ఎస్సెల్ వరల్డ్
ఎస్సెల్ వరల్డ్ అను వినోద ఉద్యానవనం ముంబాయి, గోరై ప్రాంతంలో ఉంది. ఇది 64 ఎకరాలలో వ్యాపించి ఉంది. ఈ ఎమ్యూజిమెంట్ పార్క్ సందర్శనకు ప్రతిరోజు పది వేల మంది సందర్శకులు వస్తుంటారు. ఇక్కడకు బోరివలి లేదా మలాడ్ అనే ప్రాంతాల నుండి చేరుకోవచ్చు. 1986 లో ఎస్సెల్ గ్రూప్ నకు చెందిన సుభాష్ చంద్ర ఎస్సెల్ వరల్డ్ ను ప్రారంభించారు. 1998 లో వాటర్ కింగ్ డం అనే కొత్త విభాగాన్ని ఎస్సెల్ వరల్డ్ కు జోడించారు. ఎస్సెల్ వరల్డ్ భారతదేశపు మొదటి వినోద పార్కులలో ఒకటి. ఇది రెండు పార్కులుగా ఉన్నాయి - ఎస్సెల్ వరల్డ్ ప్రొపర్, వాటర్ కింగ్ డం, వాటర్ కింగ్ డం ఒక నీటి పార్కు. 2001 లో దీని వార్షిక టర్నోవర్ 35-40 కోట్ల రూపాయలు, ప్రస్తుతం ఒక భారీ విజయం (huge success) అని పిలుస్తున్నారు. ఇక్కడ కాయిన్ ఆపరేటెడ్ గేమ్స్ కాక 34 ప్రధాన రైడ్స్ ఉన్నాయి.
Slogan | It's your world |
---|---|
Location | గోరై, ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
Coordinates | 19°13′55″N 72°48′22″E / 19.232°N 72.806°E |
Owner | పాన్ ఇండియా పర్యాతన్ ప్రైవేట్ లిమిటెడ్ |
General Manager | అశోక్ గోయల్ |
Area | 64 ఎకరాలు (0.26 కి.మీ2) |
Website | అధికారిక వెబ్‌సైటు |