ఐ.సి.హెచ్.వి. బసవరాజు

ఇవటూరి చిన వీర బసవరాజు  [24 June 1939 - 11 ఏప్రిల్ 1988] తన 16 వ ఏట  21.1.1955 తెలుగు స్వతంత్రలో ప్రచురించబడ్డ "ప్రణయానికి పొలిమేరలు" కథ ద్వారా 'జ్యేష్ఠ 'గా అవతరించేరు. రావి శాస్త్రి, డా. టి. వేణుగోపాలరావుల ప్రభావంతో కమ్యూనిజం వైపు ఆకర్షితులై నిత్యం మిత్రులతో చర్చలలో మునిగితేలుతుండేవారు. స్వామి వివేకానంద వ్రాసిన ఒక వ్యాసం ప్రభావంతో 1968లో ఆయన ఆ తాత్త్విక చింతనలొ ఆ చివరనుండి ఈ చివరకు మరలేరు. ఆరుద్ర, శ్రీశ్రీ మొదలుకుని చిన్నా చితకా సాహిత్యవేత్తలందరికీ, విశాఖపట్నం పిఠాపురం కాలనీలో 8 నెంబరు ఇల్లు ఒక తప్పనిసరి దర్శనీయ స్థలంగా ఉండేది.

విశాఖపట్నం ఇంజనీరింగు కళాశాల అధ్యాపకులుగా తమ పరిసరాల్ని నిశితంగా పరిశీలిస్తూ, వస్తువుల "లోకి" తొంగి చూడగల తాత్త్విక దృక్పథాన్ని అలవరచుకున్నారు. స్నాతకోత్తర విద్యలోని డొల్లతనం, విద్యారంగంలో ఉన్న లోపాలూ, కొన్ని కొన్ని విద్యార్థి ఆందోళనల వెనుక కనిపించని నిజాయితీ, మౌలిక తత్త్వంలేకుండా చికాకు పుట్టించే డాక్టరల్ పట్టాలకై చేసే పరిశోథనలూ, మధ్యతరగతి నయవంచనలూ, ఆత్మసంతృప్తి పేరుతో వారు కాలంతో పడే రాజీ... ఇవన్నీ వీరి కథలలోకి ప్రవహించాయి.

కమ్యూనిజమే కాదు, ఏ 'ఇజమూ' ఈ దేశానికి పనికిరావన్నది వీరి నిశ్చితాభిప్రాయం. ఇతరులకి నచ్చని విషయాన్ని సైతం బాధించని వ్యంగ్యంతో, హాస్యంతో చెప్పగలగడం వీరి ప్రత్యేకత.

ఎర్రతేలు, విలువలు, మాడు పగిలింది, బామ్మగారి ప్రపంచ యాత్ర, అప్పచ్చికీ జై, అరుణతార, అలసట, ఆగని ఆకలిపాట, ఆమె కోరిక, ఎదురు దెబ్బ, ఒక ఉదయం, కథ సుఖాంతమే మొదలైన సుమారు 75 కథలూ, 12 కవితలూ, ఒక నవలిక వీరి సాహిత్య కృషి. [[కథానిలయం]] లో సుమారు 70 రచనలు పి.డి.ఎఫ్. రూపంలో అందుబాటులో వున్నాయి.[1]

కేస్ ఆఫ్ ది మిస్సింగ్ బ్రెయిన్ కథ ఇంగ్లీషులోకి అనువాదమయింది.

మూలాలు మార్చు

  1. "రచయిత: ఐ సి హెచ్ వి బసవరాజు". కథానిలయం.{{cite web}}: CS1 maint: url-status (link)