ఐ లవ్ యు (2019 సినిమా)

ఐ లవ్ యు 2019లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్ పై ఆర్.చంద్రు నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఉపేంద్ర, రచిత రామ్‌, సోను గౌడ, బ్రహ్మానందం నటించిన ఈ సినిమా టీజర్‌ను 2019 మార్చి 13న విడుదల చేసి,[2] సినిమా జూన్ 14న విడుదలైంది.[3]

ఐ లవ్ యు
దర్శకత్వంఆర్.చంద్రు
రచనఆర్.చంద్రు
నిర్మాతఆర్.చంద్రు
తారాగణంఉపేంద్ర
రచిత రామ్‌
సోను గౌడ
బ్రహ్మానందం
ఛాయాగ్రహణంసుజ్ఞాన్
కూర్పుదీపు ఎస్ కుమార్
సంగీతండా. కిరణ్ తోటంబైల్
నిర్మాణ
సంస్థ
శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్‌ప్రైజెస్
పంపిణీదార్లుల్యాంకో శ్రీధర్ దిల్ రాజు & రాజేష్ దాసరి [1]
విడుదల తేదీ
2019 జూన్ 14 (2019-06-14)
సినిమా నిడివి
122 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

సంతోష్ నారాయణ (ఉపేంద్ర) కాలేజీ జీవితంలో ప్రేమలో విఫలమై, అత్యంత ధనవంతుడైతాడు, తన తండ్రి చివరి కోరిక మేరకు తనకు ఇష్టం లేకపోయినా గౌరీ (సోనూ గౌడ)ను పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో సంతోష్ నారాయణ్ కాలేజీలో ప్రేమించిన అమ్మాయి ధర్మిక (రచితా రామ్)ను కలుసుకుంటాడు. సంతోష్ ధర్మికని మళ్ళీ ఎలా కలుసుకుంటాడు. ఆమెను కలిసిన తర్వాత సంతోష్ జీవితం ఏవిధంగా మలుపు తిరిగింది ? చివరికీ ఏమైంది ? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్‌ప్రైజెస్
  • నిర్మాత: ఆర్.చంద్రు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.చంద్రు
  • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మునీంద్ర కె. పుర
  • సంగీతం: డా. కిరణ్ తోటంబైల్
  • సినిమాటోగ్రఫీ: సుజ్ఞాన్
  • ఎడిటర్: దీపు ఎస్ కుమార్
  • ఆర్ట్ డైరెక్టర్: మోహన్ బి కేరే
  • కొరియోగ్రఫీ: చిన్ని ప్రకాష్, ధను, మోహన్
  • ఫైట్స్: గణేష్, వినోద్, డా.కే రవి వర్మ
  • పి.ఆర్.ఓ : సుదీంద్ర వెంకటేష్

మూలాలు మార్చు

  1. The New Indian Express (28 May 2019). "Telugu version of Upendra's I Love You to be distributed by three producers" (in ఇంగ్లీష్). Archived from the original on 20 January 2021. Retrieved 3 November 2021.
  2. Sakshi (13 March 2019). "జీరో నుంచి మొదలయ్యా". Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021.
  3. Sakshi (7 June 2019). "జూన్ 14న 'ఐ లవ్ యు'". Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021.
  4. TV9 Telugu (14 June 2019). "ఉపేంద్ర 'ఐ లవ్ యు' మూవీ రివ్యూ!". Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)