కండ్లకలక
కండ్లకలక (ఆంగ్లం: Conjunctivitis) ఒక రకమైన కంటికి సంబంధించిన అంటువ్యాధి.
An eye with viral conjunctivitis | |
m:en:ICD-10 | {{{m:en:ICD10}}} |
m:en:ICD-9 | {{{m:en:ICD9}}} |
DiseasesDB | 3067 |
m:en:MedlinePlus | 001010 |
m:en:eMedicine | {{{m:en:eMedicineSubj}}}/{{{m:en:eMedicineTopic}}} |
వ్యాధి లక్షణాలు
మార్చువ్యాధిగ్రస్తుల కళ్ళు ఎరుపెక్కి, నీరు కారుతూ ఉంటాయి. కంటిరెప్పలు ఉబ్బి ఉండవచ్చును. కళ్ళలో మంట, నొప్పి, కొద్దిపాటి దురద ఉంటాయి. వెలుతురు చూడటం కష్టం. కళ్ళలో పుసులు పడతాయి. ఈ లక్షణాలు ఒక కంటిలో ప్రారంభమై రెండవ కంటికి వ్యాపించవచ్చును. నిద్ర తరువాత కళ్ళరెప్పలు అంటుకొని తెరవడం కష్టమౌతుంది. ఈ వ్యాధి త్వరగా వ్యాప్తి చెంది ఎపిడెమిక్ రూపం దాలుస్తుంది. పొంగు వ్యాధిలోను, సుఖవ్యాధులతోను బాధపడే గర్భవతులకు పుట్టిన బిడ్డలకు కూడా కండ్లకలక సోకే అవకాశాలున్నాయి.[1]
జాగ్రత్తలు
మార్చు- కండ్ల నుండి కారే నీటిని, స్రావాన్ని శుభ్రమైన తడిబట్టతో శుభ్రపరచాలి.
- రోగి వాడే బట్టలు, పక్క బట్టలు, తువ్వాళ్ళు మొదలైన వాటికి కళ్ళ రసి అంటి వాటిని ఇతరులు వాడితే వ్యాధి వారికి సోకుతుంది. కనుక రోగి బట్టలను ప్రతిరోజు నీటితో ఉడికించి క్రిమిరహితం చెయ్యాలి.
- రోగి కళ్ళను శుభ్రపరచిన దూది లేక బట్ట ముక్కలను వేరే పోగుచేసి కాల్చివేయడం మంచిది.[2]
- సొంత వైద్యానికి దిగుతూ బాధితులు స్టెరాయిడ్లు వాడుతుండటంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టెరాయిడ్ వాడకంతో తాత్కాలికంగా ఉపశమనం దక్కినా దీర్ఘకాలంలో హాని జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.[3]
మందులు
మార్చుమూలాలు
మార్చు- ↑ కండ్లకలకకు సహజ చికిత్స
- ↑ కండ్లకలక దిద్దుబాటు పాలు , తేనతో
- ↑ "- - Sakshi". web.archive.org. 2023-08-06. Archived from the original on 2023-08-06. Retrieved 2023-08-06.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
బయటి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
Look up కండ్లకలక in Wiktionary, the free dictionary.