కంప్యూటర్ ప్రింటర్

ప్రింటుకు కావలసిన విషయాలను పేపరు మీద ముద్రించుకొనుటకు ప్రింటర్‌లను ఉపయోగిస్తాము. ఈ ప్రింట్‌అవుట్ లను శాశ్వత డాక్యుమెంట్లుగా దాచుకోవచ్చు. కంప్యూటర్ ప్రింటర్ సి.పి.యు నుండి వివరాలను తీసుకొని మనకు అర్ధమయ్యే భాషలో ప్రింటు చేస్తుంది. ప్రింటర్ ద్వారా పొందిన కాపీని హార్డ్ కాపీ అని కూడా అంటారు. ప్రింటర్ ద్వారా మనం పొందే రంగును బట్టి ప్రింటర్లు రెండు రకాలు.

HP LaserJet 5 ప్రింటర్
జెడ్ఇయుఎస్ (ZEUS) కంపెనీ ఇంటిగ్రేటెడ్ కంప్యూటర్, టచ్ స్క్రీన్, 3డి స్కానింగ్ ఫంక్షనాలిటీతో ఉన్న ఆల్ ఇన్ వన్ 3డి ప్రింటర్.

బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్స్ : ఇవి తెల్లని లేదా ఇచ్చిన రంగు పేపరు మీద నల్లని అక్షరాలు ప్రింటు చేస్తాయి.

కలర్ ప్రింటర్స్ : ఇవి రంగు రంగులలో మనం ఎన్నుకున్న రంగును బట్టి ముద్రిస్తాయి.

కంప్యూటర్ ప్రింటర్ పదమును నిర్వచిస్తే " కంప్యూటర్‌కి సంబంధించిన డాక్యుమెంట్లు లేదా కంప్యూటర్ లో ఉన్న ఇతర సమాచారంను కాగితం కాపీలను ముద్రణ చేసుకోవడానికి కంప్యూటర్‌కు అనుసంధానించే (కనెక్ట్ ) చేయగల ఒక యంత్రం.[1]

చరిత్రసవరించు

కంప్యూటర్ ప్రింటర్ల చరిత్ర ను పరిశీలిస్తే 1938 సంవత్సరములో సీటెల్ ఆవిష్కర్త చెస్టర్ కార్ల్సన్ (1906-1968) ఎలక్ట్రోఫోటోగ్రఫీ అనే పొడి ముద్రణ ప్రక్రియను కనుగొన్నప్పుడు ప్రారంభమైంది. దీనిని సాధారణంగా జిరాక్స్ అని పిలుస్తారు , ఇది రాబోయే దశాబ్దాల లేజర్ ప్రింటర్లకు పునాది సాంకేతికతగా ఉన్నది . 1953లో, మొదటి హై-స్పీడ్ ప్రింటర్ ను యూనివాక్ కంప్యూటర్ లో ఉపయోగించడానికి రెమింగ్టన్-రాండ్ అభివృద్ధి చేశాడు . ఇయర్స్ అని పిలువబడే లేజర్ ప్రింటర్ 1969 సంవత్సరములో జిరాక్స్ పాలో ఆల్టో రీసెర్చ్ సెంటర్ లో అభివృద్ధి చేయబడి, నవంబర్ 1971 సంవత్సరములో పూర్తయింది. జిరాక్స్ ఇంజనీర్ గ్యారీ స్టార్క్ వెదర్ (జననం 1938) కార్ల్సన్ జిరాక్స్ కాపీయర్ టెక్నాలజీని ఉపయోగించి లేజర్ ప్రింటర్ తో జోడించాడు. జిరాక్స్ కార్పొరేషన్ వాళ్ళ ప్రకారం, "జిరాక్స్ 9700 ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ సిస్టమ్, మొదటి జెరోగ్రాఫిక్ లేజర్ ప్రింటర్ ఉత్పత్తి, 1977 సంవత్సరములో రావడం జరిగింది . మొట్టమొదటి ఐబిఎమ్ 3800 1976 సంవత్సరములో విస్కాన్సిన్ లోని మిల్వాకీలోని ఎఫ్.డబ్ల్యు. వూల్వర్త్ ఉత్తర అమెరికా డేటా సెంటర్ లోని సెంట్రల్ అకౌంటింగ్ కార్యాలయంలో ఇన్ స్టాల్ చేయబడింది." ఐబిఎమ్ 3800 ప్రింటింగ్ సిస్టమ్ పరిశ్రమ మొదటి హై-స్పీడ్, లేజర్ ప్రింటర్. ఇది ఒక లేజర్ ప్రింటర్, ఇది నిమిషానికి 100 కంటే ఎక్కువ ఇంప్రెషన్ల వేగంతో పనిచేస్తూ , లేజర్ టెక్నాలజీ , ఎలక్ట్రోఫోటోగ్రఫీని కలిపిన మొదటి ప్రింటర్. 1976 సంవత్సరములో ఇంక్ జెట్ ప్రింటర్ వచ్చినా , హ్యూలెట్-ప్యాకర్డ్ కంపెనీ డెస్క్ జెట్ ఇంక్ జెట్ ప్రింటర్ ను విడుదల చేయడంతో, ఇంక్ జెట్ వినియోగదారులకు రావడానికి 1988 సంవత్సరములో వరకు పట్టింది, ఈ ప్రింటర్ ధర $1000. 1992 సంవత్సరములో, హ్యూలెట్-ప్యాకర్డ్ ప్రసిద్ధి గాంచిన లేజర్ జెట్ 4ను మార్కెట్లో విడుదల చేసింది[2] [3]

కంప్యూటర్ ప్రింటర్స్ రకాలుసవరించు

లేజర్ ప్రింటర్ల నుండి ఇంక్ జెట్ వరకు ఉన్న ప్రింటర్ల లోని వివిధ రకాలు క్రింది విధంగా గమనించవచ్చును.[4]

 • లేజర్ ప్రింటర్లు : లేజర్ ప్రింటర్ 1960లలో జిరాక్స్ కంపనీచే అభివృద్ధి చేయబడింది, అప్పుడు ఒక కాపీయర్ డ్రమ్ పై చిత్రాలను గీయడానికి లేజర్ ను ఉపయోగించాలనే ఆలోచన మొదట పరిగణించబడి, సిరాజెట్ ప్రింటర్ల కంటే సమర్థవంతంగా ఉన్నందున లేజర్ ప్రింటర్లు ఇప్పటికీ పెద్ద కార్యాలయాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
 • సాలిడ్ ఇంక్ ప్రింటర్లు: సాలిడ్ ఇంక్ ప్రింటర్లు డబ్బు ఆదా చేయడానికి రూపొందించబడిన ప్రత్యేకమైన సిరా సాంకేతికతను ఉపయోగిస్తాయి.
 • ఎల్ ఈడి ప్రింటర్లు: ఎల్ ఈడి ప్రింటర్‌లు లేజర్ ప్రింటర్‌ల మాదిరిగానే ఉంటాయి కానీ ప్రింట్ డ్రమ్ లేదా బెల్ట్‌పై చిత్రాలను రూపొందించడానికి లేజర్ కాకుండా కాంతి ఉద్గార డయోడ్‌ను ఉపయోగిస్తాయి.
 • బిజినెస్ ఇంక్ జెట్ ప్రింటర్లు: బిజినెస్ ఇంక్ జెట్ ప్రింటర్లు బిజీగా ఉన్న కార్యాలయ అవసరాలను తీర్చడానికి పెద్ద ఎత్తున ఇంక్జెట్ టెక్నాలజీని ఉపయోగించుకుని, ప్రింటెడ్ అవుట్‌పుట్‌పై ఆధారపడటం, ఇంక్జెట్ ప్రింటర్లు వాటి విశ్వసనీయత, కారణంగా ప్రజాదరణ పొందాయి.
 • హోమ్ ఇంక్ జెట్ ప్రింటర్లు: హోమ్ ఇంక్ జెట్ ప్రింటర్లు ప్రొఫెషనల్ , డొమెస్టిక్ సెట్టింగ్ ల్లో ఉపయోగించే అత్యంత సాధారణ ప్రింటర్ రకాల్లో ఒకటి. 1950 లలో అభివృద్ధి చేయబడిన ఇంక్ జెట్ ప్రింటింగ్ టెక్నాలజీ వాటి ప్రయోజనాలు, కొద్ది పాటి లోపాల కారణంగా ఇప్పటికి భారీగా ప్రాచుర్యం తో ఉన్నది .
 • మల్టీఫంక్షన్ ప్రింటర్లు: మల్టీఫంక్షన్ ప్రింటర్లు వీటిని ఆల్ ఇన్ వన్ ప్రింటర్లు అని పిలువబడే మల్టీఫంక్షన్ ప్రింటర్లు గా పిలుస్తారు . వీటిని ప్రింటింగ్, కాపీ, స్కానింగ్, ఫ్యాక్సింగ్ పనులను చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
 • డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్లు: డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్లు ఇప్పటికీ మార్కెట్లో అందుబాటులో ఉన్న పూర్వ కాలపు ప్రింటర్ల రకం.
 • 3డి ప్రింటర్లు: 3డి ప్రింటర్లు ప్రింటింగ్ టెక్నాలజీ అభివృద్ధి చరిత్రలో ఒకటి, ప్రొఫెషనల్, దేశీయ వినియోగదారులకు 3 డి ప్రింటింగ్ మరింత సరసమైనదిగా మారుతోంది.

అభివృద్ధిసవరించు

ప్రింట్ టెక్నాలజీ ఎంపిక ప్రింటర్ ఖర్చు, వాటి నిర్వహణ , వేగం, నాణ్యత, డాక్యుమెంట్ లతో ఉంటాయి . కొన్ని ప్రింటర్ టెక్నాలజీలు కార్బన్ పేపర్ లేదా ట్రాన్స్ పరెన్సీలు వంటి కొన్ని రకాల భౌతిక మాధ్యమాలతో పనిచేయవు. ఒక ఆధునిక కంప్యూటర్ ప్రింటర్, ఏదైనా వ్యాపార కార్యాలయంలో ,అధిక నాణ్యత టెక్స్ట్, గ్రాఫిక్స్ గా మారుతుంది.ఒక సాధారణ ఆధునిక ప్రింటర్ సగటు డెస్క్ లేదా సైడ్ టేబుల్ మూలలో సరిపోతుంది. ప్రింటర్ బల్క్ లో ఎక్కువ భాగం పేపర్ సప్లై ట్రేలు, ప్రింట్ మెకానిజం , అవుట్ పుట్ బిన్ ద్వారా తీసుకోబడుతుంది.[5]

మూలాలుసవరించు

 1. "Printer definition and meaning | Collins English Dictionary". www.collinsdictionary.com (in ఇంగ్లీష్). Retrieved 2021-08-10.
 2. inventions, Mary Bellis Inventions Expert Mary Bellis covered; films, inventors for ThoughtCo for 18 years She is known for her independent; documentaries; Alex, including one about; Bellis, er Graham Bell our editorial process Mary. "Where Did the Computer Printer Come From?". ThoughtCo (in ఇంగ్లీష్). Retrieved 2021-08-10.
 3. "Computer Printer History". www.computerhope.com (in ఇంగ్లీష్). Retrieved 2021-08-10.
 4. "Types of Printers | Printerland". Printerland Blog (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2021-08-10.
 5. "3 Advantages of Ink Jet & Laser Printers". Your Business (in ఇంగ్లీష్). Retrieved 2021-08-10.

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ