ఐస్ క్రీం (ఆంగ్లం: Ice Cream) లేదా హిమగుల్మం అనగా పాలు, ఐసు (మంచు), చక్కెర మొదలైన పదార్థాలతో తయారు చేసిన ఒక నోరూరించే తినుబండారం.[1]

A cocktail glass of ice cream, with whipped cream and a wafer
వంటకం వివరాలు
వడ్డించే విధానంDessert
ప్రధానపదార్థాలు Milk or cream, sugar
వైవిధ్యాలుGelato, sorbet, frozen custard
ఒక గిన్నెలో నింపిన ఐస్‌క్రీం

ఐస్ క్రీం ప్రపంచ వ్యాప్తంగా చాలామందికి ఇష్టమైన ఆహారం. ముఖ్యంగా వేసవి కాలంలో ఐస్ క్రీం దుకాణాల వైపు మొగ్గుచూపడం సాధారణంగా జరుగుతుంటుంది. తీవ్రమైన ఎండల ప్రభావం వల్ల కలిగిన అలసటనుండి విముక్తి పొందడానికి జనం ఆశ్రయించే ఈ హిమగుల్మాలు నేడు సర్వకాల సర్వావస్థలయందు మానవుడి ఆహార అంతర్భాగాలలో ఒకటి కావడం విచిత్రమైన పరిణామం.

చరిత్ర

మార్చు

ఐస్ క్రీం

ఇతర వంటలలాగా, ఇతర తినుబండారాలాగా హిమగుల్మం ఒకరి చేత తయారుచేయబడింది కాదు. దీని సృష్టికర్త ప్రత్యేకమైన వంటగాడేమీ కాదు. ఇది తనకు తానుగా ఏర్పడింది. ప్రాచీన కాలంలో రాజులు, జమీందారులు, ధనికులు, ఇతర సంపన్న వర్గాలవారు సాధారణంగా వైన్ లాంటి మత్తు పానీయాలు సేవించేవారు. వైన్ గానీ, సారా గానీ చల్లబడినప్పుడు, ఇతర నాజూకు పదార్ధాలను ఐస్‌తో చల్లబరచినప్పుడు పరిణామాత్మకంగా ఇది ఏర్పడింది. సా.శ. 62లో రోమన్ చక్రవర్తి నీరో తన వైను గదిని చల్లబరుచుకోవడానికి హిమము కోసం తన సేవకులను అపినైన్ పర్వతాలకు పంపించాడు.[2] హిమము కోసం సుదూర ప్రాంతాలకు వ్యయ ప్రయాలకు ఓర్చడం ఆ కాలంలో ఉండేది. హిమము నకు ఆ కాలంలోనే అంత ప్రాధాన్యత ఉండేది.

13వ శతాబ్దంలో దూర ప్రాచ్య దిశ నుండి మర్కోపోలో వచ్చినప్పుడు అనేక అమూల్య వస్తువులతోపాటు ఆనాడు ఆసియాలో బహుళ ప్రచారంలో ఉన్న పాల ఐస్ చేసే విధానాన్ని కూడా తీసుకువచ్చాడు. ఈ రుచికర పదార్థం ఇటలీలో అనతి కాలం లోనే ప్రచారం పొందింది.[3] ఆ దేశంలో భాగ్యవంతులకు జెలాటో భోగ్య వస్తువు అయ్యింది. 14 సంవత్సరాలు వయసుగల కాథరీన్ డి మెడిసి 1533లో రెండవ వివాహం చేసుకుంది. ఆమెకు పెళ్ళి కానుకగా అమూల్యమైన ఇటాలియన్ షర్బత్ తయారీ రహస్యం ఇవ్వబడింది. ఆమె కుమారుడు మూడవ హెన్రీ ఈ ఐస్ షర్బత్తును త్రాగుతుండేవాడు.

రాష్ట్ర ప్రభుత్వపు ఇందులో మొట్టమొదటిసారిగా ఇంగ్లండు రాజు 1వ చార్లెస్ తన ఫ్రెంచి వంటవాడు చేసిన ఐస్ క్రీం వడ్డించినపుడు అందరూ దాని రుచికి ఎంతో ఆశ్చర్యం పొందారు. 1వ చార్లెస్ మొదటిసారి ఐస్ క్రీం తీసుకున్నప్పుడు ఎంతో సంతోషించి ఐస్ క్రీం రహస్యాన్ని ఎవరికీ చెప్పవద్దని వంటవాని వద్ద వాగ్దానం తీసుకుని సంవత్సరానికి 500 పౌండ్లు పెన్షన్ ఇస్తుండేవాడు. 1649లో చార్లెస్ మరణించినప్పుడు అతడి వంటవాడు ఆ ఐస్ క్రీం రహస్యాన్ని డబ్బుకు ఆశపడి వెల్లడి చేశాడు.

అమెరికాలో ఈ ఐస్ క్రీం తయారీ రహస్యాన్ని యూరోపియన్ వలసగాళ్ళు ప్రవేశపెట్టారు.[4] 1774 నాటికి యు.యస్.లోని న్యూయార్క్ వార్తాపత్రికలలో ఐస్ క్రీంకి ప్రకటనలు ప్రకటించబడ్డాయి. మంచి రుచులకు మోజుపడే ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్‌టన్ మౌంట్నెర్నాస్‌లో ఎప్పుడూ రెండు ఐస్ క్రీం కుండలను సిద్ధంగా ఉంచుకునేవాడు. ఫిలడెల్ఫియాలోని సిన్సిన్నాటి సొసైటీ మీటింగ్‌కు ఐస్ క్రీంతయారీకి ఐస్ క్రీం మిషన్‌ను కనుగొన్నాడు. అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వపు విందులో ఐస్ క్రీం వడ్డించిన మొట్టమొదటి వ్యక్తి యు.యస్. ప్రెసిడెంత్ థామస్ జెఫర్సన్. నాల్గవ యు.యస్. ప్రెసిడెంట్ సతీమణి డాలీ మాడిసన్ తరచుగా వైట్ హౌస్ అతిధులకు ఐస్ క్రీం వడ్డించేది.

1846లో న్యూ జెర్సీకి చెందిన మహిళ నాన్సీ జాన్సన్ సులభ పద్ధతిలో ఐస్ క్రీము తయారుచేయడానికి చేతి మిషన్‌ను కనిపెట్టింది. ఇది సులభంగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. 1851లో బాల్టిమోర్‌కు చెందిన జేకబ్ ఫన్సల్ ఐస్ క్రీము షాపుని ప్రారంభించాడు. ఆ దేశంలో అతడొక్కడే భారీ ఎత్తు ఐస్ క్రీము వ్యాపారి. మొట్టమొదట ఐస్ క్రీము 1904లో మిస్సొరీలోని సెంట్ లూయీస్‌లో జరిగిన లూసియానా పర్చేస్ ఎక్స్పొసిషన్‌లో కోన్‌లో ఇవ్వడానికి ప్రారంచించాడు. 1903లో డెమాస్కస్ నుంచి వచ్చిన సిరియా దేశస్థుడు ఎర్నెస్ట్ ఏ. హాంని ఐస్ క్రీములను కోనులలో అమ్మడం ప్రారంభించాడు. 1920లో స్టీం పవర్, ఎలెక్ట్రిసిటీ వల్ల ఐస్ క్రీము తయారీ అభివృద్ధి పొందింది. 1925లో హోవర్డ్ జాన్సన్ మాసాచుసెట్స్‌లోని వోల్టాసన్‌లో ఐస్ క్రీం స్టోరును తెరిచాడు. ఎండాకాలంలో ఒకనాడు ఇతడు 14.000 ఐస్ క్రీము కోనులు అమ్మాడు.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో దక్షిణ పసిఫిక్ నౌకాశాఖకు చెందిన బుర్టన్ బుచ్ బాస్కిన్ తన జీపును అమ్మగా వచ్చిన డబ్బుతో ఒక ఐస్ క్రీం ఫ్రీజర్‌ను కొని మొట్టమొదటిసారి 31 రకాల ఐస్ క్రీములను తయారుచేశాడు. ఇర్విన్ రాబిన్స్ 1945లో ఇతడితో చేరాడు. ఇప్పుడు ప్రపంచమంతటా బాస్కిన్-రాబిన్స్ ఐస్ క్రీం స్టోరులున్నాయి. ప్రపంచంలో మొట్టమొదటిసారి చాక్లెట్, వెనీలా, స్ట్రా బెరీ ఐస్క్రీములు ప్రారంచించినవారు వీరే.

ఈనాడు ఐస్ క్రీమును వినియోగించని దేశమే లేదు. ధ్రువ ప్రాంత దేశాల్లో కూడా వీటి వినియోగం ఉన్నదంటే ఈ ఫుడ్ పట్ల మానవుడు ఎంతగా ప్రభావితుడు అయ్యాడో అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలో 98 శాతం ప్రజలు ఐస్ క్రీం తింటారు. అలాగే ఆస్ట్రేలియా ప్రపంచ ఐస్ క్రీము ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ ద్వితీయ స్థానంలో ఉంది. పోటీ పెడితే ఐస్ క్రీము వినియోగంలో ప్రతి దేశం పాల్గొంటుందనడంలో అతిశయోక్తి లేదు.

ఐస్ క్రీం - ఆరోగ్యం

మార్చు

రుచిలో ఇతర ఫాస్ట్ ఫుడ్స్‌తో పోటీ పడుతూ ముందుండడానికే ప్రయత్నించే ఐస్ క్రీము దీన్ని ఇష్టంగా తినేవారికి స్థూలకాయాన్ని కూడా అంతే వేగంగా ప్రసాదిస్తుందనేది జగమెరిగిన సత్యం. దీని మీద ఎంత మోజున్నా ఆరోగ్యంపట్ల జాగ్రత్త అవసరం కాబట్టి దీనికి దూరంగా ఉండడమే శ్రేయస్కరం అంటున్నారు వైద్య రంగ ప్రముఖులు. ముఖ్యంగా అతిగా ఐస్ క్రీములను తీసుకోవడంవలన ఊబకాయంతోపాటు రక్తంలో కొలెస్టెరాల్ కూడా పెరిగే ప్రమాదముండడంతో వైద్యులు దీన్ని నివారించండి అని ప్రచారం చేస్తున్నారు.

పెళ్ళి భోజనాలలో తాంబూలాన్ని అందించే రోజులు పోయి ఐస్ క్రీములు అందించే రోజులు వచ్చేయడంతో వీటిని నియంత్రించడం కష్టసాధ్యమే అనిపిస్తుంది.

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. Beeton, Isabella (1911). Mrs Beeton's Cookery Book. pp. 258–60.
  2. Andrews, Tamra (2000). Nectar and Ambrosia:An Encyclopedia of Food in World Mythology. Santa Barbara, California: ABC-CLIO. p. 121. ISBN 978-1-57607-036-9. OCLC 224083021.
  3. http://www.telugudanam.co.in/vijnaanam/meeku_telusaa/Ice_cream.htm
  4. "Ice Cream Labeling: What Does it all Mean?". International Foodservice Distributors Association. Archived from the original on 2008-05-14. Retrieved 2014-01-27.

ఇతర లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఐస్_క్రీం&oldid=4340458" నుండి వెలికితీశారు