ఎల్7
ఎల్7 2016 లో విడుదలైన తెలుగు చిత్రం.
ఎల్7 | |
---|---|
దర్శకత్వం | ముకుంద్ పాండే |
రచన | ముకుంద్ పాండే |
స్క్రీన్ ప్లే | ముకుంద్ పాండే |
నిర్మాత | ఓబుల్ రెడ్డి |
తారాగణం | ఆదిత్ పూజ ఝవేరి వెన్నెల కిశోర్ |
ఛాయాగ్రహణం | దుర్గా ప్రసాద్ |
సంగీతం | అరవింద్ శంకర్ |
విడుదల తేదీ | 21 అక్టోబరు 2016 |
సినిమా నిడివి | 127 నిమిషాలు |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
కథ
మార్చుఅరుణ్(ఆదిత్), ప్రియా(పూజ ఝవేరి)లు కొత్తగా పెళ్లైన జంట. వైజాగ్ నుండి హైదరాబాద్ చేరుకున్న వీరు అద్దె ఇంటి కోసం వెతుకుతుంటే మియాపూర్ దగ్గర ఓ ఇల్లు దొరుకుతుంది. ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ప్రియా పరిస్థితిలో ఏదో మార్పు కనపడుతుంటుంది. అరుణ్‌కు ఇంట్లో ఎవరో ఉన్నట్లు అనుమానం వస్తుంది. ఓ యంత్రం సహాయంతో ఇంట్లో నెగటివ్ పవర్ ఉందని తెలుసుకున్న అరుణ్‌కు, తన భార్యలో దెయ్యం ఉందని నిజం తెలుస్తుంది. ఊళ్లో ఆత్మల గురించి, వాటి ద్వారా వచ్చే సమస్యలను తొలగించడానికి సోమనాథ్ అనే స్వామిజీ వచ్చాడని తెలుసుకున్న అరుణ్, ఆ స్వామిజీని కలుస్తాడు. స్వామిజీ అరుణ్‌కి ప్రియా ఎందుకలా ప్రవర్తిస్తుందనే దానిపై, అసలేం జరిగిందో చెబుతాడు. అసలు అరుణ్‌తో స్వామిజీ ఏం చెప్పాడు? ప‌్రియా శరీరంలోకి దెయ్యం ఎందుకు ప్రవేశించింది? చివరకు అరుణ్ తన భార్యను కాపాడుకున్నాడా? అనే విషయాలు మిగిలిన కథ.[1]
తారాగణం
మార్చు- ఆదిత్
- పూజ ఝవేరి
- వెన్నెల కిశోర్
- అజయ్
సాంకేతికవర్గం
మార్చు- నిర్మాణ సంస్థ: రాహుల్ మూవీ మేకర్స్
- కళ: నాగసాయి
- చాయాగ్రహణం: దుర్గా ప్రసాద్
- సంగీతం: అరవింద్ శంకర్
- నిర్మాత: ఓబుల్ రెడ్డి
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ముకుంద్ పాండే
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-10-24. Retrieved 2016-11-05.