ఓయె కెన్జాబురో (1935):ఇతను జపనీస్ నవలా రచయిత. ద్వితీయ ప్రపంచ సంగ్రామానంతరం జపాన్ భాషలో చెలరేగిన విప్లవానికి ప్రాతినిధ్యం వహిస్తూ జపాన్ భాషకు సహజమైన పరుస్తూ ఎగుడుదిగుడుగా ఉండే ఒక కొత్త రకం అంకురార్పణ చేసిన వాడు. ఓయె కెన్జాబురో ఒక సంపన్న కుటుంబంలో 1935 జనవరి 31న షికోఖులోని ఎఃఈమ్‌ ప్రిఫెక్చర్‌ (మతోద్యోగి అధికార ప్రదేశం) లో జన్మించాడు యుద్ధానంతరం అమలు జరిగిన భూసంస్కరణల లో వారి ఆస్తి చాలా భాగం హరించుకుపోయింది. 1984లో ఓయె  టోక్యో విశ్వవిద్యాలయంలో చేరి 1959లో పట్టభద్రుడయ్యాడు. ఫ్రెంచ్ సాహిత్య విభాగంలో అతడు విద్యార్థిగా ఉన్న రోజులలోనే మిషీమా యుకియో తరువాత అంతా ప్రతిభావంతుడైన యువ రచయిత రాలేదనే పేరు తెచ్చుకున్నాడు.  1960లో పీకింగ్ లో జరిగిన  యువ జపనీస్ రచయితల సమావేశంలో పాల్గొన్నాడు.  తన తొలి రచన  షిషా నో ఓగోరి (1957, లా విష్‌ ఆల్‌ ది డెడ్‌ 1965) తోనే అతడు సాహిత్య వరుల దృష్టిని ఆకర్షించాడు. అది మొదటగా ’బుంగకు కై’  అనే పత్రికలో ప్రచురింపబడింది. అతని తొలి నవల మెమోషిరీ కౌచి (1958, ప్లక్‌ది బడ్‌ అండ్‌ డీస్ట్రాయ్‌ ది ఆఫ్‌స్ప్రింగ్‌)  విశేష ప్రశంసలు అందుకుంది. షీకూ (1 958, ది కాచ్‌, 1959) అనే రచనకు అతనికి ’ఆకుటగావా’  అవార్డు లభించింది.  ఒయె 1960 లో వివాహితుడైనాడు. 1963 లో పెద్ద కపాలం గల కుమారుడు కలిగిన తరువాత అతని రచనా వ్యాసంగం మరో మలుపు తిరిగింది. అతడు కోజిన్‌ డెకీ నాటైకెన్‌ (1964 ఏ పర్సనల్‌ మేటర్‌,  1969)  అనే గ్రంథం రచించాడు. దానికి 1964లో ’షించో’ బహుమతి లభించింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అతడు హిరోషిమా సందర్శించాడు. తత్ఫలితంగా హీరోషిమా నోటో 1965, హీరోషిమా నోట్స్ అనే గ్రంథం రాశాడు. 1970 తరువాత అతని రచనలలో ముఖ్యంగా వ్యాసాలలో పరమాణు యుగంలో  అధికార రాజకీయాలకు మూడవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యం కనిపించింది. 1967లో ఒయె రచించిన మానెన్‌గానెన్‌ పుట్టో గోరు (’ది సైలెంట్‌ క్రై 1974) అనే రచనకు ఒయెకు ’తానిజాకీ’ బహుమతి లభించింది. ఒయో రచనలో అతని వ్యక్తిగత అనుభవాలు విశేషంగా ప్రతిఫలిస్తాయి.[1]

మూలాలు మార్చు

  1. విజ్ఞాన సర్వస్వం విశ్వసాహితి. హైదరాబాద్‌. p. 830. ISBN 81-86073-09-4.

వెలుపలి లంకెలు మార్చు