డోలనము

(ఓసిలేషన్ నుండి దారిమార్పు చెందింది)

“ఓసిలేషన్” అనిన ఏదైనా ఒక మధ్యస్థ స్థితిని లేక రెండు కాని ఎక్కువ స్థితులను ప్రామాణంగా చేసుకొని సమయముతో పాటు పునరావృతం చేయడం.కొన్ని సందర్భాలలో దీనికి బదులు “వైబ్రేషన్” అన్న పదం వాడుతారు. దీనికి లోలకం మంచి ఉదాహరణ. ఇది ఒక భౌతిక శాస్త్రం అనే కాకుండా అన్ని చోట్లా కనిపిస్తుంది. మనిషి గుండె చప్పుడు కానీ, వాద్య పరికరాల్లోని తీగ పరికరాలు కానీ, ఆర్థిక శాస్త్రంలోని వ్యాపార చక్రాలు కానీ, నరాల కణాల క్రమ తొలగింపు కానీ, జియాలజీ లోని భూఉశ్ణ గీజర్లు కానీ, ఆవరణ శాస్త్రం లోని ప్రిడేటర్ – ప్రే సంబంధాలలో కానీ, సెఫైడ్ నక్షత్రాల పరిణామ క్రమ పెరుగుదల కానీ, ఎక్కడ చూసినా దీని ఉనికి లేని రంగం లేదు.

సాధారణ హార్మోనిక్ ఓసిలేటర్

మార్చు

అతి సాధారణమైన యాంత్రిక ఓసిలేటర్ కు ఉదాహరణగా హార్మొనిక్ ఓసిలేటర్ ను చెప్పొచ్చు. ఇందులో ఒక వస్తువును ఒక స్ప్రింగుకు అమర్చి కేవలం దాని బరువు, స్ప్రింగ్ శక్తులే ఆధారంగా వదిలేయదం జరుగుతుంది. దీనిని ఒక మేజు మీద పెట్టి కుడా ఉంచవచ్చు. స్ప్రింగ్ సాథారణ స్థితిలో ఉన్నప్పుడు అది సమతౌల్య స్థితిలో ఉంటుంది. ఆ వస్తువును సమతౌల్య స్థితి నుండి జరిపినచో అది మళ్ళీ ఆ స్థితిని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాని ఆ స్థితికి వచ్చే కల్లా కొంత వేగం రావడం వల్ల అది అంతటితొ ఆగక ముందుకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చి అలా దాని చలనాన్ని పునరావృతం చేస్తుంది.ఒకవేళ దానిని వెనకకు లాగే శక్తి దాని దూరానికి కొలమానమైతే దానిని సాధారణ హార్మొనిక్ ఓసిలేటర్ అంటారు. దాని గతి శక్తి సంభావ్య శక్తుల మధ్య దాని శక్తి మారుతు ఉంటుంది. ఒకసారి దాని స్థితికి తిరిగి రావడానికి పట్టే కాలాన్ని ఒక పిరియడ్ అంటారు. ఓసిలేటర్ కు సంబంధించిన అన్ని లక్షణాలను ఇందులో చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు.

డాoప్ద్, డ్రివెన్ ఓసిలేషన్

మార్చు

నిజ జీవితంలో అన్ని రకాల ఓసిలేశన్లు ఉష్ణోగ్రత ప్రకారం తిరిగి తన పాత స్థితికి చేరుకోలేవు. ఎందుకనగా దాని శక్తిలో కొంత భాగం చుట్టూ ఉన్న పర్యావరణంతో రాపిడి వల్ల, విద్యుత్తు ప్రతిఘటన వల్ల కోల్పోతుంది. దీనిని డాంపింగ్ అంటారు. దీని వలనే కొంతసమయం తర్వాత దాని గతి ముగుస్తుంది. ఉదా: లోలకం కొద్ది సేపటికి ఆగిపోవుట. ఒకవేళ దాని మీద బయటి శక్తి పంపితే దానిని “ ద్రివెన్ “ ఓసిలేశన్స్ అంటారు. ఉదా: ఎ.సి సర్క్యూట్ కి బయటి నుండి విద్యుత్తు పంపడం . కొన్ని వ్యవస్థలలో బయటి నుండి వచ్చే శక్తి వల్ల దాని శక్తి పెరిగే అవకాశం కూడా ఉంది. ఇలాంటివి మామూలుగా ద్రవ ప్రవాహాలు ఉన్న చోట్ల వస్తుంది. ఉదా: విమాన రెక్కలో చిన్న కదలిక వల్ల గాలి దాడి చేసే కోణం పెరిగి దాని మీద లిఫ్ట్ పెరిగి అది మరింత గాల్లో లేస్తూంది.

జత ఓసిలేటర్

మార్చు
 

దీనికన్నా క్లిశ్తమైన అమరికలు కుడా ఉంటాయి. దీనికి ఉదాహరణ రెండు వస్తువులను, ముడు స్ప్రింగులను కలుపుట. ఒకే గోడకు రెండు లోలక గడియారాలు కట్టుట. చుడదానికి చాలా క్లిస్టంగా కనిపించినా వాటి వాటి గతులు గణించినచో చాలా సులభంగా వచ్చును. దీనిని 1665లో మొదటగా కాంతి తరంగసిద్ధాంత ప్రతిపాదించిన క్రిస్టీయన్ హుయ్గెన్స్ గమనించారు. ఇందులో కూడా కొన్ని ప్రత్యేక వ్యవస్థలు ఉన్నాయి. ఉదా: విల్బెర్ఫొర్స్ లోలకమ్ ఇందులో ఒక నిలువు స్ప్రిన్గ్, దాని చివర ఉన్న ఒక తిరిగే బంతి మధ్య శక్తి మారుతూ ఉంటుంది.

తరoగాలు

మార్చు

ఒకవేళ ఆ వస్తువు వెళ్ళగల మార్గాలు అనేకం ఉన్నచో తరంగాలు ఏర్పడును. ఉదా:నీటిపై వస్తువు. అటువంటి వ్యవస్థలకు లెక్కలేనన్ని గతి మార్గాలు ఉండును.

 

ఓసిలేషన్ కు సబంధించిన గణితంలో ఒక ప్రమేయం దాని రెండు తీవ్రతల మధ్య ఎలా వెళ్లునో విశ్లేషిస్తుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=డోలనము&oldid=4078808" నుండి వెలికితీశారు