కణుగుల వెంకటరావు

కణుగుల వెంకటరావు తెలుగు రచయిత. అతను శ్రీకాకుళంలో కాళీపట్నం రామారావు స్థాపించిన కథానియయం నకు ట్రస్టు బోర్డు సభ్యుడు.

కణుగుల వెంకటరావు

జీవిత విశేషాలు

మార్చు

కణుగుల వెంకటరావు స్వగ్రామం బూర్జ మండలం లోని తోటవాడ గ్రామం. తన పద్దెనిమిదో ఏటనే రాసిన కథ ‘వినోదిని’ పత్రికలో ప్రచురితమైంది. అతను తంతితపాలా శాఖలో సీనియర్‌ సూపరింటెండెంట్‌గా ఉద్యోగ విరమణ చేసాడు. తరువాత అతను సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. తన స్వగ్రామంలో గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేశాడు. అతను ‘కవేరా కలం-కాలం’ పేరుతో సమగ్ర సాహిత్య గ్రంథం రాశాడు. అతను తెలుగు భాషా ఆవిర్భావం, తెలుగు పంచ కావ్యాలు అనే అనువాద వ్యాసాలు రాసాడు. [1] అతను కథానిలయంలోజరిగే అనేక సాహితీ కార్యక్రమాలలో పాల్గొనేవాడు. కొత్త రచయితలకు ప్రోత్సహించడమే కాకుండా చాలా పుస్తకాలను ఆవిష్కరించాడు.[2] అతను "గిడుగు రామమూర్తి ముందు మాటలు" అనే గ్రంథాన్ని గిడుగు రామమూర్తి 68వ వర్థంతి సందర్భంగా ప్రత్యేక సంచికగా అనువాదం చేసాడు.[3]

వ్యక్తిగత జీవితం

మార్చు

అతనికి ముగ్గురు కుమారులు. అతని పెద్ద కుమారుడు కణుగుల సుధీర్ శ్రీకాకుళంలో పేరొందిన వైద్యుడు. కణుగుల వెంకటరావు శ్రీకాకుళంలో 2021 జూన్ 18న గుండెపోటుతో మరణించాడు.[4]

మూలాలు

మార్చు
  1. Telugu, TV9 (2021-06-18). "Kanugula Venkata Rao : రచయిత కణుగుల వెంకటరావు గుండెపోటుతో కన్నుమూత.. సాహితీ లోకానికి తీరని లోటు.. - Author Kanugula Venkata Rao dies of heart attack". TV9 Telugu. Retrieved 2021-06-18.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Encourage children to read books, parents told". day in city (in ఇంగ్లీష్). 2014-01-11. Retrieved 2021-06-18.
  3. "దస్త్రం:Gidugu Rammurthy Mundu matalu.pdf - వికీసోర్స్" (PDF). commons.wikimedia.org. Retrieved 2021-06-18.
  4. "కణుగుల మృతికి పలువురి సంతాపం". EENADU. Retrieved 2021-06-18.