ఏకవీరికాదేవి ఆలయం

(ఏకవీరాదేవి ఆలయం నుండి దారిమార్పు చెందింది)

ఏకవీరికా దేవి ఆలయం, మహారాష్ట్ర లోని మహూర్‌లో ఉంది. [1]ఇక్కడి దేవతను ఏకవీరికా మాత అంటారు.ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఇది 8 శక్తిపీఠంగా భావిస్తారు.[2]చాలా తక్కువ మందికి మాత్రమే ఏకవీరికా దేవి ఆలయం గురించి తెలుసు.ఎక్కువగా రేణుకా దేవి ఆలయాన్ని శక్తి పీఠంగా కొలుస్తారు. [3] ఈ ఆలయం మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో ఉంది. ఇది కిన్వాట్ నుండి 50 కి.మీ, నాందేడ్ నుండి 126 కి.మీ. నాగ్‌పూర్ మహూర్ నుండి రోడ్డు మార్గంలో 210 కి.మీ. సతీదేవి కుడి భుజం ఇక్కడ పడిందని పురాణ కథనం. ఏకవీరికా మాత ఆలయం ఇది పెన్ గంగా నది (పంచ గంగా నది) ఒడ్డున ఉంది. ఇది మహూర్ నుండి 30 నుండి 40 నిమిషాల ప్రయాణ సమయంలో ఆలయానికి చేరుకోవచ్చు.ఈ ఆలయం సమీపంలోని గ్రామ పొలాల్లో ఉంది. ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది.

ఏకవీరా మహాశక్తి మహుగ్రామ గుహాస్థితా

భవాని వీర విఖ్యాతా ధర్మ రక్షణ తత్పరా

శ్రీ ఏకవీరికాదేవి మందిరం చాల పురాతన ఆలయం. ఆలయమంతా సింధూర రంగులో ఉంటుంది. చిన్న ముఖద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించాలి. ముందుగా శ్రీ పరశురామ్‌ గణేష్‌ దర్శనం చేస్తారు. పిదప రేణుకామాత (ఏకవీరికాదేవి) దర్శనం చేసుకోవాలి. మెడగాని, భుజనాలు గాని లేని రేణుకాదేవి శిరోభాగం మాత్రమే దర్శనమిస్తుంది. అమ్మవారి ముఖమంతా సింధూరంతో పూసి ఉంటుంది. అమ్మవారి ముక్కు, నోరు, కళ్ళు స్పష్టముగా చూడవచ్చును. రేణుకాదేవి మహా తేజోమహిమతో అలరారుతుంది. మందిరంలో ఒక ప్రక్క యజ్ఞపీఠిక వుండగా, మరోప్రక్క ఉయ్యాలలో పరశురాముని విగ్రహం దర్శనమిస్తుంది.[4]

పురాణ కథనం

మార్చు

బ్రహ్మదేవుని కుమారుడైన దక్ష ప్రజాపతి అనే గొప్ప రాజు ఉండేవాడు. అతనికి 27 మంది కుమార్తెలు ఉన్నారు. వారిలో సతీదేవి ఒకరు. సతీదేవి శివుని వివాహం చేసుకుంది.అగ్ని చేసిన యాగంలో దశకుడు ప్రవేశించినప్పుడు, శివుడు తప్ప అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. శివుని ప్రవర్తనకు దక్షుడు అవమానంగా భావించాడు. తరువాత దక్షుడు స్వయంగా యాగం నిర్వహించినప్పుడు, అతను తన కుమార్తె, అల్లుడిని ఆహ్వానించలేదు. ఆహ్వానం అందకపోవడం వల్ల సతికి బాధ అనిపించినప్పటికీ, ఆమె శివుడు వెళ్ళవద్దని హెచ్చరించాడు.అయినా శివుని కోరికకు వ్యతిరేకంగా యాగానికి హాజరైయింది. సతి యాగానికి హాజరైనప్పుడు, అక్కడ ఉన్నవారు ఎవ్వరూ ఈమె రాకను పట్టించుకోలేదు. ఆమె తన సోదరీమణుల, తల్లిదండ్రుల చర్యలతో అవమానించబడింది. అప్పుడు ఆమె తండ్రి తన భర్తను దుర్భాషలాడడం ప్రారంభించినప్పుడు, ఆమె తన భావాలను అదుపు చేసుకోలేక తన కుడి బొటన వేలితో భూమి నుండి అగ్నిని సృష్టించి యజ్ఞ స్థలంలో తనను తానుగా అగ్నికి ఆహుతి అవుతున్నట్లు భయపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న శివుడు తన తలపై నుండి ఒక ఝాతాన్ని తీసి భూమిపై కొట్టాడు. అందులోంచి వీరభద్రుడు పుట్టి యాగ స్థలానికి చేరుకుని దక్షుని తల నరికి చంపాడు. తర్వాత శివుడు అక్కడికి వెళ్లి సతీదేవిని అగ్నిలోంచి తీసి నాట్యం చేయడం ప్రారంభించాడు. ఈ తాండవ నృత్యం నుండి ప్రపంచం నివ్వెరపోయింది. ఈ నృత్యాన్ని ఆపడానికి, విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతీదేవి శరీరాన్ని పూర్తిగా ముక్కలు చేశాడు. ఈ శరీర భాగాలు భారతదేశం, శ్రీలంకలోని వివిధ ప్రదేశాలలో పడిపోయాయి. ఈ భాగాలు ఎక్కడ పడితే అక్కడి ఆ ప్రదేశాలను శక్తిపీఠాలు అంటారు. అటువంటి ప్రదేశాలు 18 ఉన్నాయి. వాటిని అష్ట (8) దశ (10) శక్తి పీఠాలు అంటారు.

ఇతర సందర్శనా స్థలాలు

మార్చు

కొండపైన, లోతైన అడవిలో అనేక ముఖ్యమైన దేవాలయాలు, సందర్శనా స్థలాలు ఉన్నాయి.

 
రేణుకామాత దేవి
  • మహూర్ రేణుకా దేవి ఆలయం: ఈ ఆలయం మహూర్ సమీపంలోని కొండపై లోతైన అడవిలో ఉంది. ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. చాలా తక్కువ మందికి మాత్రమే ఏకవీరికా దేవి ఆలయం గురించి తెలుసు.ఎక్కువగా వారు రేణుకా దేవి ఆలయాన్ని శక్తి పీఠంగా పిలుస్తారు. ఏకవీరికా మాత ఆలయం కంటే రేణుకా దేవి ఆలయంలో ఎక్కువ మంది భక్తుల రద్దీ ఉంటుంది. ఏకవీరికా దేవి రేణుకాదేవి అక్క అని స్థానికులు చెబుతారు. రేణుకాదేవి ఆలయం సుమారు 800 (2000 సంవత్లరం నాటికి) సంవత్సరాల పురాతనమైందని స్థానికులు చెబుతారు. ఇక్కడ రేణుకాదేవికి ప్రసాదంగా తమలపాకులతో ఇతర పాన్ పట్టా, సుపారీని రోటిలో చితగ్గొట్టి, ఆ పేస్ట్‌ను ప్రసాదంగా రేణుకాదేవి నోటిలో కూర్చుతారు. ఇక్కడ అమ్మవారి తల మాత్రమే చూస్తాం.రేణుకా మాత పరశురాముని తల్లి. రేణుకా మాత భర్త జమదగ్ని మహర్షి ఇక్కడ శివలింగ రూపంలో ఉంటాడు.
  • పరశురామ దేవాలయం: ఇదే కొండపై పరశురాముడు (విష్ణువు అవతారం) ఆలయం కూడా ఉంది. ఇక్కడ పరశురామ కుండ్ అనే పవిత్రమైన చెరువు ఉంది.
  • దత్తాత్రేయ స్వామి ఆలయం: జగద్గురు దత్తాత్రేయ స్వామి ఆలయం మరొక కొండపై ఉంది.
  • అనసూయ మాత ఆలయం: అనసూయ మాత దత్తాత్రేయ స్వామి తల్లి. ఆమె ఆలయం మూడవ కొండపై ఉంది.
  • అత్రి మహర్షి ఆలయం: అత్రి మహర్షి దత్తాత్రేయ స్వామి తండ్రి. ఈ ఆలయం అనసూయ మఠం పక్కనే ఉంది.
  • మాతృ తీర్థం: మాతృ తీర్థం గురు చరిత్రలో వర్ణించబడిన చాలా పవిత్రమైన చెరువు. పరశురాముడు తన తండ్రి అయిన జమదగ్ని వేడుకను ఈ ప్రదేశంలో చేసాడు. ప్రజలు ఈ చెరువులో పుణ్యస్నానాలు చేసి తమ పాపాలను పోగొట్టుకుంటారు.
  • దేవదేవేశ్వర మందిరం: ఇది దత్తాత్రేయ స్వామి శయన స్థలం. ప్రతిరోజూ గురు దత్తాత్రేయ స్వామి వారణాసిలో గంగా నదిలో స్నానం చేసి, కొల్హాపూర్‌లోని భిక్ష (భోజనం) చేసి, మహూర్‌లో నిద్రిస్తారు. ఈ ఆలయం మహూర్ పట్టణంలో ఉంది.[5]

మూలాలు

మార్చు
  1. information, Temples in India (2020-04-28). "Mahurye Ekaveerika Temple Timings, History | Shaktipeeth". Temples in India Info: Unveiling the Divine Splendor (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-15.
  2. information, Temples in India (2020-04-28). "Mahurye Ekaveerika Temple Timings, History | Shaktipeeth". Temples In India Info. Retrieved 2023-05-13.
  3. "Ekaveerika Devi". Temples Vibhaga. Archived from the original on 2023-05-12. Retrieved 2023-05-12.
  4. https://www.hithokthi.com/viewstotra.php?g_id=3&cat_id=22&story_id=11770
  5. "Ekaveerika Devi". Temples Vibhaga. Archived from the original on 2023-05-12. Retrieved 2023-05-12.

వెలుపలి లంకెలు

మార్చు