ఓకే అనేది ఇంగ్లీష్ భాషలో ఒక పదం. ఇంగ్లీషు భాషలో అత్యధికంగా వాడబడుతున్నది ఈ పదం. ఈ పదాన్ని మంచిదే, సరైనదే, అలాగే, సరే, అలాగే కానివ్వండి అనే అర్థాల్లో ఉపయోగిస్తారు. తరచుగా దీన్ని అవును అనే పదానికి బదులుగా ఉపయోగిస్తారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఓక్లహోమా రాష్ట్రానికి సంక్షిప్తంగా కూడా OK ఉంది. ఓకే పదం మొదట నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారని కచ్చితంగా చెప్పలేం, కానీ కొంతమంది నిపుణులు "Ol Korrect" (అంతా సరైనదే-All correct) అనే తమాషా రచనా విధానం యొక్క పదం నుండి OK పదం వచ్చినట్లుగా చెబుతారు. అలాగే గ్రీక్ లో "ఓల కల" ("Ola kala") పదబంధాన్ని కూడా కనుగొన్నారు, దీనర్థం "అంతా ఉత్తమం" అన్నట్లుగా ఉంటుంది.

రిమోట్ కంట్రోల్ పై OK బటన్

ప్రచురణలో మార్చు

అమెరికాలో అత్యంత ప్రజాదరణ గల నాటి పత్రిక "ద బోస్టన్ మార్నింగ్ పోస్ట్‌"లో "ఓకే" పదం మొదటిసారిగా 1839 మార్చి 23న ప్రచురితమైంది.

"https://te.wikipedia.org/w/index.php?title=ఓకే&oldid=2989795" నుండి వెలికితీశారు