ఎడ్గార్. థర్స్టన్ (Edgar Thrustan)
ఎడ్గార్థర్స్టన్ (Edgar Thrustan) ఎడ్గార్. థర్స్టన్ అనే బ్రిటిష్ అధికారి The Casts and Tribes of South India పేరుతో ఏడు సంపుటాలు తయారు చేశారు(1909). ఈ సంపుటాలకు కె.రంగాచారిM.A., సహాయ సంపాదకులుగా పనిచేశారు. వలస పాలకులు తమ పరిపాలనా సౌలభ్యం కోసమో, స్వీయ ఆసక్తి వలననో మన చరిత్ర, సంప్రదాయాలు, భాషల గురించి బోలెడంత విషయం సేకరించి అందించిన పోయారు. ఇప్పుడు అంత మనసుపెట్టి పరిశోధించి ఆ బృహత్.ప్రణాళికలను అమలు చేయలేమేమో అని అనిపిస్తుంది. ఈ సంపుటాలలో దక్షిణ భారత దేశంలోని వివిధ ఆదివాసీలు, జాతుల, కులాలవారీగా ప్రజల జీవనవిధానం, పుట్టుకనుంచి, వివాహం, అంత్యక్రియల వరకు వివరంగా గ్రంధస్థం చేశారు. ఇందులో అపూర్వమైన ఫొటోలు కూడా ఉన్నాయి. పరిశోధకులు తరచూ సంప్రదించే గ్రంథం. నెల్లూరు వర్ధమాన సమాజం గ్రంథాలయంలో నెల్లూరు మేన్యువల్, గజిటీరు, ఈ సంపుటాలు రెఫరెన్సు విభాగంలో భద్రపరచబడి ఉన్నాయి.
మూలాలు:1.Thurston, Edgar (1909). The Castes and Tribes of Southern India, A – B. Vol. I. Madras: Government Press.