కంగారూ
ఆస్ట్రేలియాకి చెందిన మాక్రోపొడిదే కుటుంబంలోని మర్సుపియాల్ జాతికి చెందిన జంతువు
కేంగరూ (ఆంగ్లం Kangaroo) మార్సుపీలియాకు చెందిన క్షీరదము. ఆడజీవులు శిశుకోశాన్ని (మార్సూపియం) కలిగి ఉంటాయి. ఇవి ఆస్ట్రేలియా, టాస్మేనియా, న్యూగినియా దేశాలలో విస్తరించి ఉన్నాయి. తోక పొడవుగా ఆధార భాగంలో లావుగా ఉండి, గెంతినప్పుడు సమతుల్యతకు ఉయోగపడుతుంది. అందువల్ల తోకను కంగారూ యొక్క ఐదవ కాలుగా పేర్కొంటారు. ఇవి శాకాహార వన్య జంతువులు.
కేంగరూ[1] | |
---|---|
![]() | |
Female Eastern Grey Kangaroo with joey | |
Scientific classification | |
Kingdom
|
|
Phylum
|
|
Class
|
|
Subclass
|
|
Order
|
|
Suborder
|
|
Family
|
|
Genus
|
in part
|
జాతులు | |
మాక్రోపస్ రుఫస్ |
జాతులుసవరించు
టాస్మేనియా అడవిలో పరిగెడుతున్న కేంగరు.
కేంగరూలలో నాలుగు ముఖ్యమైన జాతులు ఉన్నాయి:
- The Red Kangaroo (మాక్రోపస్ రూఫస్): ప్రపంచంలో అన్నింటికన్నా పెద్దవి. ఇవి ఆస్ట్రేలియా మధ్యన ఎడారి ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కటి రెండు మీటర్లు పొడవుండి 90 కి.గ్రా. బరువుంటాయి.[2]
- The Eastern Grey Kangaroo (మాక్రోపస్ జైగాంటియస్): ఇవి ఎక్కువగా సారవంతమైన ఆస్ట్రేలియా తూర్పు ప్రాంతంలో నివసిస్తాయి.
- The Western Grey Kangaroo (మాక్రోపస్ ఫులిగినోసస్): ఇవి దక్షిణ, పశ్చిమ ఆస్ట్రేలియాలలో సముద్ర తీరం వెంట నివసిస్తాయి. ఇంచుమించు 54 కి.గ్రా. బరువుంటాయి.
- The Antilopine Kangaroo (మాక్రోపస్ ఏంటిలోపినస్): ఇవి ఉత్తర ఆస్ట్రేలియాలో నివసిస్తాయి.
మూలాలుసవరించు
- ↑ Groves, C. (2005). Wilson, D. E., & Reeder, D. M, eds (ed.). Mammal Species of the World (3rd ed.). Baltimore: Johns Hopkins University Press. pp. 64 & 66. OCLC 62265494. ISBN 0-801-88221-4.CS1 maint: multiple names: editors list (link) CS1 maint: extra text: editors list (link) CS1 maint: ref=harv (link)
- ↑ "Red Kangaroos". Retrieved 2007-01-07.