ఎం.ఎన్ వెంకటస్వామి
ఎం.ఎన్ వెంకటస్వామి ఇండియా లోనే ఇంగ్లీషులో జీవిత చరిత్రను రాసిన మొట్టమొదటి దళితుడు.1904 వ సంవత్సరంలో హైదరాబాద్ ప్రాంతంలోని అసఫియా లైబ్రరీ (ఇప్పటి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ)లో గ్రంథపాలకుడిగా పనిచేసిన ఎం.ఎన్ వెంకటస్వామి పూర్తి పేరు మ్యాదరి నాగయ్య వెంకటస్వామి.[1]
జననం
మార్చుహైదరాబాద్ నుంచి జాల్నా (మహారాష్ట్ర-ఒకప్పటి నిజాం యిలాకా)కు వలసబోయిన కుటుంబంలో జన్మించిన తెలుగు దళితుడు నాగయ్య, తులశమ్మల దంపతులకు ఎం.ఎన్ వెంకటస్వామి 1865లో జన్మిచాడు. నాగయ్య దేశంలోనే మొట్ట మొదటి సారిగా హోటల్ బిజెనెస్ ప్రారంభించిన దేశీయుడు. బ్రిటీషువారు నాగయ్యను గౌరవంగా ‘నాగులు’ అని పిలిచేవారు. అందుకే వెంకటస్వామి తన తండ్రి జీవిత చరిత్రను 1909లో ‘లైఫ్ ఆఫ్ ఎం నాగ్లు’ పేరిట ప్రచురించాడు. (‘లైఫ్ ఆఫ్ ఎం నాగ్లు : ది ఫాదర్ ఆఫ్ ది హోటల్ ఎంటర్‌ప్రైజ్ ఇన్ ద సెంట్రల్ ప్రావిన్సెస్, అండ్ హెడ్ గుమాస్తా టు ద మహానాడు’ అనేది పూర్తిశీర్షిక) అదృష్ట వశాత్తు ఆ పుస్తకం కాపీలు కొన్ని ఇంగ్లండ్‌కు పంపడంతో లండన్ బ్రిటిష్ మ్యూజియం లైబ్రరీలో ఒక కాపీ అందుబాటులో ఉన్నది.అదే విధంగా వెంకటస్వామి గురించి 2020 లో లీలా ప్రసాద్ అనే డ్యూక్ యూనివర్సిటీ ప్రొఫెసర్, 2021లో కార్ల్‌టన్ యూనివర్సిటీ (కెనడా)కు చెందిన జంగం చిన్నయ్యలు కొంత రాసారు . చాలా ఏండ్ల కిందట సీనియర్ జర్నలిస్టు జి.కృష్ణ కూడా వీరి గురించి రాసాడు వీటి ఆధారంగా వెంకటస్వామి గురించి తెలిసింది. [2]
జానపదం లో విశేషమైన కృషి
మార్చు.వెంకటస్వామి తన తండ్రి జీవిత చరిత్ర రాయడమే గాకుండా 1893 నుంచి 1930ల వరకు ‘ఫోక్‌లోర్’, ‘ఇండియన్ అంటిక్వరీ’ ఇంకా ఇతర పత్రికల్లో తెలుగు జానపద గేయాల గురించి అనేక వ్యాసాలు రాసాడు ఎం.ఎన్. వెంకటస్వామి. ఇవన్నీ ఇంగ్లీషులోనే రాయడం విశేషం.అట్లా తెలుగు వారి జానపద విజ్ఞానాన్ని ప్రపంచానికి మొదటిసారిగా తెలియజేసిన వ్యక్తిగా వెంకట స్వామిని చెప్పుకోవచ్చు. అంతేగాదు ‘బొబ్బిలి యుద్ధగాథ’ను ‘దండదాసర్లు’ చెబుతూ ఉంటే రాసుకొని, పరిశోధన చేసి 1919లో ఇంగ్లీషులో పుస్తకంగా ప్రచురించాడు. దీనికి ప్రఖ్యాత చరిత్రకారుడు జాదునాథ్ సర్కార్ ముందుమాట రాసాడు.జానపద గేయాలపై మూడు పుస్తకాలను రాసిండు. 1927లో మదరాసు మెథడిస్ట్ పబ్లిషింగ్ హౌజ్ వాండ్లు ఈయన వ్యాసాలను ‘ది ఫోక్ స్టోరిస్ ఆఫ్ ది లాండ్ ఆఫ్ ఇండ్ (ఇండియా)’ పేరిట వెలువరించారు.ఇవే గాకుండా రామాయణాన్ని ఆంగ్లీకరించిన రాల్ఫ్ టి.హెచ్. గ్రిఫిత్ జీవితాన్ని గురించి కూడా రాసిండు.జానపద కథలు చెప్పే దళితుల నుంచి విస్తృతంగా సమాచారాన్ని సేకరించి వాటిని చారిత్రక కథలుగా, జానపద గేయాలుగా మనకందించిన మేటి వెంకటస్వామి.
సాహిత్యం
మార్చుసంకలో పిల్ల/ నెత్తిమీద గుల్ల/ చాదర్‌ఘాట్ బాట/ పామెర్‌సాబ్ కడుతుండు/ కూలికి పోదామ’’ అంటూ 1810 నాటి విలియమ్ పామర్ కంపెనీకి సంబంధించిన భవన నిర్మాణం, యువ భార్యభర్తల సంభాషణను గురించి గేయాన్ని పేర్కొన్నాడు. చాదర్‌ఘాట్ బ్రిడ్జి కాంట్రాక్టర్ ఈయనే! బహుశా ఆధునిక దృక్కోణంతో కార్మికుల గురించి చెప్పిన తొలి గేయంగా దీన్ని పేర్కొనవచ్చు.
‘‘చందమామ చందమామ చక్కంగా రావె/ గోలకొండ పోదాము/ గొర్రెని తెద్దాము/ గొర్రె బుడ్డెడు పాలిచ్చె/ పాలు తీసుకొని కోమటోడికిచ్చె/ కోమటోడు కొబ్బరి బెల్లం ఇచ్చె/ కొబ్బరి బెల్లం తీసుకొని స్వామికిస్తే/ స్వామి పూవు ఇచ్చె/ పూవు తీసుకొని మా అక్క కొప్పుల పెట్టిన’’ అనే గేయాన్ని 1901 నాటికే పత్రికల్లో ప్రకటించాడు.
మరణం
మార్చు1931 వ సంవత్సరంలో మరణించాడు.
గ్రంథాలు
మార్చు- లైఫ్ ఆఫ్ ఎం నాగ్లు
- ‘ఫోక్‌లోర్’
- ‘ఇండియన్ అంటిక్వరీ’
- ‘బొబ్బిలి యుద్ధగాథ’
- టి.హెచ్. గ్రిఫిత్ (జీవిత చరిత్ర )
మూలాలు
మార్చు- ↑ "Figure 7. M. N. Venkataswami. Reproduced from M. N. Venkataswami,..." ResearchGate (in ఇంగ్లీష్). Retrieved 2022-01-18.
- ↑ "మన జానపదాన్ని ప్రపంచం ముందుంచిన మేటి". andhrajyothy. Archived from the original on 2022-01-18. Retrieved 2022-01-18.