ఐకియా
ఐకియా (IKEA) అనేది ప్రపంచ ఖ్యాతి పొందిన స్వీడన్ మూలాలు కల ఒక బహుళ జాతీయ వాణిజ్య సంస్థ 1943 లో స్వీడన్ లో దీని ఆరంభం జరిగింది స్థాపించినది ఇంగ్వర్ క్రాంపార్డ్ 1958లో స్వీడన్‌లోని ఆమ్‌హాల్ట్‌లో తొలి స్టోర్‌ను ప్రారంభించిన ఐకేఈఏ.. క్రమేణా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నీచర్ రిటైలర్‌గా ఉన్న ఐకేఈఏ ప్రస్తుత వార్షిక ఆదాయం సుమారు రూ.3.30 లక్షల కోట్లుగా ఉన్నది. ఐకేఈఏ(ఐకియా)ను విస్తరిస్తే ఇంగ్వర్ కాంప్రాడ్ ఎల్మ్ టరిడ్ అగన్నరిడ్ అని ఇందులో మొదటి రెండు పదాలు.. ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఇంగ్వర్ ఫీడర్ కాంప్రాడ్‌ను సూచిస్తాయి. ఇక చివరి రెండు పదాలు ఆయన పుట్టిన ప్రాంతాన్ని చెబుతాయి ముఖ్యంగా ఇంటికి కావాల్సిన అన్ని రకాల ఉత్పత్తులు, ఫర్నిచర్ ఐటెమ్స్ వీళ్ళే డిజైన్ చేస్తారు, అమ్ముతారు కూడా ప్రపంచవ్యాప్తంగా ఐకియా తన ఫర్నిచర్ ను విడిభాగాల (రెడీ టు ఫిట్) రూపంలోనే అందిస్తుంది.ప్రపంచవ్యాప్తంగా ఐకియాకు 49 దేశాల్లో 400కు పైగా స్టోర్లున్నాయి.
రకం | వాణిజ్య సంస్థ |
---|---|
పరిశ్రమ | Retail |
స్థాపించబడింది | 1943 | స్వీడన్
స్థాపకుడు | Ingvar Kamprad |
ప్రధాన కార్యాలయం | Leiden, Netherlands |
ప్రాంతాల సంఖ్య | 411 (November 2017) |
పనిచేసే ప్రాంతాలు | Worldwide |
ప్రధాన వ్యక్తులు | |
ఉత్పత్తులు | Ready-to-assemble furniture, homeware |
ఆదాయం | ▲ US$40.906 billion (2016)[3] |
▲ US$5.247 billion (2016)[3] | |
▲ US$4.898 billion (2016)[3] | |
మొత్తం ఆస్థులు | ![]() |
మొత్తం ఈక్విటీ | ![]() |
యజమాని | |
ఉద్యోగుల సంఖ్య | 194,000 (2017)[4] |
జాలస్థలి |
ఫర్నిచర్ విడిభాగాలను ఇంటికి తీసుకెళ్లి కొనుగోలుదారుడే బిగించుకోవాల్సి ఉంటుంది కేవలం విడి భాగాలు మాత్రమే కాక ఫినిష్ డ్ ప్రోడక్ట్స్ కూడా అమ్ముతారు ఫర్నిచర్ ప్రోడక్ట్స్ మాత్రమే కాక వంట గదికి కావాల్సినవి (మోడ్యులర్ ప్లాట్ ఫార్మ్ లాంటివి) , వంట గదిలో కావాల్సినవి, విద్యుత్ సామానులు, ఇంటి సామానులు, తోట సామానులు, పిల్లల గదిలోకి కావాల్సినవి అమ్ముతారు.
భారతదేశంలో విస్తరణసవరించు
ఐకియ ఇండియా సీఈవో పీటర్ బెట్జల్ ,భారత్‌లో తన స్టోర్లను ఏర్పాటు చేయాలనే రూ.10,500 కోట్ల పెట్టుబడుల ప్రణాళికకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2025 కల్లా ఐదు భారతీయ నగరాల్లో 25 స్లోర్లను ప్రారంభించాలని ఐకియ ప్రణాలిక. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ప్రాంతంలో తన భారీ స్టోర్ (హే స్టోర్స్ )నిర్మాణానికి శంకుస్థాపనను 2016 ఆగస్టులో చేపట్టి 09 ఆగస్టు 2018 న ప్రారంభించినది ఇది భారత్ లో మొట్టమొదటి స్టోర్[5]. ఈ స్టోర్ కోసం తెలంగాణా ప్రభుత్వం 13 ఎకరాల్ని కేటాయించింది. ఇందులో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ స్టోర్ ను నిర్మించారు.ఈ షోరూము మొత్తం ఒక్కసారి తిరిగితే దాదాపు ఏడు కిలోమీటర్లు అవుతుంది[6]. రూ.1000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ లో ప్రత్యక్షంగా 950 మందికి ఉపాధి కల్పిస్తుండగా. దాదాపు 1500 మందికి పైనే పరోక్షంగా ఉపాధిని కల్పించనున్నారు ఇందులొ 50 శాతం పైగా మహిళలు .మొత్తం 7500 ఉత్పత్తులు ఈ స్టోర్‌లో లభిస్తాయి. అందులో 20 శాతం ఉత్పత్తులను స్థానికంగా కొనుగోలు చేస్తున్నట్లు ఐకియా ప్రతినిథులు వెల్లడించారు. ఈ స్టోర్ లో లభించే దాదాపు 1000 ఉత్పత్తులు రూ. 200 లోపే లభించనున్నాయి. ఫర్నిచర్, ఇతర వస్తువులను కొనుగోలుదారుల ఇంటికి వెళ్లి బిగించేందుకు అర్బన్‌క్లాప్ అనే సంస్థతో ఐకియా ఒప్పందం కుదుర్చుకుంది. వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువులను వారి ఇళ్లకు చేర్చడానికి గతి కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది[7].ఈ స్టోర్‌లో రెస్టారెంట్ కూడా ఉంది. ప్రపంచంలో అన్ని ఐకియా స్టోర్స్‌లోకెల్లా అతి పెద్ద రెస్టారెంట్ ఇక్కడే ఉంది. 1000 సీట్ల ఈ రెస్టారెంట్‌లో సగం ఆహార పదార్థాలు స్వీడిష్ స్పెషాలిటీస్ కాగా మిగిలిన సగం ఇండియన్ ఆహార పదార్థాలు.ఈ స్టోర్ 365 రోజులూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది.
రిటైలు రంగంపై ప్రభావంసవరించు
ఐకియా వలన ఫర్నిషింగ్ రంగంలో చాలా మార్పులు రావొచ్చుఇంట్లో వినియోగించే వివిధ రకాల ఫర్నీచర్, కిచెన్ సామాగ్రి, గృహాలంకరణ ఉత్పత్తులు, వార్డ్ రోబ్స్, బెడ్స్, మ్యాట్రెసెస్ తదితర ఐకియా ఉత్పత్తుల ధర స్థానిక రిటైలు రంగంపై ప్రభావం చూపుతుంది.
- ↑ "IKEA Has a New CEO". Fortune. 24 May 2017. Retrieved 5 December 2017.
- ↑ "IKEA finalizing its biggest overhaul in decades". Reuters. Retrieved 20 October 2016.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 "IKEA Group Yearly Summary FY16" (PDF). IKEA. Archived from the original (PDF) on 2017-01-31. Retrieved 2018-08-10.
- ↑ "IKEA 2017 by numbers". Archived from the original on 2018-06-26. Retrieved 2018-08-10.
- ↑ "ఐకియా: భారతదేశంలో అతిపెద్ద ఫర్నీచర్ స్టోర్ హైదరాబాద్‌లో ప్రారంభం". 2018-08-09.
- ↑ "ఐకియా మనకేం తెచ్చింది?". 2018-07-07.
- ↑ "ఐకియా స్టోర్". 2018-08-10. Archived from the original on 2018-08-10. Retrieved 2018-08-10.