ఎర్ర లోరీ
ఎర్ర లోరీ (ఇయోస్ బోర్నియా లేదా ఇయోస్ రుబ్రా)అనేది ప్సిట్టాసిడాయే కుటుంబానికి చెందిన ఒక చిలుక ప్రజాతి. [1].ఈ చిలుక ఇండోనేషియాలోని మలుక్కాస్, దాని చుట్టుపక్కల దీవులకి పరిమితమైనది.వీటి సహజ సిద్ధమైన నివాస స్థానాలు ఉష్ణ మండల లోతట్టు చిత్తడి అడవులు,ఉష్ణ మండల మడ అడవులు. ఎర్ర లోరీ అనేది సాధారణంగా ఇళ్ళలో పెంచే లోరీ.ఈ తెలివైన చిలుక ఎంతో అందంగా,రంగు రంగులుగా,చలాకీగా ఉంటుంది.ఎర్ర లోరీలు సాధారణంగా ఎర్రగా ఉండి కొంత నలుపు,నెమలి కంఠం రంగు మచ్చలతో ఉంటాయి.రెక్కలు,నుదురు మీద ఉండే మచ్చలు ప్రతీ దానికీ వేరు వేరుగా ఉంటాయి.తోక ముదురు ఎరుపు రంగులో ఉంటుంది.వాటి పరిమాణం 10-12 ఇంచుల పొడవు కలిగి ఉంటుంది.ముక్కు నారింజ రంగులో ఉంటుంది. ఉపప్రజాతులు అయిన బురు ఎర్ర లోరీ (ఇయోస్ బోర్నియా క్యానోనోథస్) ఇంకా ముదురు ఎరుపు రంగులో ఉంటుంది.ఈ రెండు జాతులనూ గుర్తించటంలో కొంత గందరగోళం ఏర్పడుతూ ఉంటుంది.ఈ రెండు జాతుల కలయికతో ఏర్పడ్డ చిలుకలు కూడా ఉండటంతో పెంచేవారికి రెండిటి మధ్య గుర్తించటానికి ఒక చక్కని తేడా లేకుండా పోయింది.మిగిలిన రెండు ఉపప్రజాతులు కొచెం అరుదు.రోథ్ఛైల్డ్స్ ఎర్ర లోరీ (ఇయోస్ బోర్నియా రోథ్ఛైల్డి), బెర్నస్టైన్స్ ఎర్ర లోరీ (ఇయోస్ బోర్నియా బెర్నస్టైని).
ఎర్ర లోరీ | |
---|---|
At Buffalo Zoo, USA | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | E. bornea or Eos rubra
|
Binomial name | |
Eos bornea or Eos rubra (Linnaeus, 1758)
|
వివరణ
మార్చుఎర్ర లోరీ సుమారు 31 సెం.మీ. (12 ఇంచులు)పొడవు ఉంటుంది.ఎక్కువ శాతం ఎర్రగా ఉంటుంది.పై భాగం పూర్తి ఎరుపు.రెక్కల మీద,వీపు మీద నల్ల,నీలం మచ్చలు ఉంటాయి.తోక కుంకుమ రంగులో ఉండి,లోపలి వైపునీలం రంగు ఉంటుంది. ముక్కు నారింజ రంగులో,కాళ్ళు బూడిద రంగులో ఉంటాయి.కంటి పాపలు బెర్నస్టైని రకంలో ఊదా రంగులోనూ,మిగిలిన వాటిలో ఎర్ర రంగులోనూ ఉంటాయి.కింది దవడ దగ్గర ఈకలు లేని చర్మం ఉండదు.ఆడ వాటికి,మగ వాటికి బాహ్య రూపంలో తేడా ఉండదు.పిల్లలు,లేత రంగులో ఉండి,ముక్కు,కంటి పాపలు ఊదా రంగులో ఉంటాయి.[1]
వంటి రంగు
మార్చు-
Kuala Lumpur Bird Park, Malaysia
-
Jurong BirdPark, Singapore
-
Feeding Ardastra Gardens, Zoo and Conservation Centre, Nassau, Bahamas
మూలాలు
మార్చు- ↑ Forshaw (2006). plate 9.
- BirdLife International 2008. మూస:IUCNlink. 2008 IUCN Red List of Threatened Species. Downloaded on 20 March 2009.
- "Species factsheet: Eos bornea". BirdLife International (2008). Archived from the original on 5 జనవరి 2009. Retrieved 20 March 2009.
- Rosemary Low. Encyclopedia of Lories (1998)
[1]==చూపగలిగిన పాఠాలు==
- Forshaw, Joseph M. (2006). Parrots of the World; an Identification Guide. Illustrated by Frank Knight. Princeton University Press. ISBN 0691092516.
బయటి లింకులు
మార్చు- Red Lory (Eos bornea) videos and photos at Internet Bird Collection
- ↑ {{
- '''''}}