జంతువులలో కొన్ని జాతులు గాలిలో ఎగుర గలిగేవిగా పరిణామం చెందాయి. వీటిని ఎగిరే జంతువులు ('Flying and gliding animals) గా పరిగణిస్తారు. వీటిలో కీటకాలు, పక్షులు, గబ్బిలాలు ముఖ్యమైనవి. దట్టమైన అడవులలో ఇవి ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టు మీదకు ఎగరడానికి వీలుగా పరిణామం చెందాయని భావిస్తారు.

Greylag geese (Anser anser) in flight.

ఎగిరే జంతువులు మార్చు

  • కీటకాలు (Insects) : జీవజాతులన్నింటిలో మొదటిసారిగే ఎగరడం నేర్చుకున్నవి కీటకాలు. ఇంచుమించుగా ఈగలు, దోమలు మొదలైన చాలా రకాలు ఎగరగలిగే విధంగా చిన్న రెక్కలు కలిగువుండి అతి త్వరగా ఎగిరే శక్తిని కలిగివుంటాయి.
 
Band-winged flying fish. Note the enlarged pectoral fins.
  •  
    గ్లైడింగ్ డ్రాకో బల్లి
  • చేపలు (Fish) : ఈ ఎగిరే చేపలు సుమారు 50 జాతులు ఎక్సోకీటిడే (Exocoetidae) కుటుంబానికి చెందినవి. ఇవి ఎక్కువగా సముద్రంలో జీవించే చిన్న , మధ్య రకంగా ఉంటాయి. వీటిలో అన్నింటికన్న పెద్దవి 45 సెం.మీ. పొడవు ఉంటాయి. వీటిని రెండు రెక్కలు , నాలుగు రెక్కలు కలిగేవిగా విభజిస్తారు. గాలిలోకి ఎగిరే ముందు ఈ చేపలు నీటిలో త్వరగా ఈదుతూ సుమారు 60 కి.మీ. వేగం చేరిన తర్వాత గాలిలోకి ఎగురుతాయి.[1]
 
Birds are the most successful group of flying vertebrate.
  • పక్షులు (Birds) : సుమారు అన్ని రకాల పక్షులు రెక్కలతో స్వేచ్ఛగా గాలిలో ఎగిరి సుదూర తీరాలకు ప్రయాణిస్తాయి. మనిషి పక్షి ఎగిరే విధాన్ని పరిశీలించే విమానాన్ని కనిపెట్టి దూర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరగలుగుతున్నాడు.
  • ఉభయచరాలు (Amphibians) : ఎగిరే కప్పలు హైలిడే , రాకోఫోరిడే కుటుంబాలకు చెందినవి ముఖ్యమైనవి. వీనిలో Old World కి చెందినవి Rhacophoridae , New World కి చెందినవి Hylidae. వీటికి ఎగిరేందుకు అనువుగా కాలివేళ్ల మధ్య పొరలు అభివృద్ధిచెందాయి.
  • సరీసృపాలు (Reptiles) : డ్రాకో బల్లులు (Draco lizards) డ్రాకో ప్రజాతికి చెందిన సుమారు 28 జాతుల బల్లులు. ఇవి శ్రీలంక, భారతదేశం, తదితర ఆసియా దేశాలలో కనిపిస్తాయి. ఇవి చెట్లపై నివసించి చీమలను ఆహారంగా తింటాయి. ఇవి సుమారు 60 మీటర్ల వరకు ఎగురగలవు.[1] వీటి పక్కటెముకల నుండి సాగే పొర సహాయంతో ఎగురగలుగుతాయి.
  • క్షీరదాలు : గబ్బిలాలు (Bats) చాలా వరకు దూర ప్రాంతాలు ఎగిరి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. ఎగిరే ఉడుతలు (Flying squirrels) సుమారు 43 జాతులున్నాయి. ఇవి ఎక్కువగా రాత్రి సమయంలో కాలికి ఉండే 'పటాజియం' అనే చర్మ నిర్మాణం సహాయంతో ఒక చెట్టు మీదనుండి మరొక చెట్టు మీదకు 200 మీటర్ల దూరం ఎగురగలవు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Piper, Ross (2007), Extraordinary Animals: An Encyclopedia of Curious and Unusual Animals, Greenwood Press.