ఎస్.మహతాబ్ బాంజీ

ఎస్.మహతాబ్ బాంజీ జీవరసాయన శాస్త్రవేత్త.

జీవిత విశేషాలు

మార్చు

ఈమె బొంబాయి లో 1934 అక్టోబరు 5 న జన్మించారు. బొంబాయి విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి(బయో కెమిస్ట్రీ) పూర్తి చేసి, అదే విశ్వవిద్యాలయంలో జివరసాయన రంగంలో పి.హె.ది(1961) అందుకున్నారు. "బి" విటమిను లోపం వలన దాపురింఛు వ్యాధులకు గల మూల కారణాలను పరిశోధించారు. సమాజంలో వివిధ వర్గాల ప్రజలకు అవసరమైన బలవర్థక విటమిన్ ల అంచనాకు అవసరమైన వైద్య పరీక్షలను అభివృద్ధి చేశారు.

మెహతాబ్ "బి" విటమిన్ లోపాలు వైద్య పరీక్షలలో జివరసాయన చర్యలను ఏ విధంగా కనపరచగలవో ఆ పరీక్షలు జరిపారు. నోటి ద్వారా తీసుకునే సంతాన నిరోధకాల వంటి మందుల వాడకాలకు పోషకాహారమునకు నడుమ గల సంబంధాన్ని కనుగొన్నారు. విటమిన్ తరహాలో Carnitine గుర్తించారు. పౌష్టికాహార అపవ్యవస్థలను ఎదుర్కోనుటకు కొన్ని కార్యాచరణ పథకాలను ఆవిష్కరించే నిమిత్తం పరిశోధనాక్షేత్రంలో మానవులు, జంతువుల మిద ప్రయోగాలు నిర్వహించారు.

డాక్టర్ మహతాబ్ మొత్తం 100కి పైగా పరిశోధనా పత్రాలను వెలువరిచారు. 1971 లో శకుంతలాదేవి అమిర్‌చంద్ ప్రైజ్, 1973 లో పట్వర్థన్ ప్రైజ్, WHO విజిటింగ్ సైంటిస్ట్ ఫెలోషిప్ ను, 1983 లో నేషనల్ సైన్స్ పౌండేషన్ ట్రావెల్స్ అవార్డు(అమెరికా), 1985 లో అమృత్ మోడో అవార్డు మొదలైన పలు గౌరవ పురస్కారాలను అందుకున్నారు.

డాక్టర్ మహతాబ్ ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ సైన్స్, నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్ మొదలైన ప్రతిష్టాత్మ సంస్థలో కీలకమైన పదవులు నిర్వహించారు. హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరక్టర్ గ్రేడ్ సైంటిస్ట్ గా చిరకాలం చేసి పరవీవిరమణ చేశారు.

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు