కమలిని ఫ్రం నడుక్కావేరి
కమలి నడుక్కావేరి తమిళచిత్రం, దర్శకుడు రాజశేఖర్ దొరై తొలి ప్రయత్నం ఇది. తమిళ మాధ్యమంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే కమలి సిబియస్.సిలో టాపరైన అశ్విన్IITచెన్నైలో ప్రవేశం పొందిన వైనం టివిలో చూసి స్ఫూర్తిని పొందుతుంది. తొలియవ్వనంలో ఆ యువణ్ణి ప్రేమిస్తుంది, అది ఏకపక్షప్రేమ మాత్రమే (one-sided love). ఆ పల్లెలో విశ్రాంత జీవితం గడుపుతున్న ప్రొఫెసర్ నంబి ఈ అల్లరి పల్లెటూరి పిల్లకు, అహంభావికి IIT ప్రవేశపరీక్షకు శిక్షణ ఇస్తాడు. కమలి పట్టుదలతో చదివి మద్రాసు ఐఐటిలో ప్రవేశం పొందుతుంది. అక్కడ తను ఏకపక్షంగా ప్రేమిస్తున్న సీనియర్ కోసం అన్వేషించి అతని దృష్టిలో పడడానికి విశ్వప్రయత్నాలు చేస్తూ తన గమ్యం, ధ్యేయం మరచి ప్రొఫెసర్ల తిట్లకు, మందలింపులకు, పల్లెటూరిపిల్ల అని విద్యార్థుల పరిహాసానికి గురై చదువు మానుకొని ఊరికి వెళ్ళిపోతుంది. ఆమెకు శిక్షణ ఇచ్చిన ప్రొఫెసర్ నంబి ప్రోత్సాహం, స్ఫూర్తితో మళ్ళీ మద్రాసు వచ్చి చదువులో రాణించడమేగాక, ఢిల్లీలో జరిగిన క్విజ్ లో పాల్గొని విజయం సాధిస్తుంది.
సినిమా మద్రాసు ఐఐటీలో నే చాలావరకు తీశారు. కాలేజి విద్యార్థులుగా ముసలి హిరోలను చూడడం అలవాటు పడిన కళ్ళకు అంతా యువతీయువకులే ఆపాత్రల్లో కనిపించడం సంతోషంగా అనిపిస్తుంది. సినిమా నాయిక చుట్టూ పరిభ్రమించే సినిమా. కమలినిగా అన్నధి, అశ్విన్ . గా రోహిత్ సరీఫ్ నటించారు.
సంప్రదాయ ధోరణిలో వినోదం కోరేవాళ్ళకు ఇందులో ఏమీలేదు. దర్శకుడు, అతని బృందం తమిళ సినిమాలో ఒక కొత్త దనాన్ని, హాయిగోలిపే పిల్లల గాలిని తెచ్చారు. ఒకసారి చూసి ఆయువతీయువకులను ప్రోత్సాహించవలసిన చిత్రం.Zee 5 Appలో సినిమా వీక్షించండి.
ఆకరాలు:feb,2021 లో విడుదల, దర్శకుడు:రాజశేఖర్ దురేస్వామి, నిర్మాణం: Abbundu stuidios, Chennai.