కంది శ్రీనివాస్ రెడ్డి
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ఆదిలాబాద్ ముద్దు బిడ్డ కంది శ్రీనివాస రెడ్డి. కంది అనసూయ, కిష్టారెడ్డి దంపతుల తొలి సంతానం. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కేఎస్‌ఆర్ బాల్యమంతా ఆదిలాబాద్ లోనే గడిచింది. చదువులో ఎప్పుడూ చురుకుగా ఉండే కంది శ్రీనివాసరెడ్డి కాగజ్ నగర్ జవహర్ నవోదయలో ఇంటర్ వరకు విద్యనభ్యసించాడు. అనంతరం హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదివి పట్టా పొందారు. ఆ తరువాత పై చదువుల కోసం విదేశాలలోని ప్రఖ్యాత యూనివర్సిటీలో సీట్ సాధించి స్వయం కృషితో రాణించి అంచెలంచెలుగా ఎదిగారు. అద్వితీయం.. అసాధరణంగా ఆదిలాబాద్ రైతు బిడ్డ కంది శ్రీనివాస రెడ్డి అమెరికా ప్రస్థానంలో ప్రపంచ ప్రఖ్యాత మిస్సోరి యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందారు. ఫైనాన్స్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ పట్టా పొందారు.
Kandi Srinivasa Reddy | |||
[[Image:|225x250px|కంది శ్రీనివాస్ రెడ్డి]] Kandi Srinivasa Reddy | |||
నియోజకవర్గం | Adilabad | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | August 5 Hasnapur , Khodad | ||
జాతీయత | Indian | ||
రాజకీయ పార్టీ | Indian National Congress Party | ||
జీవిత భాగస్వామి | Kandi Sai Mouna Reddy | ||
సంతానం | Arika Reddy , Ishaan Reddy | ||
నివాసం | Adilabad | ||
మతం | Hindu |
వ్యాపార ప్రస్థానం
మార్చుకంది శ్రీనివాసరెడ్డికి చిన్నప్పటినుండి పట్టుదల ఎక్కువ. ఏదైనా కావాలనుకుంటే దాన్ని సాధించే వరకు వదలని తత్వం ఆయనది. అదే పట్టుదల, అచంచలమైన ఆత్మవిశ్వాసం, ఆయనను లక్ష్య సాధన దిశగా నడిపించింది. ధనమూలమిదం జగత్.. దేనికైనా డబ్బు కావాలనే సూత్రంతో... పేదరికంలో పుట్టిన కేఎస్‌ఆర్‌లో ఎదగాలన్న తపనకు బీజం పడింది. మారుమూల వెనుకబడిన ప్రాంతమైన ఆదిలాబాద్ నుంచి అమెరికాకు పయనమయ్యేలా చేసింది. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా మొదలైన ఆయన ప్రస్థానం నిర్విరామ శ్రమ, అకుంఠిత దీక్షా దక్షతలతో కంపెనీల స్థాపన వరకు చేరింది. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే ఒక్కో సంస్థ నెలకొల్పుతూ అనతి కాలంలోనే అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో 14 సాఫ్ట్ వేర్ కంపెనీలు స్థాపించాడంటే అతని స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. విదేశాలలోనే కాకుండా తన మాతృభూమిలో కూడా పలు కంపెనీలు ఏర్పాటు చేసి వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు. హైదరాబాద్ లో కూడా సాప్ట్‌వేర్ కంపెనీ స్థాపించి ఆదిలాబాద్ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. . ఆదిలాబాద్‌లో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తాను సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని జిల్లా వాసుల ప్రయోజనాలకు కేటాయించాలన్న తాపత్రయం ఆయనది. సామాజిక సేవను విస్తృతపరిచేందుకు కెఎస్ఆర్ ఫౌండేషన్ నెలకొల్పి తద్వారా జిల్లాలో లెక్కకు మించి సామాజిక సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే ఆదిలాబాద్ జిల్లాలో కంది శ్రీనివాస రెడ్డి ఫౌండేషన్ ఆప్తబంధుగా మారింది.
రాజకీయ ప్రస్థానం
మార్చుకంది శ్రీనివాస రెడ్డి రాజకీయ ప్రస్థానం బీజేపీ తో మొదలైనా సెక్యూలర్ భావాలు ఉండటంతో... కమలం పార్టీలో ఉండలేక కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరిక సమయంలో ఆదిలాబాద్‌లో బలహీనంగా ఉన్న హస్తం పార్టీ.. ఇప్పుడు కంది శ్రీనన్న ఎంట్రీతో పార్టీ క్యాడర్‌లో జోష్ పెరిగి పూర్తిగా బలోపేతమయ్యిందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతుంటారు.అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ టికెట్ పై పోటీ చేసి కొందరి ద్రోహం కారణంగా ఓడిపోయినా గతంలో ఏ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి కూడా రానన్ని ఓట్లు, ఓటింగ్ శాతాన్ని సాధించారు కంది శీనన్న. అంతే కాకుండా ఓడిన కూడా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ప్రజల క్షేమం కోసం జనం బాట పట్టారు. తన ఓటమికి ఎవరు నిరాశ పడవద్దని శ్రేణుల్లో ధైర్యం నింపారు. తాను ఓడినా గెలిచినా ప్రజల మనిషినని, ప్రజలే తనకు సర్వస్వమన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధి లక్ష్యంగా తాను రాజకీయాల్లోకి వచ్చానని అదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇక్కడే ఉంటా.. మీతోనే ఉంటా.. మీలో ఒకడిగా ఉంటానని ఆయనప చెబుతున్న మాటలు ఇటు పార్టీ శ్రేణుల్లో అటు ప్రజల్లో కొండంత భరోసా కల్పిస్తున్నాయి. అనంతరం వచ్చిన లోక్ సభ ఎన్నికల్లోనూ పార్టీ ఎంపీ అభ్యర్ధితో కలిసి నియోజక వర్గంలో విస్తృత ప్రచారం చేశారు. దురదృష్టవశాత్తు ఆమె ఓడిపోయినా పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో తన నియోజకవర్గం నుండి అత్యధిక ఓట్లను సాధించిపెట్టారు. అసెంబ్లీ నుండి పార్లమెంట్ ఎన్నికల సమయానికి పార్టీని మరింత బలోపేతం చేశారు. ప్రజల కోసం పట్టణంలో ఆయన స్థాపించిన ప్రజా సేవాభవన్ ఎల్లప్పుడూ కార్యకర్తలు అభిమానులతో సందడిగా ఉంటుంది. నియోజకవర్గ అసెంబ్లీ ఇంఛార్జిగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ తనవంతుగా సాయం చేస్తుంటారు. అంతే కాకుండా తన ఫౌండేషన్ సిబ్బందితో ఇటు క్యాంపు ఆఫీస్ అటు రిమ్స్ లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారంటే ప్రజల సమస్యల పట్ల ఎంత నిబద్ధత ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఆధారం
మార్చు- ↑ "సి ఇ ఓ తెలంగాణ అఫిడవిట్". Archived from the original on 2023-11-20.