ఐ.ఎన్.ఎస్. విక్రాంత్

సేవ నుండి విరమించిన భారతదేశపు తొలి విమాన వాహక నౌక

ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ (పూర్వపు పేరు HMS Hercules (R49))[1] భారత నౌకాదళానికి చెందిన ఒక మెజెస్టిక్ వర్గానికి చెందిన తేలికపాటి విమాన వాహక నౌక.

ఐ.ఎన్.ఎస్. విక్రాంత్.

నౌక నిర్మాణ కార్యక్రమాన్ని విక్కర్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ 1943 నవంబరు 12 న టైన్ లో చేపట్టారు.[2] 1945 సెప్టెంబరు 22 లో నౌక జలప్రవేశం చేసింది.

చరిత్ర

మార్చు

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిషు రాయల్ నేవీ కోసం HMS హెర్క్యులస్‌గా ఈ ఓడ నిర్మాణం మొదలైంది. కానీ యుద్ధం ముగియడంతో నిర్మాణాన్ని ఆపివేసారు. 1957 లో భారతదేశం ఈ అసంపూర్ణ వాహక నౌకను కొనుగోలు చేసింది. 1961లో నిర్మాణం పూర్తయింది. విక్రాంత్, భారత నావికాదళపు తొలి విమాన వాహక నౌకగా ప్రారంభించబడింది. 1971 భారత పాకిస్తాన్ యుద్ధం సమయంలో తూర్పు పాకిస్తాన్ నౌకాదళ దిగ్బంధనాన్ని అమలు చేయడంలో ఇది కీలక పాత్ర పోషించింది. తరువాతి సంవత్సరాలలో, ఓడ ఆధునిక విమానాలు దిగేలా దీనికి పెద్ద పునర్నిర్మాణం చేసారు. 1997 జనవరిలో దీన్ని సేవ నుండి తప్పించి, నిలిపివేసారు. 2012 వరకు ముంబై లోని నావల్ డాక్స్‌లో మ్యూజియం షిప్‌గా భద్రపరచారు. అయితే దీని నిర్వహణకు తగు నిధులను మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించనందున మ్యూజియాన్ని మూసేసారు.[3][4] 2014 జనవరిలో ఈ ఓడను ఆన్‌లైన్ వేలం ద్వారా రూ 60 కోట్లకు విక్రయించారు.[5][6][7] సుప్రీంకోర్టు తుది అనుమతి తర్వాత 2014 నవంబరు 22 న నౌకను విడగొట్టి చెత్త కింద మార్చేయడం మొదలైంది.[8]

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. The State of War in South Asia by Pradeep Barua
  2. Pink ice: Britain and the South Atlantic Empire By Klaus Dodds
  3. Sunavala, Nargish (4 February 2006). "Not museum but scrapyard for INS Vikrant". The Times of India. Archived from the original on 28 August 2017. Retrieved 4 February 2014.
  4. "Warship INS Vikrant heads for Alang death". Times of India. 30 January 2014. Archived from the original on 9 March 2014. Retrieved 23 February 2014.
  5. "Dismantling Vikrant begins". Indian Express. 21 November 2014. Archived from the original on 26 April 2016. Retrieved 12 May 2016.
  6. "India's first aircraft carrier slips into history | India News - Times of India". The Times of India. 22 November 2014. Archived from the original on 23 November 2014. Retrieved 22 November 2014.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "Not museum but scrapyard for warship Vikrant". Times of India. 3 February 2014. Archived from the original on 28 August 2017. Retrieved 29 August 2014.
  8. "India's first aircraft carrier slips into history". Times of India. 22 November 2014. Archived from the original on 23 November 2014. Retrieved 22 November 2014.

బయటి లింకులు

మార్చు