ఎన్‌జె9842

భారత పాకిస్తాన్‌ల మధ్య ఉన్న నియంత్రణరేఖకు ఉత్తరం వైపున చివరి బిందువు

NJ9842 (పూర్తిగా: NJ 38 98000, 13 42000 యార్డ్ ఆధారిత భారత గ్రిడ్ అక్షాంశరేఖాంశాలు) అనేది, భారత పాకిస్తాన్ లు అంగీకరించిన యుద్దవిరమణ రేఖకు ఉత్తర కొసన ఉన్న బిందువు. ఈ రేఖనే నియంత్రణ రేఖ అని కూడా పిలుస్తారు. [1]

వర్ణన

మార్చు

1972 జూలై 2 న సంతకం చేసిన సిమ్లా ఒప్పందంలో భాగంగా, "1971 డిసెంబరు 17 నాటి కాల్పుల విరమణ ఫలితంగా ఏర్పడిన నియంత్రణ రేఖను ఇరుపక్షాలూ ఏ భేషజమూ లేకుండా గౌరవించాల"ని ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టో అంగీకరించారు. [2] [3]

1972 నవంబరు - డిసెంబరులో, నియంత్రణ రేఖను వివరించడానికి ఇరువర్గాల సైనిక ప్రతినిధులు సుచేత్‌గఢ్‌లో సమావేశమయ్యారు. వివరించిన తరువాత, సంతకం చేసిన పటాలను ఇరుపక్షాలు మార్పిడి చేసుకున్నాయి. వాటిని తమతమ ప్రభుత్వాలకు ధృవీకరణ కోసం సమర్పించాయి. ఇది విశేషమైన ఖచ్చితత్వంతో ఉందని బ్రియాన్ క్లాఫ్లీ వ్యాఖ్యానించాడు. అయితే, ఈ రేఖ గ్రిడ్ రిఫరెన్స్ NJ9842 వద్ద ముగిసింది. ఇక్కడి నుండి చైనా సరిహద్దు అవరకూ ఉన్న సుమారు 100 మైళ్ళ దూరం అపరిష్కృతంగా ఉండిపోయింది.

1972 నాటి వర్ణన 1949 కరాచీ ఒప్పందంలో ఉన్న పద్ధతినే అనుసరించింది. కరాచీ ఒప్పందం 1947-1948 నాటి భారత-పాకిస్తాన్ యుద్ధం తరువాత చేసుకున్న కాల్పుల విరమణ రేఖను వివరించింది. ఈ రేఖ కూడా ఖోర్ అనే స్థలం వద్ద ఆగిపోయింది. "ఇక్కడి నుండి రేఖ హిమానీనదాలకు వెళుతుంది" అని మాత్రమే ప్రకటించింది.

స్థానం

మార్చు
 
1954 నాటి యుఎస్ ఆర్మీ వారి మ్యాపు; గ్రిడ్ 38 90000, 13 40000 దిగువ వరుసలో ఐదవ చదరం

NJ9842 బిందువు సాల్టోరో శ్రేణిపై, చాలుంకా లుంగ్‌పా లోయ పైన చాలుంకా గ్రామం పైకి వెళ్ళే చోట ఉంది. ఈ బిందువుకు పక్కనే దక్షిణాన కోరిసా హిమానీనదం ఉంది. ష్యోక్ నదిలోకి ప్రవహించే చాలుంకా లుంగ్‌పా వాగుకు ఈ హిమానీనదమే మూలస్థానం. NJ9842 కు ఆగ్నేయంలో వారిస్ హిమానీనదం ఉంది. వారిస్ లుంగ్పా వాగుకు ఇది మూలస్థానం.

NJ9842 కు ఉత్తరాన చులుంగ్ హిమానీ నదం ఉంది. దన్‌సాం నది ఇక్కడే పుట్టి సాల్టోరో నదిలో కలుస్తుంది. అదే దిశ లోనే గ్యోంగ్ హిమానీ నదం కూడా ఉంది. ఇక్కడ గ్యోంగ్ వాగు పుడుతుంది. ఇవన్నీ పాక్ ఆక్రమిత కాశ్మీరు లోనే ఉన్నాయి.

వాస్తవ క్షేత్ర స్థితి రేఖ అనేది ప్రస్తుతం ఇక్కడున్న నియంత్రణ రేఖ. ఇది NJ9842 నుండి తూర్పుగా రెండు సెట్ల హిమానీనదాలను వేరుచేసే నీటి ప్ర్వాహం వెంట నడుస్తుంది. ఆ తరువాత, ఇది సాల్టోరో శిఖరం యొక్క వాటర్‌షెడ్ రేఖ వెంట ఉత్తరం వైపుగా నడుస్తుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి ప్రవహించే ష్యోక్ నది యొక్క ఉపనదుల నీటినీ, కాశ్మీరు లోని నుబ్రా నదిలోకి ప్రవహించే వాటినీ వేరు చేస్తూ పోతుంది.

1949 కాల్పుల విరమణ రేఖలో చెప్పిన ఖోర్ పాయింటే NJ9842 అని చాలామంది రచయితలు చెబుతూంటారు. కానీ, ఈ రెండు బిందువులూ చాలా భిన్నమైనవి.. ఖోర్ మరింత దక్షిణంగా, భారతీయ గ్రిడ్ కోఆర్డినేట్లకు చెందిన గ్రిడ్ 39 00000, 13 20000 లో, ష్యోక్ నదీ లోయకు దగ్గరగా ఉంటుంది. 1972 నాటి ఖోర్ బిందువు నుండి NJ9842 వరకు ముందుకు వెళ్ళడమనేది 1971 భారత-పాక్ యుద్ధంలో భారతదేశం సాధించిన భూభాగాన్ని సూచిస్తుంది. [a]

గమనికలు

మార్చు
  1. చోర్బాట్ లోయ లోని చాలుంకా, తుర్తుక్, త్యాక్షి, ధోతాంగ్ గ్రామాలు

మూలాలు

మార్చు
  1. Hussain, Javed (April 22, 2012). "The fight for Siachen". The Express Tribune.
  2. "Simla Agreement". Ministry of External Affairs, Government of India.
  3. "Simla Agreement between India and Pakistan". Embassy of India, Washington, DC. Archived from the original on 2009-11-11. Retrieved 2009-11-14.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎన్‌జె9842&oldid=3050983" నుండి వెలికితీశారు