ఐఫోన్
ఐఫోన్ (iPhone) అనేది అమెరికా దేశానికి చెందిన ఆపిల్ సంస్థ ఉత్పత్తి చేసే స్మార్ట్ ఫోన్ల బ్రాండు. ఈ ఫోన్లలో ఆపిల్ సంస్థ స్వంతంగా తయారు చేసిన ఐఒఎస్ (iOS) ను వాడుతారు. మొదటి తరం ఐఫోన్లను మొదటిసారిగా జనవరి 9, 2007 న అప్పటి ఆపిల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి స్టీవ్ జాబ్స్ పరిచయం చేశాడు. నవంబర్ 1, 2018 నాటికి సుమారు 220 కోట్ల ఐఫోన్లు అమ్ముడయ్యాయని ఒక అంచనా. 2022 నాటికి ప్రపంచ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో ఐఫోన్ వాటా సుమారు 15.6%.[1]
మల్టి టచ్ కలిగిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఐఫోన్.[2] దీనిని విడుదల చేసినప్పటి నుంచి తెర పరిమాణం కూడా పెరుగుతూ వస్తోంది. ఆండ్రాయిడ్, ఐఫోన్లు ప్రపంచంలో రెండు అతిపెద్ద స్మార్ట్ ఫోన్ ప్లాట్ ఫాంలు. ఐఫోన్ విలాసవంతమైన ఉత్పత్తుల (లగ్జరీ) శ్రేణిలోకి వస్తుంది. ఈ ఐఫోన్ల వల్ల ఆపిల్ కు బాగా లాభాలు వచ్చి ప్రపంచంలోనే అత్యంత పెద్ద కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ఐఫోన్ విడుదలయినప్పుడు మొబైల్ ఫోన్లలో దీనిని ఒక విప్లవంగా పరిగణించబడింది. తర్వాత వచ్చిన మోడళ్ళు కూడా ప్రశంసలు అందుకున్నాయి.[3]
మూలాలుసవరించు
- ↑ "Apple iPhone smartphone shipments worldwide 2010–2022". Statista (in ఇంగ్లీష్). Archived from the original on October 3, 2022. Retrieved October 3, 2022.
- ↑ Merchant, Brian (June 22, 2017). The One Device: The Secret History of the iPhone (in ఇంగ్లీష్). Transworld. ISBN 978-1-4735-4254-9. Archived from the original on October 13, 2022. Retrieved October 3, 2022.
- ↑ Egan, Timothy (July 7, 2017). "Opinion | The Phone Is Smart, but Where's the Big Idea?". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Archived from the original on October 3, 2022. Retrieved October 3, 2022.