ఎయిర్‌బస్ A380
ఎయిర్‌బస్ A380 అనేది ఎయిర్‌బస్ సంస్థ చే తయారు చేయబడిన ఒక డబుల్ డెక్, వైడ్-బాడీ, నాలుగు ఇంజిన్ల జెట్ విమానం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానం. 2007 లో సేవలను ప్రారంభించిన ఈ ప్రయాణికుల విమానం యొక్క క్యాబిన్ విశాలంగా, విలాసవంతంగా ఉంటుంది, ఈ విమానానికి తగ్గట్టు గానే ఈ విమాన సర్వీసును అందిస్తున్న విమానాశ్రయాలు కూడా నవీకరించబడిన సౌకర్యాలను కలిగి ఉన్నాయి. ఇది మొదట్లో ఎయిర్‌బస్ A3XX అనే పేరుతో పెద్ద విమానాల మార్కెట్లో బోయింగ్ యొక్క గుత్తాధిపత్యమును సవాలు చేసేందుకు రూపొందించబడింది. ఈ ఎ380 2005 ఏప్రిల్ 27 న దాని యొక్క మొదటి విమానంగా తయారుచేయబడింది, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సహకారంతో అక్టోబరు 2007 లో వాణిజ్య సేవలోకి ప్రవేశించింది. ఈ విమానం ఎత్తు 24 మీటర్లు, వెడల్పు 80 మీటర్లు, పొడవు 73 మీటర్లు. ఈ విమానంలో కనీసంగా ఒకేసారి 525 మంది ప్రయాణించవచ్చు. దీని ఇంధన సామర్థ్యం సుమారు 82 గ్యాలన్లు. ఈ విమానం బరువు 560 టన్నులు, దీనిలో సుమారు 40 లక్షల విడిభాగాలు ఉంటాయి. ఈ ఎయిర్‌బస్ ప్రధానంగా మూడు భాగాలుగా ఉంటుంది. వీటిని కలపడానికి 8000 బోల్టులు అవసరం. ఇది భూమికి 43,000 అడుగుల ఎత్తులో ఎగురుతూ గంటకు 640 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని జీవితకాల ప్రయాణ సామర్థ్యం 1,40,000 గంటలు.
ఎయిర్‌బస్ A380 | |
---|---|
ఎయిర్ ఫ్రాన్స్ యొక్క ఎయిర్ బస్ A380-800 ల్యాండింగ్ అవుతున్న కొద్ది సమయం ముందు | |
పాత్ర | విశాలమైన-బాడీ, డబుల్ డెక్ జెట్ విమానం |
రూపుదిద్దుకున్న దేశం | బహుళ జాతీయ[1] |
తయారీదారు | ఎయిర్‌బస్ |
మొదటి విహారం | 27 ఏప్రిల్ 2005 |
చేర్చుకున్నవారు | 25 అక్టోబర్ 2007 సింగపూర్ ఎయిర్ లైన్స్ తో |
స్థితి | సేవలో |
ప్రధాన వాడుకరిs | ఎమిరేట్స్ సింగపూర్ ఎయిర్‌లైన్స్ క్వాంటాస్ లుఫ్తాన్సా |
ఉత్పత్తి జరిగిన కాలం | 2005–ప్రస్తుతం |
మొత్తం సంఖ్య | 153 as of 31 జనవరి 2015[update][[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]] |
ఒక్కొక్కదాని ఖర్చు |
మూలాలు
మార్చు- సాక్షి దినపత్రిక - 16-03-2015 - (ప్రపంచంలోకెల్లా అతి పెద్ద విమానం ఏది?)
- ↑ Final assembly in France
- ↑ "New Airbus aircraft list prices for 2015". Airbus. 13 January 2015. Retrieved 20 January 2015.