కంప్యూటర్ నెట్వర్క్

కంప్యూటర్ నెట్వర్క్ లేదా డేటా నెట్వర్క్ అనేది ఒక టెలికమ్యూనికేషన్ నెట్వర్క్, అది కంప్యూటర్లకు డేటా మార్పిడిని అనుమతిస్తుంది. కంప్యూటర్ నెట్వర్క్ లలో, నెట్వర్క్ కంప్యూటింగ్ పరికరాల డేటా కనెక్షన్లతో ఒకరికొకరు డేటాను తరలించుకుంటారు. నోడ్స్ మధ్య కనెక్షన్లను (నెట్వర్క్ లింకులు) కేబుల్ మీడియా లేదా వైర్ లెస్ మీడియాను గాని ఉపయోగించి ఏర్పరుస్తారు. అందరికి బాగా తెలిసిన కంప్యూటర్ నెట్వర్క్ ఇంటర్నెట్.

పర్సనల్ కంప్యూటర్లు వినియోగిస్తున్న పెద్ద పెద్ద సంస్థలలో వివిధ డిపార్టుమెంటులలో జరిగే ప్రక్రియలను ఒకరికొకరు తెలుసుకొనుటకు నెట్‌వర్క్ లు ఆభివృద్ధి చేయబడినాయి. వీటివలన వ్యక్తిగత కంప్యూటర్లను ఒకదానికొకటి అనుసంధానము చేయగలము. ఒక కంప్యూటరులో వున్న ఖరీదయిన, విలువయిన సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాము భాషలను, ప్యాకేజీలను ఇతర కంప్యూటర్లు కూడా వినియోగించుకొనగలవు. ఒకేఫైలుని 2, 3 కంప్యూటర్లలో ఒకేసారి నిల్వచేయ వీలవుతుంది. ఒక కంప్యూటరు పాడయి పోయినను వేరొక దాని నుండి మనకు కావలసిన ఫైలును పొందగలము. దీనినే క్లయింట్ - సర్వర్ మోడల్ అంటారు. పెద్ద పెద్ద సంస్థలలో దూరముగా వున్న విభాగములలో పని చేయు ఉద్యోగస్థులు అనుసంధించబడిన కంప్యూటర్ల ద్వారా సంభాషించగలరు. 1970లలో ప్రారంభమయిన ఈ ప్రక్రియ మొదట పెద్ద కంపెనీల వారికి మాత్రమే అందుబాటులో ఉండేది. 1990 దశకములో ఇళ్ళకు, వ్యక్తిగత అవసరములకు కూడా ఇంటర్నెట్ రూపములో లభ్యమగుచున్నది.