ఎక్వీరా ఆయ్ మందిర్

ఎక్వీరా (ఎక్వీరా అని కూడా పిలుస్తారు) [1] ఈమె ఒక హిందూ దేవత, ఈమెను రేణుకా దేవత రూపంగా పరిగణిస్తారు [2] ఆమె కోలి ప్రజల కులదేవత. [3] [4] ప్రతి సంవత్సరం కోలీలు ఎక్వీరాకు గౌరవం ఇస్తారు. కర్లా గుహలలో ఉన్న ఈ ఆలయప్రదేశంలో పండుగ జరుపుకుంటారు.[5]

Ekvira
Idol of the goddess
Idol of the goddess
ప్రదేశం
దేశం:India
రాష్ట్రం:Maharashtra
జిల్లా:Pune
ప్రదేశం:Karla Caves
అక్షాంశ రేఖాంశాలు:18°47′00″N 73°28′14″E / 18.78333°N 73.47056°E / 18.78333; 73.47056
ఇతిహాసం
సృష్టికర్త:Koli people

మందిరం మార్చు

 
దేవత ఎక్వీరా ఆలయం, కర్లా గుహలు

ఎక్వీరా ఆయ్ మందిర్ భారతదేశం,మహారాష్ట్రలోని లోనావాలా సమీపంలో ఉన్న కర్లా గుహల సమీపంలో ఉన్న ఒక హిందూ దేవాలయం.ఇక్కడ ఒకప్పుడు బౌద్ధమతానికి కేంద్రంగా ఉన్న గుహలపక్కనే ఎక్వీరాదేవత ఆరాధన నిర్వహిస్తారు.ఈ ఆలయం ఆగ్రి,కోలిప్రజలకు ప్రధాన పూజా స్థలం. ఆలయ-సముదాయం వాస్తవానికి పడమర దిక్కుకు అభిముఖంగా వరుసగా మూడు సారూప్య మందిరాలను కలిగి ఉంది.వీటిలోమధ్య, దక్షిణ పుణ్యక్షేత్రాలు పూర్తి స్థాయిలో భద్రపరిచారు.మిగిలిన నిర్మాణాలు మాత్రం ప్రణాళిక ప్రకారం భద్రపరచబడ్డాయి. మహా-మండప, వర్ష-మండప, గోపుర మండప ఈ మూడు మందిరాల ముందు నెలకొని ఉన్నాయి.ఈ మూడు పుణ్యక్షేత్రాల చుట్టూ అదనపు పరివారదేవతల పదహారు మందిరాలు ఉన్నాయి. నవరాత్రులు, చైత్ర నవరాత్రుల సందర్భంగా భక్తులు ఈ ఆలయానికి తరలివచ్చి పూజలు జరుపుకుంటారు.ఈ దేవతకి అద్భుత శక్తులు ఉన్నాయని భక్తులు నమ్ముతారు. [6]ఈ ఆలయం కొండపై ఉంది.ఆలయానికి చేరుకోవడానికి దాదాపు 500 మెట్లు ఎక్కాలి.దీని చుట్టూ కర్లా గుహలు ఉన్నాయి.ఇవి పురావస్తు పరిశోధన శాఖచే రక్షింపబడుచున్నాయి.ప్రధాన దేవత ఎక్వీరా అయితే ఆమె జోగేశ్వరీ దేవి మూర్తితో కలిసి ఉంటుంది.

ఆలయ నిర్మాణం మార్చు

పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారు ఇంటికి, దేవుళ్లకు దూరంగా ఉన్నప్పుడు పూజించే స్థలంగా ఎక్వీరా ఆలయాన్ని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. వారు ఈ ఆలయాన్ని రాత్రిపూట నిర్మించారని పురాణ కథనం. వారు వ్యక్తిగతంగా నిర్మించి, సందర్శించి, ఎక్వీరా మాత ఆశ్వీర్వాదాలను కోరారు.

2వ శతాబ్దంలో, 10వ శతాబ్దంలో లోపల ఉన్న పుణ్యక్షేత్రం అభివృద్ధి చేయబడినందున అక్వీరా ఆయ్ మందిర్ మూలం గురించి వాదనలు సరైనవని ఇటీవల నిర్ధారించబడింది. అనేక మంది పురావస్తు శాస్త్రజ్ఞులు ఆలయ వాస్తవాలను సరైన వాదనలను ఒక్కొక్కటిగా నిరూపించడానికి పని చేస్తున్నారు.[7]

మూలాలు మార్చు

  1. Punekar, Vinaja B. (1959). The Son Kolis of Bombay. New Delhi, India: Popular Book Depot. pp. 160: The deity was the goddess worshipped by Ekveera, who is also mentioned in the Devi Bhāgavata ( Skandha 6, Adhyāya 17 : 23 ) . Jejuri is the seat of Khandobā . The seat of Ekveerā is popularly known as “ Āy Jāge ' ( place of the mother ).{{cite book}}: CS1 maint: date and year (link)
  2. Saravanan, V. Hari (2014). Gods, Heroes and their Story Tellers: Intangible cultural heritage of South India (in ఇంగ్లీష్). Notion Press. ISBN 978-93-84391-49-2.
  3. Chugh, Lalit (2017-05-23). Karnataka's Rich Heritage – Temple Sculptures & Dancing Apsaras: An Amalgam of Hindu Mythology, Natyasastra and Silpasastra. Notion Press. p. 53. ISBN 978-1-947137-36-3.
  4. Srinivas, Smriti; Jeychandran, Neelima; Roberts, Allen (2022-10-28). Devotional Spaces of a Global Saint: Shirdi Sai Baba's Presence. Taylor & Francis. ISBN 978-1-000-60406-1.
  5. Patil, Nilesh (April 17, 2011). "Koli community from Thane pay respect to Ekvira Goddess at annual festival". Mumbai Mirror. Retrieved 2022-10-13.
  6. Subodh Kapoor (1 July 2002). The Indian Encyclopaedia. Cosmo Publications. p. 2042. ISBN 978-81-7755-257-7. Retrieved 23 April 2012.
  7. "Ekvira Devi Temple Lonavala | Ekvira Temple in Maharashtra". MaharashtraPlanet.com. Retrieved 2023-05-10.

వెలుపలి లంకెలు మార్చు