ఎం.ఎ.సుభాన్ (కళాసాగర్‌ సుభాన్‌ గా సుపరిచితుడు) అలియాస్ భరత్ తెలుగు భాషాభిమాని. మూడు దశాబ్దాల పాటు చెన్నై నుంచి తెలుగు సంస్కృతీ సౌరభాలను వెదజల్లి, విమర్శకుల నుంచి సైతం గుర్తింపు పొందిన కళా సాగర్‌ సంస్థ వ్యవస్థాపకుడు.

ఎం. ఎ. సుభాన్
జననం
మరణం2021 జూన్ 22
విల్లివాక్కం, చెన్నై
వృత్తిరైల్వే ఉద్యోగి
ఉద్యోగంభారతీయ రైల్వే

జీవిత విశేషాలు మార్చు

ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా క్రొవ్విడి. రైల్వే ఇంటెగ్రెల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ లో సాధారణ ఉద్యోగిగా చేరాడు. అక్కడ పనిచేస్తున్నప్పుడు తెలుగు ఔత్సాహికులందరినీ కలుపుకొని చెన్నైలో తెలుగు భాషా సంప్రదాయాలను పునరుద్ధరించడానికి కళాసాగర్ అనే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఆ సంస్థ పేరిట ఇచ్చే అవార్డును కళాకారులు అప్పట్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించేవారు. నాటి తెలుగు సిసిమా నటి భానుమతి సూచనతో ఏర్పాటు చేసిన కళాసాగర్‌ సంస్థ అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా 1972 జూన్‌లో ప్రారంభమైంది.[1] ఈ కళా సంస్థకు డాక్టర్‌ సీఎంకేరెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సినీ కళాకారుల ప్రతిభకు ఇచ్చే నంది అవార్డుల కంటే ముందే కళాసాగర్‌ అవార్డులు ఇచ్చేవారు.[2]

ఈయన "కధా సాగర్" పుస్తక సంపాదకుడు.[3] యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిస్ (అమెరికా) వారు 20వ శతాబ్దికి ఎంపిక చేసిన 100 ఉత్తమ గ్రంథాలలో ఒకటిగా ఎంపికైన గ్రంథం ఇది. 20వ సహస్రాబ్ది చివరి దశాబ్దంలో తెలుగు నేలపై విభిన్న ప్రక్రియల్లో ప్రభావం చూపిన 10 గ్రంథాలలో ఒకటిగా "ఇండియాటుడే" దీన్ని ఎంపిక చేసింది. ఈ పుస్తకం "కళాసాగర్" రజతోత్సవ సందర్భంగా 87 కథలతో వెలువడింది.

ఈయన 2021, జూన్ 22, మంగళవారం చెన్నైలో విల్లివాక్కంలోని స్వగృహంలో తన 90వ యేట మరణించాడు.[4]

మూలాలు మార్చు

  1. "'కళాసాగర్‌' సుభాన్‌ కన్నుమూత". andhrajyothy. Retrieved 2021-06-24.
  2. "కళాసాగర్‌ సుభాన్‌ కన్నుమూత". Sakshi. 2021-06-23. Retrieved 2021-06-24.
  3. "పుస్తకం » Blog Archive » కథాసాగర్ – జన జీవన ప్రతిబింబాల కథానిధి" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-24.
  4. "'కళాసాగర్‌' సంస్థాపకఅధ్యక్షులు సుభాన్‌ కన్నుమూత". EENADU. Retrieved 2021-06-24.