ఓట్స్ , Oats

మార్చు

ఓట్స్ సాదారాణ తృణ ధాన్యము కేటగిరికి చెందినదే . దీనిలో ఓ పత్యేకత అంటూ ఏమీ లేదు . వరి అటుకులు లా వీటినీ మనం తినవచ్చును . ‌--ధ్యానం కేటగిరీలోని వన్నీ 'గడ్డి' జాతి నుండి ఉద్భవించినవే. అవి గోధుమ, ధాన్యం, చోళ్లు, జొన్నలు, మొక్కజొన్నలు, ఓట్స్‌ ప్రధానమైనవి. ఓట్స్ మంచి పౌష్ఠికాహారం. దీనిలో పీచు పదార్థం, విటమిన్ బి-2, విటమిన్ సి ఎక్కువగా ఉన్నాయి. అలాగే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్స్ కూడా ఎక్కువే. పిల్లలకు ఆహారంలో ఓట్స్‌ను ఏదో ఒక రూపంలో ఇవ్వడం వల్ల మంచి పోషక విలువలు లభిస్తాయి. ఓట్స్‌తో రకరకాల రుచికరమైన తినుబండారాలు చేయవచ్చు సగం కప్పు ఉడికించిన ఓట్స్‌లో 80 కేలరీలు మాత్రమే ఉంటాయ. నీటిలో కరిగే పీచుతో పాటు కరగని పీచు కూడా వీటిలో ఉంటుంది. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. ఓట్స్‌కి జిగురు గుణాన్ని తెచ్చిపెట్టే కరిగే పీచు రక్తంలోని కొలెస్ట్రాల్‌ను వేరుచేస్తూ.. దాన్ని తగ్గించటంలో తోడ్పడుతుంది. ఓట్స్‌.. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర మోతాదు హఠాత్తుగా పెరగకుండా చేస్తాయి. నెమ్మదిగా జీర్ణమవుతూ రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తాయి కాబట్టి మధుమేహం రాకుండానూ కాపాడతాయి. ఓట్స్‌ల్లో జింక్‌, విటమిన్‌ ఇ, సెలీనియం కూడా దండిగానే ఉంటాయి కొలెస్ట్రాల్‌ శత్రువు ఓట్స్. Oats Nutritional value per 100 g (3.5 oz) Energy------------------- 1,628 kJ (389 kcal) Dietary fiber------------ 11 g Protein------------------ 17.6 g Pantothenic acid (B5) ---- 1.3 mg (26%) Folate (Vit. B9) --------- 56 μg (14%) Iron--------------------- 5 mg (40%) Magnesium---------------- 177 mg (48%) β-glucan (soluble fiber) - 4 g బరువు తగ్గాలనుకునేవారికి ఓట్స్ మంచి ఆహారం, ఓట్స్ జీర్ణవ్యవస్ధ సక్రమంగా పనిచేయడానికి సాయపడుతుంది, అంతేగాక రక్తంలో చక్కెరశాతం అదుపులో ఉంచుతుంది. ఓట్స్ లో కొలెస్టరాల్ తక్కువగా ఉంటుంది, గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది. ఓట్స్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఓట్స్ లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. మన ప్రాంతాల్లో పండే ధాన్యాల గురించి మనకు సరియైన అవగాహన ఉండడం లేదు. దీనికి తోడు మన సరిగ్గా ప్రచారం కూడా చేసుకోవట్లేదు. అందుకని జనాలు కొత్త వింత పాత రోత లాగా కొత్తగా వచ్చిన వాటి వెంట పరుగులు తీస్తున్నారు. ఓట్స్ మంచివే కాదనలేము గాని అమెరికా లాంటి ప్రాంతాల్లో ఓట్స్ తింటున్నారు అంటే అర్థం వుంది అక్కడ పండుతాయేమొ మరి. కాని మన దగ్గర పండకుండా ఇతర దేశాలనుండి దిగుమతి చేసుకునే వాటి మీద మనకు ఇంత మోజెందుకో అర్థం కాదు. మన ప్రాంతాల్లో పండే వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే మన రైతులకి, మన ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు చేసిన వారమవుతాం.

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఓట్స్&oldid=2956343" నుండి వెలికితీశారు