గొంతు

(కంఠం నుండి దారిమార్పు చెందింది)

గొంతు, గొంతుక, కంఠము లేక గళం ముక్కు, నోరులకు వెనుక భాగంలో స్వరపేటిక, అన్నవాహిక లకు పైనున్న భాగం. ఇది జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థలకు రెండింటికి చెందుతుంది. ఆహారం అన్నవాహికలోనికి, గాలి ఊపిరితిత్తులలోనికి ఒకదానితో ఒకటి కలవకుండా దీని ద్వారా వెళ్తాయి[1][2].గొంతు లేక గళంలో మూడు భాగాలు ఉంటాయి. ముక్కు వెనుకను, మృదుతాలువునకు పైనా ఉండు గొంతుభాగం నాసికాగళం[3]. నాసికాగళంలోనికి రెండు ప్రక్కలా శ్రవణకంఠ నాళికల ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ శ్రవణకంఠ నాళికలు మధ్యచెవులను గొంతుతో కలుపుతాయి. నాసికాగళం ముందు భాగంలో ముక్కు వెనుక రంధ్రాలు తెరుచుకుంటాయి. వెనుక భాగంలో శ్లేష్మపు పొర క్రింద దళసరి రసికణజాల రాశులు ఉంటాయి.నోటి వెనుక ఉండు గొంతు భాగం వక్త్రగళం[3]. ఈ భాగం అంగిలి నుంచి కంఠికాస్థి ( హయాయిడ్ ఎముక ) వరకు ఉండే గళభాగం. మృదుతాలువు నుంచి రెండు పక్కలా నాలుక మూలానికి ఒకటి, గళంకు ఒకటి తెరలు క్రిందకు దిగుతాయి. ఈ తెరల నడిమిలో గళ రసికణ గుళికలు ( టాన్సిల్స్ ) ఉంటాయి. మృదుతాలువు మధ్యభాగం నుంచి కొండనాలుక ( ఉపజిహ్వ ) గొంతులోనికి వ్రేలాడుతుంది[4]. కంఠికాస్థి నుంచి అన్ననాళ ప్రవేశద్వారం వరకు ఉండు గొంతు భాగము అధోగళం[3]. దీనిలో ముందుభాగంలో స్వరపేటిక ఉంటుంది. స్వరపేటికకు మీద నాలుక మూలంలో స్వరపేటిక మూత ఉంటుంది. ఆహారాన్ని శ్వాసపథంనుంచి తప్పించి అన్ననాళంవైపు మరలించుటకు ఈ స్వరపేటిక మూత తోడ్పడుతుంది. స్వరపేటికకు ఇరుప్రక్కల కాయల ఆకారపు గుంతలు ఉంటాయి[4]. గొంతుక స్వరపేటిక క్రింద ఉండే

తల మెడలో భాగాలు
నోరు, నాలుక, గవదలు, మృదుతాలువు కొండనాలుక, నోటివెనుక వక్త్రగళం.

ముద్రికా మృదులాస్థి ( క్రైకాయిడ్ కార్టిలేజ్ ) వెనుక, ముద్రికా గళ నియంత్రణ కండరం (క్రైకో ఫెరింజియల్ స్ఫిన్టరు) క్రింద అన్ననాళంగా కొనసాగుతుంది. ముద్రికా మృదులాస్థి ఉంగరపుటాకారములో ఉంటుంది[5].

భాషా విశేషాలు

మార్చు

తెలుగు భాషలో గొంతు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. గొంతు లేదా గొంతుక నామవాచకంగా The throat. కంఠము. The voice, a tone కంఠధ్వని అని అర్ధము. ఉదా: గొంతు పట్టినది I am chocked, i.e., I do not know what to say. నా గొంతు రాసినది I am hoarse. వాని గొంతు కమ్మినది he is hoarse. గొంతుకపోక or గొంతునబడి n. The apple of the throat. గొంతు కూర్చుండు v. n. అనగా To squat down on one's heels. గొంతుకోత n. A cut throat business. A brawl, a quarrel. గొంతెమగోరుచెట్టు n. A plant, Paederia foetida. సారణి, లంజె. సవరము. గొంతెమ్మ ఒక గ్రామదేవత. మహాభారతంలో కుంతి తెలుగులో గొంతిగా మార్పు చెందింది. గొంతి తన తొలి సంతానం కర్ణుడిని పాండవులతో యుద్ధము చేయక వారితో సహా బ్రతికియుండాలని కోరింది. మిగిలిన పాండవులను చంపనని, కాని తాను, అర్జునుడులలో ఒకరే ఆమెకు మిగులుతారని, చివరకు గొంతికి మిగిలేది ఐదుగురు కుమారులు మాత్రమే అని కర్ణుడు గొంతికి (కుంతికి) మాట యిస్తాడు. కుంతి కోర్కెలు గొంతెమ్మ కోరికలు నానుడిగా ప్రసిద్ధికెక్కాయి[6] n. Whimsical speculations, castles in the air. కోరదగని కోరికల, వెర్రిమూచనలు.

మూలాలు

మార్చు
  1. "https://www.cancer.gov/publications/dictionaries/cancer-terms/def/pharynx". www.cancer.gov (in ఇంగ్లీష్). 2011-02-02. Retrieved 2024-07-11. {{cite web}}: External link in |title= (help)
  2. "Pharynx Anatomy: Overview, Gross Anatomy, Microscopic Anatomy". 2021-04-16. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  3. 3.0 3.1 3.2 "Pharynx - an overview | ScienceDirect Topics". www.sciencedirect.com. Retrieved 2024-07-11.
  4. 4.0 4.1 cancer, Canadian Cancer Society / Société canadienne du. "The pharynx". Canadian Cancer Society (in ఇంగ్లీష్). Retrieved 2024-07-11.
  5. Spencer, Tom. "Cricoid cartilage | Radiology Reference Article | Radiopaedia.org". Radiopaedia (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-07-11.
  6. Admin (2024-05-22). "మీరేమీ "గొంతెమ్మ కోరికలు" కోరడం లేదు కదా!". andhrapradesh.thefederal.com. Retrieved 2024-07-11.
"https://te.wikipedia.org/w/index.php?title=గొంతు&oldid=4274534" నుండి వెలికితీశారు