ఐకాన్ ఆఫ్ ది సీస్

ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ నౌక 2023వ సంవత్సరం జూన్ 22న విజయవంతంగా మొదటి ట్రయల్ రన్ పూర్తిచేసుకుంది .రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన ఈ నౌక ' ఐకాన్ ఆఫ్ ది సీస్‌ [1].టైటానిక్ కంటే ఇది ఐదు రెట్లు పెద్దది ఫిన్లాండ్ లో మేయర్ తుర్కు షిప్పియార్డ్ నిర్మించింది. ఈ నౌక పొడవు 1200 అడుగులు బరువు 2,50,800 మంది సిబ్బంది . 5610 మంది ప్రయాణించగలరు. 2024 జనవరిలో మియామి నుంచి బయలుదేరే ఈ నౌక కరేబియన్ సముద్ర జలాల్లో ప్రయాణిస్తుంది. కాలుష్య నివారణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ ఎన్ జి ను ఇంధనంగా వాడుకుంటూ ఈ నౌక ప్రయాణం కొనసాగిస్తుంది[2] .కరేబియన్ లో అత్యంత అందమైన దీవులైన బహమాస్ , కొజుమెల్, ఫిలిప్స్ బర్గ్, సెయింట్ మార్టెన్, రోటన్, హోండురస్ వంటి వాటి మీదుగా ఈ నౌక ప్రయాణిస్తుంది[3].

  1. "World's largest cruise ship sets sail for the first time". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-09-11.
  2. "7,960 people capacity, six water slides, 1200 ft in length: World's largest cruise ship Icon of the Seas to set sail in Jan". Business Today (in హిందీ). 2023-06-28. Retrieved 2023-09-11.
  3. "In Pics: Icon Of The Seas, World's Largest Cruise Ship, Makes Maiden Voyage". NDTV.com. Retrieved 2023-09-11.