కందనామాత్యుడు
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
కందనామాత్యుడు తెలుగు కవి, రచయిత.
జీవిత విశేషాలు
మార్చుఈయన సా.శ. 1350 కాలం నాటి వాడు. ఈయనే వెలిగొందలామాత్యుడు అనే పేరుని కూడా ధరించాడు. వెలిగొందల అనే గ్రామానికి అధికారి కావడం చేత ఆ పేరు వచ్చి ఉండవచ్చును. ఇతను వాసర వారి వంశానికి చెందినా వాడు. వీరు ఇద్దరి అన్నదమ్ములు. రేసనామాత్యుడు, కందనామాత్యుడు. ఈ అన్నదమ్ములు ఇద్దరూ చాలా వైభవంగా జీవించారు. కందన మంత్రి ముప్ప భూపాలునికి సహాయ దారు. ఇతను స్వామీ భక్తుడు, కార్య చతురుడు, బహు కళావేది, నీతిజ్ఞుడు, విప్రహితుడు అని మదికి సింగన వర్ణించాడు. కందనామాత్యునికి ఇద్దరు భార్యలు. మల్లమాంబ, కాచమాంభ. ఈ ఆడ వారు కుడా దాన ధర్మాలు చేస్తూ వుండే వారు.
కందనామాత్యుని రచనలు
మార్చుకందనామాత్యుని రచనల వలన పూర్వం మగ వాళ్ళు కూడా కొప్పులు చుట్టి పువ్వులు పెట్టుకొనే వారని తెలుస్తుంది. మడికి సింగన అనే కవి పద్మ పురాణం అనే కావ్యంలోని ఉత్తర కాండ, భాగవతం దశమ స్కందం కందనామాత్యునికే అంకితమిచ్చాడు. సకల నీతి సమ్మతం అనే సంకలనంలో మడికి సింగన, కందనా మాత్యుడు ‘నీతితారావళి’ అనే పుస్తకం రాసినట్లు చెప్పుకున్నాడు. ఇందులోని 12 పద్యాలను ఉదహరించాడు. కేవలం మడికి సింగన వలన కందన కృతిభర్త, కృతి కర్త అని తెలియ వస్తున్నది. మానవల్లి రామ కృష్ణ కవి గారు, నిడదవోలు వెంకటరావు గారు, చాగంటి శేషయ్య గారు వీరి పైన పరిశోధనలు చేసారు. కందన గారు “గోపిక జాల సుఖ లోల గోపాబాల” అనే మకుటంతో పద్యాలు రాసారు.
కందన పద్యాల లోని సామెతలు
మార్చు- వడ్లు పెరుగు పిసికినట్లు-
- చెలమలు త్రవ్వినట్లు అగునే చెర్వులు గట్టుట-
- పొంనాకుల మీద తేనె పూసిన భంగిన్-
- ఇలనూనెయు కర్పూరము కలిసిన విషమైనట్లు-
మూలాలు
మార్చు1. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర