బల్ల (వ్యాధి లక్షణం)

(కడుపులో బల్ల నుండి దారిమార్పు చెందింది)

బల్ల (Splenomegaly) అనేది కొన్ని వ్యాధులలో కన్పించే లక్షణం. నిజానికి ఇది ప్లీహం (Spleen) యొక్క పరిమాణంలో పెద్దది కావడం వలన తెలుస్తుంది. సామాన్యంగా ప్లీహం కడుపులో ఎడమవైపు ఉదరవితానం క్రింద ఉంటుంది. చాలా రకాల వ్యాధులలో ప్లీహం పెద్దదౌతుంది. ఏవైనా రక్తకణాలు ఎక్కువగా వృద్ధిచెందినప్పుడు వాటిని నిర్మూలించే ప్లీహం కూడా పెద్దదిగా మారవలసి వుంటుంది. అలాంటప్పుడి దీనిని ఆయా వ్యాధుల లక్షణంగా భావిస్తారు. కాలేయ నిర్వహక వ్యవస్థలో పీడనం ఎక్కువ అయినప్పుడు కూడా ప్లీహం పరిమాణం పెరుగుతుంది.

బల్ల
వర్గీకరణ & బయటి వనరులు
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
DiseasesDB 12375
m:en:MedlinePlus 003276
m:en:eMedicine {{{m:en:eMedicineSubj}}}/{{{m:en:eMedicineTopic}}} 
MeSH {{{m:en:MeshID}}}

ప్లీహం పరిమాణంలో పెద్దదై ఎక్కువగా పనిచేసినప్పుడు దానిని హైపర్ స్ప్లీనిజం (Hypersplenism) అంటారు. ఇందులో రక్తంలోని ఒకటి లేదా ఎక్కువ కణాలు తగ్గిపోతాయి, మూలుగ ఎక్కువగా కణాలతో నిండి వుంటుంది. దీనిని సరిచేయడానికి ప్లీహాన్ని తొలగించవలసి వుంటుంది. ఈ శస్త్రచికిత్సను స్ప్లీనెక్టమీ (Splenectomy) అంటారు.

సాధారణ పరిమాణంలోని ప్లీహం

నిర్వచనం మార్చు

డా. అబ్దుల్ గఫర్ నిర్వచనం ప్రకారం, అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో ప్లీహం పొడవు 12 cm కంటే ఎక్కువ ఉంటే బల్ల పెరిగినట్లుగా భావిస్తారు. పౌలైన్ :

  • మధ్యస్తమైన పెరుగుదల (Moderate splenomegaly) : 11–20 cm
  • భారీ పెరుగుదల (Severe splenomegaly) : 20 cm అంతకన్నా ఎక్కువ