ఒత్తిడి కారకం
ఒక జీవికి ఒత్తిడి (Stress) ని కలిగించే జీవ రసాయనకర్త, ప్రకృతి అవస్థ, బాహ్య ప్రేరేపకాలు లేదా సంఘటనలను ఒత్తిడి కారకాలు అంటారు.[1] మానసిక శాస్త్ర ప్రకారం చెప్పాలంటే ఏదైనా జీవులను డిమాండ్ చేయడం, సవాలు చేయడం లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించేలా భావించే సంఘటనలు లేదా వాతావరణాలను ఒత్తిడి కారణాలు అంటారు.[2]
ఒత్తిడి ప్రతిస్పందనను ప్రేరేపించే సంఘటనలు, వస్తువులు పలు విధాలు.
- పర్యావరణ కారకాలు: అధిక వేడి, పరిమితికి మించిన శబ్దాలు, ఎక్కువ కాంతి, ఎక్కువ జనసందోహం
- రోజువారీ కారకాలు: ఉదాహరణకు ట్రాఫిక్, తాళాలు మరిచిపోవడం, డబ్బు, శరీర కార్యకలాపాలు
- వ్యక్తిగత జీవితం: విడాకులు, ఆత్మీయుల మరణం
- పని ఒత్తిడి: ఉద్యోగంలో ఎక్కువ పని, పని చేసే వాతావరణంలో గందరగోళం[3]
- రసాయనిక కారకాలు: పొగాకు, మద్యం, మత్తుమందులు, మాదకద్రవ్యాలు
- సామాజిక కారణాలు: సంఘం, కుటుంబ కోరికలు
మూలాలు
మార్చు- ↑ Sato, Tadatoshi; Yamamoto, Hironori; Sawada, Naoki; Nashiki, Kunitaka; Tsuji, Mitsuyoshi; o, Kazusa; Kume, Hisae; Sasaki, Hajime; Arai, Hidekazu; Nikawa, Takeshi; Taketani, Yutaka; Takeda, Eiji (October 2006). "Restraint stress alters the duodenal expression of genes important for lipid metabolism in rat". Toxicology. 227 (3): 248–261. doi:10.1016/j.tox.2006.08.009. PMID 16962226.
- ↑ Deckers, Lambert (2018). Motivation Biological, Psychological, and Environmental. New York, NY: Routledge. pp. 208-212. ISBN 978-1-138-03632-1.
- ↑ Roster, Catherine A.; Ferrari, Joseph R. (2019-01-13). "Does Work Stress Lead to Office Clutter, and How? Mediating Influences of Emotional Exhaustion and Indecision". Environment and Behavior. 52 (9): 923–944. doi:10.1177/0013916518823041. ISSN 0013-9165. S2CID 149971077.