ఔరంగాబాద్ (బీహార్)

బీహార్ రాష్ట్రం లోని పట్టణం

ఔరంగాబాద్ బీహార్ రాష్ట్రం, ఔరంగాబాద్ జిల్లాలోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. 2011 నాటికి పట్టణ జనాభా 1,02,244. ఈ ప్రాంత ప్రజలు మగాహి, హిందీ మాట్లాడతారు.

ఔరంగాబాద్
పట్టణం
ఔరంగాబాద్ is located in Bihar
ఔరంగాబాద్
ఔరంగాబాద్
బీహార్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 24°42′N 84°21′E / 24.70°N 84.35°E / 24.70; 84.35
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాఔరంగాబాద్
విస్తీర్ణం
 • Total1,419.7 కి.మీ2 (548.1 చ. మై)
Elevation
108 మీ (354 అ.)
జనాభా
 (2011)[1]
 • Total1,02,244
 • జనసాంద్రత72/కి.మీ2 (190/చ. మై.)
Time zoneUTC+5:30 (IST)
PIN
824101
టెలిఫోన్ కోడ్06186
ISO 3166 codeIN-BR
Vehicle registrationBR-26
లింగనిష్పత్తి1000:910 /

భౌగోళికం

మార్చు

ఔరంగాబాద్ పట్టణం ఈశాన్య భారతదేశంలో, జాతీయ రహదారి19 పైన, జాతీయ రహదారి139 తో కలిసే స్థలం వద్ద ఉంది. దాని సమీప పెద్ద పట్టణం గయ నుండి 70 కి.మీ. దూరంలో ఉంది. బీహార్ రాజధాని పాట్నా నుండి ఈశాన్య దిశలో 140 కి.మీ. దూరంలో ఉంది. సోన్ నది, పున్పున్ నది జిల్లా గుండా ప్రవహిస్తున్న రెండు ప్రధాన నదులు.

పట్టణం విస్తీర్ణం 89 చ.కి.మీ.[2]

ఔరంగాబాద్ అద్రి నది ఒడ్డున ఒండ్రు మైదానంలో ఉంది.[3] దీని కంటే పెద్దదైన సోన్ నది పట్టణానికి పడమర వైపున 26 కి.మీ. దూరంలో ప్రవహిస్తోంది. పున్‌పున్, ఔరంగా, బటానే, మోర్హార్, మాదార్ అనే ఇతర నదులు కూడా ఔరంగాబాద్ జిల్లా గుండా ప్రవహిస్తున్నాయి.

జనాభా

మార్చు

2011 జనగణన ప్రకారం, ఔరంగాబాదు జనాభా 1,02,244.

రవాణా సౌకర్యాలు

మార్చు

ఔరంగాబాదుకు చక్కటి రోడ్డు, రైలు సౌకర్యాలున్నాయి. అనుగ్రహ నారాయణ్ రోడ్ రైల్వే స్టేషన్ (ఎయుబిఆర్) పట్టణం లోని సమీప రైల్వే స్టేషను. ఇది పట్తణం నుండి సుమారు 11 కి.మీ. దూరంలో ఉంది.

జాతీయ రహదారి-19 పట్టణాన్ని ఢిల్లీకి, జాతీయ రహదారి-139 కోల్‌కతాకు కలుపుతున్నాయి. జాతీయ రహదారి-139 పాట్నాను కూడా కలుపుతుంది.ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, లక్నో, భువనేశ్వర్, అహ్మదాబాద్, జైపూర్, జైసల్మేర్, నాగ్‌పూర్, భోపాల్, ఇండోర్, ఔరంగాబాద్ (మహారాష్ట్ర), జమ్మూ, హరిద్వార్, లక్నో, పూణే, ప్రయాగ్రాజ్ (అలహాబాద్), వారణాసికి నేరుగా రైళ్ళున్నాయి.

సమీప విమానాశ్రయం గయ విమానాశ్రయం, ఇది పట్టణం నుండి 80 కి.మీ. దూరంలో ఉంది.

మూలాలు

మార్చు
  1. "2011 census data". Retrieved 8 July 2019.
  2. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Bihar: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7.
  3. Dilip K. Chakrabarti (2001). Archaeological Geography of the Ganga Plain: The Lower and the Middle Ganga. Orient Blackswan. p. 2. ISBN 978-81-7824-016-9.