కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

కంబాలకొండ విశాఖపట్నం సమీపంలో ఉన్న ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇది 1970 నుండి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నది. అంతకు మునుపు ఇది విజయనగరం రాజుల ఆధీనంలో ఉండేది. ఇక్కడ చిరుత పులులు ఎక్కువగా కనిపిస్తాయి.[1]

కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
IUCN category IV (habitat/species management area)
కంబాలకొండ లోని ఒక సరస్సు
Map showing the location of కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
Map showing the location of కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
ఆంధ్రప్రదేశ్ పటంలో కంబాలకొండ ఉన్న ప్రదేశం ఆనవాలు
Locationవిశాఖపట్నం
Nearest cityవిశాఖపట్నం
Area70.70 కి.మీ2 (17,470 ఎకరం)
Establishedమార్చి 10, 1970
Governing bodyఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ

భౌగోళికం

మార్చు

ఈ కేంద్రం విశాఖపట్నానికి ఉత్తర దిక్కున 17.34° నుంచి 17.47° N ఉత్తర అక్షాంశాల మధ్యన, 83.04° E నుంచి 83.20° E తూర్పు రేఖాంశాల మధ్యన, ఐదవ జాతీయ రహదారికి పడమర వైపున నెలకొని ఉన్నది. విశాఖపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ప్రాంతం ఎక్కువగా ఉష్ణమండల సతత హరితారణ్యాలు, పచ్చిక బయళ్ళు, కొండలు, లోయలతో కూడుకుని ఉంటుంది.[2]

చిత్రాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వెబ్ సైటులో కంబాలకొండ పేజీ". Archived from the original on 2015-09-23. Retrieved 2016-10-20.
  2. "వీకెండ్ లో తప్పక వెళ్లాల్సిన వైజాగ్ పిక్నిక్ స్పాట్స్". Samayam Telugu. Retrieved 2023-12-26.