbah Gotho" (in Indonesian). Tempo. Retrieved 2 May 2017.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "145-year-old Indonesian man's age doubted by expert". The Nation. Bangkok: Nation Multimedia Group. Deutsche Presse-Agentur. 31 August 2016. Archived from the original on 17 జూలై 2017. Retrieved 2 September 2016.
- ↑ trh (20 May 2010). "Sodimejo, Manusia tertua di Sragen". Solopos (in Indonesian). Surakarta, Indonesia: Aksara Solopos. Archived from the original on 15 సెప్టెంబరు 2016. Retrieved 2 September 2016.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "'Oldest human' dies in Indonesia 'aged 146'". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2017-05-01. Retrieved 2017-05-01.
- ↑ AIS (24 May 2010). "Kakek Berusia 140 Tahun Juga Ada di Sragen". Liputan 6 (in Indonesian). Jakarta: SCTV. Retrieved 3 September 2016.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ పొగతాగే 146 ఏళ్ల ఎంబా కన్నుమూత
- ↑ పొగతాగే 146 ఏళ్ల ఎంబా కన్నుమూత