ఎనిమా
మానవుని పేగుల పరిశుభ్రతను బట్టే శరీరం లోపల శరీర పరిశుభ్రత ఉంటుంది..[1] పేగులను శుభ్రం చేయడానికి ‘ఎనిమా’ అనేది తేలికైంది. ఖర్చు లేనిది, ఇతర దుష్పలితాలు లేనిది. బయటినుంచి పురీషనాళం ద్వారా పంపిన ద్రవాల వలన విరేచనం అయ్యేలా ప్రేరేపించడం ద్వారా పేగులను శుద్ధిచేసే ప్రక్రియను ఎనిమా అంటారు. దీనిని వైద్యులు ఆపరేషన్లకు ముందు పొట్టను, పేగులు శుద్ది చేయడం కోసం ఈ ప్రక్రియను వాడతారు.
ఎనిమా | |
---|---|
Intervention | |
Pronunciation | /ˈɛnəmə/ |
పద్దతి
మార్చుఎనిమా డబ్బాలు మందుల షాపులలో దొరుకుతాయి, ఒక నీరు పోయగల డబ్బాకు గొట్టం బిగించి వుంటుంది ఆ గొట్టానికి నీటిని నియంత్రించగల మీట వుంటుంది. గొట్టం చివర లోపటికి ప్రవేశ పెట్టగల నాళిక వుంటుంది. దీనిని నూనెల వంటి పదార్దాలు రాసి లోపటికి పంపండం వల్ల చీరుకుపోకుండా వుంటుంది. నీరుపోసి ఉంచిన ఎనిమా డబ్బాను ఒక మీటరు ఎత్తులో తగిలించడం గానీ చేతితో బాగా పైకి పెట్టి పట్టుకోవడం గాని చేయాలి. డబ్బా ఎత్తు మీద ఉండటం వల్ల అందులోని నీరు దానికి జతచేసిన గొట్టం ద్వారా మీ మలాశయం లోనికి వెళుతుంది. డబ్బాలో నీరు అయిపోయాక గొట్టాన్ని తీసి దొడ్లోకి వెళ్లవచ్చు. దొడ్లో 10, 15 నిముషాల సమయం పడుతుంది. మధ్య మధ్యలో నిలబడి బొడ్డు కింద, పైన చేతులతో నొక్కి మళ్లీ మళ్లీ కూర్చుంటే ఎక్కిన నీళ్లు, కదిలిన మలం బాగా బయటకు వస్తాయి. ఎనిమా 2, 3 రోజుల్లో అలవాటు అయ్యాక రెండు డబ్బాల నీరు కూడా ఎక్కించుకోవచ్చు.
మూలాలు
మార్చు- ↑ Cullingworth, A Manual of Nursing, Medical and Surgical:155