ఐఎన్ఎస్ విశాఖపట్నం
ఐఎన్ఎస్ విశాఖపట్నం ఒక ప్రధాన నౌక ఇది భారత నావికాదళానికి చెందిన విశాఖపట్నం -క్లాస్ స్టెల్త్ గైడెడ్-క్షిపణి విధ్వంసక నౌకలలో మొదటిది . 2021 నవంబరు 21న ప్రారంభించబడిన ఈ నౌక, భారత నావికాదళంలో సేవలో ఉన్న అతిపెద్ద డిస్ట్రాయర్‌లలో ఒకటి [1] ఇది 2021 అక్టోబరు 28 న భారత నావికాదళానికి అందించబడింది. 2022 ఫిబ్రవరి 27న నేవల్ డాక్‌యార్డ్‌లో జరిగిన లాంఛనప్రాయ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, జాతికి అంకితం చేసారు.[2] ఈ నౌక మొత్తం పొడవు 163 మీ, 7400 టన్నులకు పైగా స్వదేశీ ఉక్కును ఉపయోగించి నిర్మించబడింది, భారతదేశంలో నిర్మించిన అతిపెద్ద విధ్వంసక నౌకలలో ఒకటి. ఇందులో సూపర్‌సోనిక్ ఉపరితలం నుండి ఉపరితలం ఇంకా ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు, మధ్యస్థ, స్వల్ప-శ్రేణి తుపాకులు, జలాంతర్గామి వ్యతిరేక క్షిపణులు, అధునాతన ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, కమ్యూనికేషన్ సూట్‌లు వంటివి ఉన్నాయి.[3] ఇది 30 నాట్‌ల కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. రెండు హెలికాప్టర్ లు డెక్ పైన నిలిపి ఉంచగల సామర్యంతోపాటు అధునాతన డిజిటల్ నెట్‌వర్క్‌లు, పోరాట నిర్వహణ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫారమ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో చాలా ఉన్నత స్థాయి ఆటోమేషన్‌ను కలిగి ఉంది.15బీలో భాగంగా మజగావ్ షిప్ బిల్డర్స్ దేశీయంగా నిర్మించింది. ఇటువంటి నాలుగు నౌకలను తయారు చేస్తున్నారు.[4]
మూలాలు
మార్చు- ↑ "INS Visakhapatnam". Drishti IAS (in ఇంగ్లీష్). Retrieved 2024-01-01.
- ↑ https://indiannavy.nic.in/content/shri-jagan-mohan-reddy-honble-chief-minister-formally-dedicates-ins-visakhapatnam-city-0
- ↑ Livemint (2021-11-21). "INS Visakhapatnam: Navy to commission missile destroyer ship today. 5 points". mint (in ఇంగ్లీష్). Retrieved 2024-01-01.
- ↑ https://telugu.oneindia.com/news/visakhapatnam/first-stealth-guided-missile-destroyer-ship-ins-visakhapatnam-formally-joins-indian-navy/articlecontent-pf351360-306614.html