ఎడ్వర్డ్ స్నోడెన్
ఎడ్వర్డ్ స్నోడెన్ (ఆంగ్లం: Edward Snowden; జననం 1983 జూన్ 21) ఒక అమెరికా కంప్యూటరు నిపుణుడు. అతను మొదట్లో అమెరికా ప్రభుత్వ నిఘా సంస్థ అయిన సెంట్రల్ ఇంటెలిజన్స్ ఏజెన్సీ (సీఐఏ) లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గానూ, డిఫెన్స్ ఇంటెలిజన్స్ ఏజన్సీ (డీఐఏ) లో కౌంటర్ ఇంటెలిజన్స్ శిక్షకుడిగా పనిచేశాడు. తరువాత డెల్ సంస్థ తరపున ప్రైవేటు కాంట్రాక్టర్ గా జపాన్ లో ఉన్న నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA) సంస్థలో చేరాడు. మార్చి 2013న హవాయి లోని బూజ్ అలెన్ హమిల్టన్ అనే కన్సల్టింగ్ సంస్థలో చేరాడు. [2] జూన్ 2013న అతను ముందు పనిచేసిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, [3] బూజ్ అలెన్ హమిల్టన్ [4] నుంచి సేకరించిన అనేక రహస్య పత్రాలను పలు మీడియా సంస్థలకు వెల్లడించడంతో అంతర్జాతీయంగా వార్తల్లోని వ్యక్తి అయ్యాడు. అమెరికా చరిత్రలో మునుపెన్నడూ ఇంత పెద్ద ఎత్తున రహస్యాలు వెల్లడి కాలేదు.
ఎడ్వర్డ్ స్నోడెన్ | |
---|---|
జననం | ఎడ్వర్డ్ జోసెఫ్ స్నోడెన్ 1983 జూన్ 21 ఎలిజబెత్ సిటీ, నార్త్ కెరోలినా, అ.సం.రా. |
జాతీయత | రష్యన్ (2022 నుంచి), అమెరికన్ |
వృత్తి | వ్యవస్థ నిర్వాహకుడు |
ఉద్యోగం | Booz Allen Hamilton Kunia, Hawaii, US (until June 10, 2013) |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | అమెరికా నిఘా వివరాలను బయటపెట్టిన వ్యక్తిగా |
నేరారోపణ(లు) | Theft of government property, unauthorized communication of national defense information, and willful communication of classified intelligence to an unauthorized person (June 2013). |
పురస్కారాలు | శ్యామ్ ఆడమ్స్ అవార్డ్[1] |
రష్యా ఆశ్రయం కల్పించిన 39 ఏళ్ల ఎడ్వర్డ్ స్నోడెన్ కు 2022లో రష్యా పౌరసత్వం మంజూరు చేస్తూ దేశాధినేత వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయనకు రష్యా పౌరులకు లభించే అన్ని హక్కులు, సౌకర్యాలు లభిస్తాయి. ఇక అతడిని స్వదేశానికి రప్పించడం అమెరికాకు కష్టసాధ్యం.
మూలాలు
మార్చు- ↑ "Former U.S. officials give NSA whistleblower Snowden award in Russia". Haaretz. October 10, 2013.
- ↑ "National Security Agency Data Collection Programs". C-SPAN. 18 June 2013.
- ↑ Greenwald, Glenn. "Edward Snowden: the whistleblower behind the NSA surveillance revelations". The Guardian. Retrieved May 18, 2014.
- ↑ Carroll, Rory (February 9, 2014). "Snowden used simple technology to mine NSA computer networks". The Guardian.