ఒట్టో హాన్ (మార్చి 8, 1879 - జులై 28, 1968) ఒక జర్మన్ రసాయన శాస్త్రవేత్త. ఈయన రేడియో ధార్మికత, రేడియోకెమిస్ట్రీలో మార్గదర్శకమైన పరిశోధనలు చేశాడు. ఈయనను కేంద్రక రసాయన శాస్త్రానికీ, కేంద్రక విచ్ఛిత్తికి పితామహుడిగా భావిస్తారు. ఈయన లైజ్ మీట్నర్ తో కలిసి రేడియం ఐసోటోపులు, థోరియం, ప్రొటాక్టీనియం, యురేనియం కనుగొన్నారు.
ఒట్టో హాన్
జననం
(1879-03-08)1879 మార్చి 8 ఫ్రాంక్‌ఫర్ట్ ఆం మెయిన్, హెస్సీ-నస్సాయు, ప్రష్యా, జర్మన్ సామ్రాజ్యం (ప్రస్తుతం జర్మనీ)
మరణం
1968 జూలై 28(1968-07-28) (వయసు 89) గొట్టింజెన్, పశ్చిమ జర్మనీ (ప్రస్తుతం జర్మనీ)
ఈయన మార్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి 1901 లో పిహెచ్‌డి పట్టా పొందాడు. లండన్ యూనివర్శిటీ కాలేజీ లో సర్ విలియం రామ్సే, మాంట్రియల్ లోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయంలో ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ కింద పనిచేశాడు. ఈ సమయంలో ఈయన పలు రేడియో ధార్మిక ఐసోటోపులు కనుగొన్నాడు. 1906 లో జర్మనీకి తిరిగి వెళ్ళాడు.