ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానం 38

కాశ్మీరు సమస్యపై 1948 జనవరి 17 న ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానం 38 ని అమోదించింది. కాశ్మీరు పరిస్థితిని ఏ విధంగానూ తీవ్రతరం చేయకుండా ఉండాలనీ, పరిస్థితిని మెరుగుపరచడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోవాలనీ భారత, పాకిస్తాన్ ప్రభుత్వాలకు ఐరాస ఈ తీర్మానంలో పిలుపునిచ్చింది. సమస్య మండలి పరిశీలనలో ఉండగా పరిస్థితిలో ఏదైనా భౌతికమైన మార్పులు ఏర్పడితే తనకు తెలియజేయాలని ఇది ఇరుపక్షాలనూ అభ్యర్థించింది.

ఐరాస భద్రతామండలి
తీర్మానం 38
తేదీజనవరి 17 1948
సమావేశం సం.229
కోడ్S/RES/38 (Document)
విషయంభారత పాకిస్తాన్ సమస్య
వోటింగు సారాంశం
9 అనుకూల వోట్లు
సున్నా ప్రతికూల వోట్లు
2 ఆబ్సెంటు
ఫలితంఆమోదం
భద్రతాసమితి కూర్పు
శాశ్వత సభ్యులు
Non-permanent members

ఈ తీర్మానానికి అనుకూలంగా తొమ్మిది ఓట్లు రాగా, వ్యతిరేకంగా వోట్లేమీ రాలేదు. ఉక్రెయిన్, సోవియట్ యూనియన్లు వోటింగులో పాల్గొనలేదు.

ఇవి కూడా చూడండి

మార్చు
  • ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల జాబితా 1 నుండి 100 (1946-1953)

మూలాలు

మార్చు