ఓసీ (ఓన్లీ సినిమా) 2024లో విడుదలైన తెలుగు సినిమా. కౌండిన్య ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బివిఎస్ నిర్మించిన ఈ సినిమాకు విష్ణు బొంపెల్లి దర్శకత్వం వహించాడు. హరీష్ బొంపెల్లి, మాన్య సలాడి, రోయల్ శ్రీ, లక్ష్మీ కిరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 2న నటుడు మురళి మోహన్‌, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేతులమీదుగా విడుదల చేసి,[1] సినిమాను జూన్ 7న విడుదల చేశారు.[2][3][4]

ఓసీ
దర్శకత్వంవిష్ణు బొంపెల్లి
రచనలక్ష్మి కిరణ్ అల్లంరాజు
కథహరీశ్‌ బొంపెల్లి
నిర్మాత
  • బీవీఎస్‌
తారాగణం
ఛాయాగ్రహణంతుమ్మలపల్లి సాయిరాం
సంగీతంభోలే శావళి
నిర్మాణ
సంస్థ
  • కౌండిన్య ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ
7 జూన్ 2024 (2024-06-07)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

హైదరాబాద్ ఓ బస్తీలో అనాథలైన రాక్ (హరీష్ బొంపెల్లి), మాగ్నైట్ (రాయల్ శ్రీ), కమల్ హాసన్ (లక్ష్మీ కిరణ్) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఎప్పటికైనా సినిమాల్లో నటించాలని అనుకునే వీరు ఫిల్మ్ నగర్, కృష్ణా నగర్ లొని ప్రతి స్టూడియో, సినిమా ఆపీసు తిరుగుతూ సినిమా ఆడిషన్స్ ఇస్తుంటారు. ఈ క్రమంలో వారికీ అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తరువాత అనుకోని పరిస్థితుల్లో గల్లీ రౌడీ బాబు రావు (జీవన్ కుమార్)తో గొడవలు మొదలై వీరికి అండగా ఉన్న నర్సింగ్‌ను బాబు రావు చంపేస్తాడు. దీంతో వీరు ప్రాణ భయంతో పారిపోతారు. అలా పారిపోయిన వీరు తమ లక్ష్యం కోసం ఏం చేశారు? బాబురావు మనుషులనుండి ఎలా తప్పించుకున్నారు? చివరికి వీరికి అవకాశం వచ్చిందా ? లేదా? అనేదే మిగతా సినిమా కథ.[5]

నటీనటులు

మార్చు
  • హరీష్ బొంపెల్లి
  • మాన్య సలాడి
  • రోయల్ శ్రీ
  • జీవన్ కుమార్
  • లక్ష్మీ కిరణ్
  • యోగి
  • వివేక్
  • సర్కార్
  • సూర్య పింపిమ్

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: కౌండిన్య ప్రొడక్షన్స్‌
  • నిర్మాత: బీ.వీ.ఎస్‌
  • కథ: లక్ష్మి కిరణ్ అల్లంరాజు
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విష్ణు బొంపెల్లి
  • సంగీతం: భోలే శావళి
  • సినిమాటోగ్రఫీ: తుమ్మలపల్లి సాయిరాం
  • కొరియోగ్రాఫర్: సత్య మాస్టర్

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఓసీ అంటే ఏంది రా"భోలే శావళిభోలే శావళి3:16
2."ప్రాణం ప్రాణం"భోలే శావళిభోలే శావళి2:03
3."చెప్పకుండా వచ్చినవ్"భోలే శావళిభోలే శావళి3:46

మూలాలు

మార్చు
  1. Nava Telangana (2 June 2024). "మెప్పించే కాన్సెప్ట్‌". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
  2. Chitrajyothy (3 June 2024). "వినోదం సందేశం కలబోతగా". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
  3. Pynr (22 May 2024). "OC set to release in theaters on June 7 | The Pioneer". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
  4. Chitrajyothy (22 May 2024). "జూన్‌లో 'ఓ.సి' వినోదం". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
  5. Zee News Telugu (7 June 2024). "'ఓన్లీ' మూవీ రివ్యూ.. ఓన్లీ సినిమానే జీవితం అనుకునే బస్తీ పోరగాళ్ల కథ." Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=ఓసీ&oldid=4236912" నుండి వెలికితీశారు