ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్

ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]ఆయన  భారతీయ జనతా పార్టీలో బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా, [2]బీజేపీ ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేసి ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు.

ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్
ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్


మాజీ ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 - 2018
నియోజకవర్గం ఉప్పల్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 13 ఏప్రిల్ 1966
తెలంగాణ
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం రామంతాపూర్, హైదరాబాద్ , తెలంగాణ రాష్ట్రం

రాజకీయ జీవితం

మార్చు

ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఉప్పల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి భేతి సుభాష్‌ రెడ్డి పై 14169 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3]

ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఉప్పల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి భేతి సుభాష్‌ రెడ్డి పై 48168 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు.[4]

2023 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అనంతరం ఆయనను 2024 జనవరి 08న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి బీజేపీ పార్టీ నియమించింది.[5]

మూలాలు

మార్చు
  1. The Hindu (29 May 2014). "Engineer turned MLA has his work cut out" (in Indian English). Archived from the original on 22 December 2017. Retrieved 17 August 2021.
  2. Sakshi (4 October 2018). "కేసీఆర్‌ అహంకారానికి పరాకాష్ట: ఎన్‌వీఎస్‌ఎస్‌". Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
  3. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  4. NDTV (2018). "UPPAL Election Result 2018, Winner, UPPAL MLA, Telangana" (in ఇంగ్లీష్). Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
  5. Andhrajyothy (9 January 2024). "17 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఇన్‌చార్జిలు". Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.