ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్
ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ఏఎన్ఐ) అనేది భారతదేశంలోని, ఇతర ప్రాంతాలలోని న్యూస్-బ్యూరోలకు సిండికేట్ మల్టీమీడియా న్యూస్ ఫీడ్‌ను అందించే భారతీయ వార్తా సంస్థ.[2] దీన్ని 1971 లో ప్రేమ్ ప్రకాష్ స్థాపించాడు. ఇది భారతదేశంలో వీడియో వార్తలను సిండికేట్ చేసిన మొదటి ఏజెన్సీ 2019 నాటికి, భారతదేశంలో అతిపెద్ద టెలివిజన్ వార్తా సంస్థ.
ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ | |
---|---|
Ani-logo-black.png | |
తరహా | వార్తా సంస్థ |
స్థాపన | {{{foundation}}} |
స్థాపకులు | ప్రేమ్ ప్రకాష్ |
ప్రధానకేంద్రము | |
కార్య క్షేత్రం | భారతదేశం, దక్షిణాసియా |
కీలక వ్యక్తులు |
|
పరిశ్రమ | మీడియా |
యజమాని | ANI మీడియా ప్రైవేట్ లిమిటెడ్[1] |
చరిత్ర
మార్చుస్థాపన, ప్రారంభ సంవత్సరాలు (1971–2000)
మార్చుప్రేమ్ ప్రకాష్ ఫోటోగ్రఫీ రంగంలో తన వృత్తిని ప్రారంభించాడు. ఆ తరువాత అతను విస్‌న్యూస్,రాయిటర్స్ లలో ఫోటో జర్నలిస్ట్‌గా ఉద్యోగంలో చేరి స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన చారిత్రక సంఘటనలను కవర్ చేసాడు. [3][4] 1970వ దశకంలో వార్తలు, డాక్యుమెంటరీ చలనచిత్రాల నిర్మాణంలో అతనికి ముఖ్యమైన పాత్ర ఉంది. అతను విదేశీ పాత్రికేయులు, చిత్రనిర్మాతలలో గణనీయమైన గౌరవాన్ని పొందాడు. బ్రిటిషు ప్రభుత్వం అతనికి MBE ని ప్రదానం చేసింది. [3][4]
1971 లో ప్రేమ్, ఏఎన్ఐని స్థాపించాడు. ప్రారంభంలో దాని పేరు TVNF, భారతదేశపు మొట్టమొదటి టెలివిజన్ న్యూస్ ఫీచర్ ఏజెన్సీ. కాంగ్రెస్ ప్రభుత్వంలో దీనికి అసాధారణమైన పలుకుబడి ఉండేది. [3] దూరదర్శన్ కోసం అనేక చిత్రాలను నిర్మించి, ఆ రంగంలో గుత్తాధిపత్యాన్ని సాధించి, భారతదేశాన్ని ఒక సానుకూల కోణంలో చూపించాలనే ఇందిరా గాంధీ కోరికలను నెరవేర్చడంలో TVNF కీలక పాత్ర పోషించింది. [3]
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్‌లో పూర్వ విద్యార్థి అయిన స్మితా ప్రకాష్ 1986 లో ఏఎన్ఐలో ఇంటర్న్‌గా చేరింది. తర్వాత పూర్తికాల ఉద్యోగిగా మారింది. [3] ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ మాజీ డైరెక్టర్ ఇన్నా రామమోహనరావు కుమార్తె అయిన స్మిత, 1988లో ప్రేమ్ కుమారుడు సంజీవ్‌ను వివాహం చేసుకుంది. దీనితో ఏఎన్ఐ ప్రభుత్వానికి మరింతగా దగ్గరైంది. [3][5] 1993లో, రాయిటర్స్ ఏఎన్ఐలో వాటాను కొనుగోలు చేసి, దాని భారతదేశ ఫీడ్‌పై పూర్తి గుత్తాధిపత్యాన్ని కలిగి ఉండటానికి అనుమతించబడింది. [3]
తరువాతి సంవత్సరాలు (2000–ప్రస్తుతం)
మార్చు2000 నాటికి, భారతదేశంలో ప్రైవేట్ 24x7 వార్తా ఛానెల్‌ల విజృంభణ మొదలైంది; అయితే, నిలకడలేని రాబడి నమూనాల వలన దేశవ్యాప్తంగా వీడియో-రిపోర్టర్‌లను నియమించుకునే సామర్థ్యం వాటికి లేవు. [3] దీన్ని అవకాశంగా తీసుకుని సంజీవ్, ఏఎన్ఐ యొక్క దేశీయ వీడియో-ప్రొడక్షన్ సామర్థ్యాలను భారీగా విస్తరించాడు. అతను తన చురుకైన నిర్వహణా చాతుర్యంతో సంస్థలో కింది నుండి బాగా ఎదిగాడు. [3] వార్తాపత్రికలు, ఇతర పత్రికలకు ఫీడ్ అందించడానికి 2000లో ఏషియన్ ఫిల్మ్స్ టీవీని ఏర్పాటు చేశారు. [4] అయితే, సంస్థలో పనిచేసే క్షేత్ర స్థాయి ఉద్యోగులలో ఎక్కువ మంది తక్కువ-ధరతో రిక్రూట్ అయినవారని, వారికి జర్నలిజంతో పెద్దగా సంబంధం లేదనీ కారవాన్ పత్రిక రాసింది. [4]
2000లో, NDA ప్రభుత్వం కాశ్మీర్ ఆధారిత ప్రాంతీయ ఛానెల్ — DD కాశ్మీర్ ని ప్రారంభించింది. దాని కార్యక్రమాలను రూపొందించడానికి ఏఎన్ఐ ని నియమించారు. [3] [4] 2005 చివరి నాటికి, ఏఎన్ఐ వ్యాపార-నమూనా స్థిరమైన ప్రాతిపదికన ఆకట్టుకునేలా ఉంది. ఇది తన కార్యాలయాన్ని గోలే మార్కెట్ నుండి RK పురంలోని కొత్త ఐదు అంతస్తుల భవనానికి మార్చింది. [3] ఏఎన్ఐని ఆ తరువాత వచ్చిన UPA ప్రభుత్వాలు కూడా విశ్వసించాయి. భారతదేశం, USA యొక్క ప్రస్తుత నేతల ఉమ్మడి పత్రికా సమావేశంలో పాల్గొన్న ఇద్దరు సభ్యులలో ఒకరుగా స్మితను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. [3]
2000వ దశకంలో, ఏఎన్ఐ ఫీడ్ యొక్క ఛార్జీలు పెరగడం, దాని తక్కువ స్థాయి నాణ్యత కలిగిన జర్నలిజంతో పాటు, ప్రసార వ్యాన్‌లు రంగంలోకి రావడంతో అనేక జాతీయ, ప్రాంతీయ ఛానెల్‌లు సంస్థతో ఉన్న తమ చందాను ఆపివేసాయి. [3] 2010లో యశ్వంత్ దేశ్‌ముఖ్ UNI TV ప్రారంభించడంతో సంస్థకు గట్టి పోటీ ఎదురైంది. [3] అయితే, 2011లో కంపెనీలో చేరిన స్మిత కుమారుడు ఇషాన్ ప్రకాష్, అనేక LiveU యూనిట్లను సేకరించాడు. ఏఎన్ఐ విదేశీ బ్యూరోలను విస్తరించాడు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. [3][6] మళ్లీ గుత్తాధిపత్యం నెలకొల్పుకున్నాడు. చివరికి పోటీదారులు చాలా వరకు మూతబడ్డాయి. [3]
2011 చివరి నాటికి, రాయిటర్స్ ఫీడ్‌లో ఏఎన్ఐ కి 99% వాటా ఉంది. FY 2017–18లో, సేవల కోసం వారికి ₹ 2.54 కోట్లు చెల్లించారు. [4] ఆర్కైవ్ వీడియోలు సెకనుకు ₹ 1000 కంటే ఎక్కువ ధరలకు విక్రయించబడ్డాయి; FY 2017–18లో, సంస్థ ₹ 68.23 కోట్ల ఆదాయం, ₹ 9.91 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. [4]
2024 వికీపీడియాపై ఏఎన్ఐ పరువు నష్టం దావా
మార్చుజూలై 2024లో వెబ్‌సైట్‌లోని వివరణలో తమ వార్తా సంస్థ పరువు తీశారని పేర్కొంటూ ఏఎన్ఐ ఢిల్లీ హైకోర్టులో వికీపీడియాపై దావా వేసింది.[7] వికీపీడియా తమ వార్తా సంస్థను ప్రస్తుత ప్రభుత్వానికి 'ప్రచార సాధనం'గా పేర్కొందని ఢిల్లీ హైకోర్టులో ఏఎన్ఐ రూ.2 కోట్ల పరువునష్టం దావా వేసింది. వికీపీడియాలో వ్యాసాల సవరణలు చేయడానికి వ్యక్తులను అనుమతిస్తోందని ఏఎన్ఐ ఆరోపించింది. తమ పేజీలో వార్తా సంస్థకు బదులుగా ప్రభుత్వ ప్రచార సాధనంగా ఉందని వికీపీడియాపై ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు 2024 సెప్టెంబరు 5న వికీపీడియాకు ధిక్కార నోటీసు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను 2024 అక్టోబరు 25కు కోర్టు వాయిదా వేసింది.[8]
ఇవి కూడా చూడండి
మార్చు- ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, భారతదేశంలోని మరొక వార్తా సంస్థ
- యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా, భారతదేశంలోని బహుభాషా వార్తా సంస్థ
మూలాలు
మార్చు- ↑ "Terms & Conditions". aninews.in (in ఇంగ్లీష్).
- ↑ "Footaging It Fleetly". Outlook India Magazine. Retrieved 2019-12-29.
- ↑ 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 3.10 3.11 3.12 3.13 3.14 3.15 Donthi, Praveen (1 March 2019). "The Image Makers : How ANI Reports The Government's Version Of Truth". The Caravan (in ఇంగ్లీష్). Retrieved 2019-12-07.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 Ahluwalia, Harveen; Srivilasan, Pranav (2018-10-21). "How ANI quietly built a monopoly". The Ken (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-12-28.
- ↑ Ahluwalia, Harveen; Srivilasan, Pranav (2018-10-21). "How ANI quietly built a monopoly". The Ken (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-12-28.
- ↑ Ahluwalia, Harveen; Srivilasan, Pranav (2018-10-21). "How ANI quietly built a monopoly". The Ken (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-12-28.
- ↑ "Why has ANI slapped a defamation case against Wikipedia? | Explained News - The Indian Express". web.archive.org. 2024-09-06. Archived from the original on 2024-09-06. Retrieved 2024-09-06.
{{cite web}}
: no-break space character in|title=
at position 46 (help)CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "నచ్చకపోతే భారత్‌లో పనిచేయవద్దు: వికీపీడియాపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం | If You Dont Like India: Delhi High Court Tough Talk For Wikipedia | Sakshi". web.archive.org. 2024-09-06. Archived from the original on 2024-09-06. Retrieved 2024-09-06.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)