కంటిపాప
(కంటి పాప నుండి దారిమార్పు చెందింది)
కంటిపాప (Pupil) జంతువుల కన్నులోని భాగము.
కంటిపాప | |
---|---|
The human eye The pupil is the central transparent area (showing as black). The grey/blue area surrounding it is the iris. The white outer area is the sclera, the central transparent part of which is the cornea. | |
Schematic diagram of the human eye. |
ఇది ఐరిస్ (Iris) మధ్యభాగంలో ఉంటుంది. దీని గుండా కాంతి కనుగుడ్డులోనికి ప్రవేశించి రెటినా ను చేరుతుంది. తద్వారా మనం బయటి వస్తువుల్ని చూడగలుగుతున్నాము.[1] ఇది ఎక్కువమందిలో నలుపు రంగులో ఉంటుంది. మానవులలో కంటిపాప గుండ్రంగా ఉంటుంది; అయితే పిల్లి వంటి కొన్ని జంతువులలో ఇది సన్నగా పొడవుగా ఉంటుంది.[2] దీని పరిమాణం స్థిరంగా ఉండకుండా కాంతి తీవ్రతను బట్టి మారుతుంటుంది. వెలుతురు ఎక్కువగా ఉండే పగటి పూట ఇది చిన్నగా ఉండి చీకటిగా ఉండే రాత్రి సమయంలో ఇది పెద్దదిగా మారుతుంది.