కమలాబాయి గోఖలే

మహారాష్ట్రకు చెందిన సినిమా నటి

కమలాబాయి గోఖలే (1900 - 1998, మే 17) మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. తన తల్లి దుర్గాబాయి కామత్‌ తోపాటు భారతీయ సినిమారంగ మొదటి నటీమణులలో ఒకరు.[2][3]

కమలాబాయి గోఖలే
కమలాబాయి గోఖలే
జననంc. 1900
మరణం1998 మే 17(1998-05-17) (వయసు 97–98)[1]
వృత్తినటి
జీవిత భాగస్వామిరఘునాథరావు గోఖలే
పిల్లలు3 (చంద్రాకాంత్ గోఖలే)
తల్లిదండ్రులుఆనంద్ కామత్ నస్నోద్కర్ (తండ్రి)
దుర్గాబాయి కామత్ (తల్లి)

కమలాబాయి 1900లో దుర్గాబాయి కామత్ - ఆనంద్ కామత్ నస్నోద్కర్ దంపతులకు మహారాష్ట్రలోని బొంబాయి నగరంలో జన్మించింది. తల్లి దుర్గాబాయి జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో చరిత్ర ప్రొఫెసర్ గా పనిచేసింది.

వ్యక్తిగత జీవితం

మార్చు

కమలాబాయికి రఘునాథరావు గోఖలేతో వివాహం జరిగింది. వారికి చంద్రకాంత్ గోఖలే, లాల్జీ గోఖలే, సూర్యకాంత్ గోఖలే అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.

నటనారంగం

మార్చు

చిత్రనిర్మాత దాదాసాహెబ్ ఫాల్కే 1912-1913లో మోహినీ భస్మాసుర సినిమా కోసం కమలాబాయిని ప్రధాన పాత్రకు ఎంచుకున్నాడు.[4] 15 ఏళ్ళు వచ్చేనాటకి కమలాబాయి సెలబ్రిటీ అయిపోయింది. 1930లలో హరిజనుల దుస్థితిపై రూపొందిన ఉషాప్ నాటకంలో నటించింది.[5] కమలాబాయి దాదాపు 35 సినిమాల్లో నటించింది. చివరి సినిమా గెహ్రయీ (1980).

నటించిన సినిమాలు (కొన్ని)

మార్చు
  1. 1913: మోహిని భస్మాసుర్ - మోహిని
  2. 1931: దేవి దేవయాని శర్మిష్ట - మిస్ కమల
  3. 1932: షీల్ బాలా
  4. 1932: నీతి విజయ్
  5. 1932: చార్ చక్రం
  6. 1932: భూటియో మహల్
  7. 1933: రాజ్‌రాణి మీరా
  8. 1933: మీర్జా సాహిబాన్
  9. 1933: లాల్-ఎ-యమన్ - లాలారుఖ్
  10. 1933: కృష్ణ సుదామ
  11. 1933: చంద్రహాస
  12. 1933: భూల్ భులైయన్
  13. 1933: భోలా షికార్
  14. 1933: ఔరత్ కా దిల్
  15. 1934: గన్సుందరి - సుశీల
  16. 1934: అంబరీష్
  17. 1934: ఆఫ్ఘన్ అబ్లా
  18. 1935: బిఖారే మోతీ
  19. 1935: బారిస్టర్ వైఫ్
  20. 1936: ప్రభు కా ప్యారా
  21. 1936: బి ఖరాబ్ జాన్
  22. 1936: ఆఖ్రీ గల్తీ
  23. 1938: స్ట్రీట్ సింగర్ (మిస్ కమల పాత్రలో)
  24. 1938: చబుక్వాలి
  25. 1939: గరీబ్ కా లాల్
  26. 1942: బసంత్
  27. 1944: స్టంట్ కింగ్
  28. 1946: సోనా చాందీ
  29. 1946: హక్దర్
  30. 1949: నవజీవనం - కమల
  31. 1952: అల్లాదీన్ ఔర్ జాదుయి చిరాగ్
  32. 1954: నాస్టిక్ - కమల
  33. 1962: ప్రైవేట్ డిటెక్టివ్
  34. 1967: బాల్యకాలసఖి
  35. 1971: హల్చల్
  36. 1972: ఏక్ నాజర్

మూలాలు

మార్చు
  1. "1st screen actress dead". The Times of India. Press Trust of India. Archived from the original on 14 February 2008. Retrieved 2022-12-19.
  2. "Entertainment Bureau | Kamala Bai Gokhale | First Indian actress". Entertainmentbureau.in. 7 June 2012. Archived from the original on 22 September 2012. Retrieved 2022-12-19.
  3. "Kamlabai Gokhale". veethi.com. Retrieved 2022-12-19.
  4. "History of Indian Cinema". Cinemaofmalayalam.net. 21 April 1913. Archived from the original on 28 September 2012. Retrieved 2022-12-19.
  5. "First Lady Of The Silver Screen-Struggle, Survival And Success". Indiaprofile.com. Retrieved 2022-12-19.