ఎన్ రత్నబాల దేవీ

నాంగ్ మైతేమ్ రత్నబాల దేవీ. భారతీయ మహిళా ఫుట్ బాల్ క్రీడాకారిణి. మణిపూర్‌ రాష్ట్రంతో పాటు భారత మహిళా జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించింది. ఇంఫాల్‌కు చెందిన కాంగ్ చుప్ రోడ్ ఫిజికల్ అండ్ స్పోర్ట్స్ అసొసియేషన్ (కేఆర్ వైపీహెచ్ ఎస్ ఏ) ఫుట్ బాల్ క్లబ్‌లో రత్నబాల దేవి సభ్యురాలు.

ఎన్ రత్నబాల దేవీ
వ్యక్తిగత సమాచారం
జన్మనామంఎన్ రత్నబాల దేవీ
పూర్తిపేరునాంగ్ మైతేమ్ రత్నబాల దేవీ
జాతీయతభారతీయురాలు
జననం12 ఫిబ్రవరి 1999
నంబొల్ ఖత్హోంగ్ బిష్ణుపూర్ జిల్లా, మణిపూర్
క్రీడ
దేశంభారత్
క్రీడఫుట్ బాల్
ఎన్ రత్నబాల దేవీ

వ్యక్తిగత జీవితం నేపథ్యం

మార్చు

రత్నబాల మణిపూర్ లోని బిష్ణుపూర్ జిల్లాలోని నంబోల్ ఖతోంగ్‌లో ఫిబ్రవరి 12, 1999న జన్మించింది. సరదా కోసం ఇరుగుపొరుగు అబ్బాయిలతో కలిసి ఫుట్ బాల్ ఆడేది. కాలక్రమేణా సరదా కాస్త ఆసక్తిగా గా మారిపోయింది. రత్నబాల తండ్రి ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తన కూతురి లక్ష్య సాధన కోసం కృషి చేశారు. చిన్నతనం నుంచే ఫుట్ బాల్‌పై ఆసక్తితో, జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలన్న లక్ష్యంతో ఇంఫాల్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) శిక్షణా శిబిరంలో చేరింది ఆమె.సాయ్ కేంద్రంలో కోచ్‌లు, శిక్షణా సౌకర్యాలు ఉన్నప్పటికీ, టోర్నీలు ఆడేందుకు మహిళా జట్టు లేదు. దీంతో మ్యాచ్ ప్రాక్టీస్ కోసం కాంగ్ చుప్ రోడ్ ఫిజికల్ అండ్ స్పోర్ట్స్ అసొసియేషన్ (కేఆర్ వైపీహెచ్ ఎస్ ఏ) ఫుట్‌బాల్ క్లబ్‌లో చేరి శిక్షణ పొందింది. అక్కడే ఆమెకు ఓజా చావో బా వంటి సమర్థుడైన కోచ్ దొరికాడు. క్లబ్‌లో శిక్షణ ఆమెలోని ఫుట్‌బాల్ నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చింది. శిక్షణ పొందిన కొద్ది రోజుల్లోనే మె జాతీయ స్థాయి పోటీల్లో మణిపూర్ తరఫున బరిలోకి దిగింది. తాను ఫుట్ బాల్ లో ఈ స్థాయికి చేరేందుకు కోచ్ చావో బా, తన తండ్రి ప్రోత్సాహమే కారణమని ఆమె చెప్పింది.

వృత్తిపర విజయాలు

మార్చు

రత్నబాల ప్రత్యర్థి జట్టుపై ఆమె అటాకింగ్ స్టయిల్  జట్టుకు ఎంతో లాభం చేకూర్చేది. అనేక జాతీయ టోర్నీల్లో మణిపూర్ జట్టును ముందుండి విజయపథంలో నడిపింది. 2015 లో భారతీయ మహిళా జూనియర్ జట్టుకి ఎంపికయ్యింది . అయితే ఆమె దృష్టంతా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడంపైనే ఉండేది.  2017లో ఆమె తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది.  ఫార్వర్డ్ ఆడటం ఇష్టమైనప్పటికీ, జట్టు కోసం మిడ్ ఫీల్డ్‌లో జట్టుకు అడ్డుగోడలా నిలిచింది ఆమె. కోచ్ కోరిక మేరకు, జట్టు అవసరాల కోసం ఏ స్థానంలోనైనా ఆడేందుకు తాను సిద్ధమేనని అంటారు ఈ మణిపూరి మణిపూస.[1]

తన సొంత జట్టు KRYPHSA FC ని 2020 లో ఇండియన్ విమెన్స్ లీగ్ నాల్గో ఎడిషన్ ఫైనల్స్‌కు చేర్చడంలో రత్నబాలదే కీలక పాత్ర.[2]

2019 లో నేపాల్‌లో జరిగిన ఐదవ శాఫ్ ఛాంపియన్‌షిప్‌లో రత్నబాల భారతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. అలాగే 2019లో జరిగిన 13వ దక్షిణాసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత జట్టులో రత్నబాల సభ్యురాలు.

AFC మహిళా ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నీలో భారత్ తరఫున రత్నబాల బరిలోకి దిగింది. హాంకాంగ్, ఇండోనేషియాతో స్నేహపూర్వక మ్యాచ్‌ల్లో సత్తా చాటింది. ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్‌లో తన మొదటి అంతర్జాతీయ హ్యాట్రిక్ సాధించింది. [3][4]స్పెయిన్‌లో 2019 లో జరిగిన COTIF కప్‌లో బొలీవియా పై రెండు గోల్స్ చేసి అరుదైన బ్రేస్ సాధించింది దేవీ. [5]ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ రత్నబాల దేవీని "భారత మహిళల టీమ్ మిడ్ ఫీల్డ్ కీలక ప్లేయర్ గా’’ అభివర్ణించింది. అలాగే 2019-20 సంవత్సరానికి గాను ఏఐఎఫ్ ఎఫ్ వర్థమాన క్రీడాకారిణిగా రత్న బాలను ఎంపిక చేశారు. [6] 

మూలాలు

మార్చు
  1. Staff, Scroll. "Football: Meet Ratanbala Devi, the 19-year-old forward for the Indian women's team". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-20.
  2. Sportstar, Team. "IWL: KRYPHSA sets up final with Gokulam Kerala". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2021-02-20.
  3. Sureis (2019-03-23). "India hit Nepal for six, win fifth straight title". The Himalayan Times (in ఇంగ్లీష్). Retrieved 2021-02-20.
  4. Jan 27, PTI /; 2019; Ist, 19:30. "Ratanbala hat-trick helps Indian women's football team beats Indonesia 3-0 | Football News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-20. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  5. "Ratanbala Devi brace powers Indian women's football team to 3-1 victory over Bolivia in COTIF Cup - Sports News , Firstpost". Firstpost. 2019-08-04. Retrieved 2021-02-20.
  6. "NONGMAITHEM RATANBALA DEVI". www.the-aiff.com. Retrieved 2021-02-20.