ఎస్.పి.ఎల్.ధనలక్ష్మి

ఎస్.పి.ఎల్.ధనలక్ష్మి (తమిళం: எஸ். பி. எல். தனலட்சுமி) ప్రముఖ దక్షిణ భారత నటి. తమిళ సినిమాలలో పనిచేసిన ఆమె గాయని కూడా.

ఎస్.పి.ఎల్.ధనలక్ష్మి
జననంతంజావూరు, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
వృత్తిసినీ నటి, కర్ణాటక సంగీత గాయని
క్రియాశీలక సంవత్సరాలు1935 నుండి 1950 వరకు
మతంహిందూమతం
బంధువులుటి.ఆర్.రాజకుమారి (అక్క కూతురు)

జీవితచరిత్ర సవరించు

ఎస్.పి.ఎల్.ధనలక్ష్మి తంజావూరులో ఒక సంగీత కుటుంబంలో జన్మించింది. తల్లి పేరు సంగీత కుజలంబల్. ఆమె ఐదుగురి సంతానంలో ఎస్.పి.ఎల్.ధనలక్ష్మి చివరిది. ఎస్.పి.ఎల్.ధనలక్ష్మి ఉమయ్యల్పురం కళ్యాణరామ అయ్యర్ వద్ద గాత్ర సంగీతం నేర్చుకుంది. వీణ వాయించడం కూడా నేర్చుకుంది. ఆమె అక్కకూతురు టి.ఆర్.రాజకుమారి కూడా సినిమా నటి. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో 'డ్రీమ్‌గర్ల్' గా పేరు తెచ్చుకుంది. అలాగే సినిమా నటి, డాన్సర్ అయిన జ్యోతి లక్ష్మి కూడా ఈవిడ దగ్గరే పెరిగింది.[1]

ఆమె నటించిన కొన్ని సినిమాలు సవరించు

 • పార్వతీ కళ్యాణం (తమిళ చిత్రం 1936)
 • వసంతసేన (తమిళ చిత్రం 1936)
 • శ్రీ గండ లీల (తమిళ చిత్రం 1938)
 • సౌభాగ్యవతి (తమిళ చిత్రం 1939)
 • కాలమేగం (తమిళ చిత్రం 1940)
 • దేశభక్తి (తమిళ చిత్రం 1940)
 • సతీ సుకన్య (తమిళ చిత్రం 1942)
 • ప్రభావతి (తమిళ చిత్రం 1944)
 • దైవ న్యాయం (తమిళ చిత్రం 1947)
 • కృష్ణ భక్తి (తమిళ చిత్రం 1949)

మూలాలు సవరించు

 1. "హీరోలతో సమానంగా నిలిచిన జ్యోతి లక్ష్మి..." web.archive.org. 2022-09-25. Archived from the original on 2022-09-25. Retrieved 2022-09-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)